- Home
- Entertainment
- Vijay Deverakonda: పాన్ ఇండియా స్టార్స్ కి విజయ్ దేవరకొండ బిగ్ షాక్.. సంచలన స్టేట్‌మెంట్
Vijay Deverakonda: పాన్ ఇండియా స్టార్స్ కి విజయ్ దేవరకొండ బిగ్ షాక్.. సంచలన స్టేట్‌మెంట్
విజయ్ దేవరకొండ `రణబాలి` చిత్రంతో రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన టికెట్ రేట్ల పెంపుకి సంబంధించిన సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇకపై తన సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండబోదన్నారు.

టికెట్ రేట్లపై విజయ్ దేవరకొండ సంచలన స్టేట్‌మెంట్
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాలకు, భారీ సినిమాల హీరోలకు పెద్ద షాకిచ్చాడు. టికెట్ రేట్ల విషయంలో ఆయన సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తన సినిమాలకు ఇక టికెట్ రేట్ల పెంపు ఉండబోదని తెలిపారు. రణబాలి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన ఈ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాను అందరు నిర్మాతలతో మాట్లాడుతున్నానని, ఈ కండీషన్‌కి ఒప్పుకున్న నిర్మాతలకే సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు. బడ్జెట్ కంట్రోల్‌గా ఎలా చేయాలో ముందుగానే ప్లాన్ చేసి చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో తాను టికెట్ రేట్లు ఎందుకు పెంచొద్దనుకుంటున్నానో వెల్లడించారు.
ప్రసాద్ ఐమాక్స్ చేసిన పనికి బాధ పడ్డ విజయ్
విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో చదువుకునే టైమ్‌లో ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూడాలంటే టికెట్ రేట్ రూ.80 ఉండేదట. ఆ సమయంలో వాళ్ల నాన్న రోజుకి పది రూపాయలు ప్యాకెట్ మనీ ఇచ్చేవాడట. చాట్ తినకుండా వాటిని వారం రోజులపాటు దాచుకొని ఐమాక్స్ లో సినిమా చూసేవాడట. అయితే ఓ సారి సడెన్‌గా టికెట్ రేట్లు పెంచారట. 80ని కాస్త 100 రూపాయలు చేశారట. దీంతో ఆ సమయంలో తాను అనుకున్న సినిమాలు చూడలేకపోయాడట విజయ్ దేవరకొండ. ఆ సమయంలో చాలా బాధపడ్డాడట. టికెట్ రేట్లు పెంచకుంటే బాగుండు అనుకున్నాడట. అప్పట్లో తాను పడ్డ బాధ ఇప్పటికీ గుర్తు ఉందని, టికెట్ రేట్లు పెంచినప్పుడు ఆ సంఘటనలే గుర్తుకు వస్తాయని తెలిపారు. అందుకే తాను తన సినిమాలు టికెట్ రేట్లు పెంచొద్దనే కండీషన్ పెట్టినట్టు తెలిపారు. అంతేకాదు ఇకపై తాను చేసే సినిమాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. ఒకవేళ రాజమౌళి తో సినిమా చేస్తే చెప్పలేం గానీ, అప్పటి వరకు టికెట్ రేట్లు పెంచమని స్పష్టం చేశారు.
పాన్ ఇండియా హీరోలకు, భారీ సినిమాలకు విజయ్ షాక్
ఇదిలా పాన్ ఇండియా సినిమాలకు, పెద్ద హీరోలకు పెద్ద షాకిచ్చే విషయమనే చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ నిర్ణయం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. నిర్మాతల్లోనూ ఆలోచన ప్రారంభమవుతుంది. ఆడియెన్స్ కూడా దీన్ని స్వాగతిస్తారు. ఈ క్రమంలో నిర్మాతలపై, హీరోలపై ఈ మేరకు ఒత్తిడిపెరుగుతుంది. టికెట్ రేట్లు పెంచాల్సి వచ్చినప్పుడు విజయ్ స్టేట్మెంట్ చెంపపెట్టుగా నిలుస్తుంది. దీంతో వాళ్లని డైలామాలో పడేస్తుందని చెప్పొచ్చు. అందుకే విజయ్ స్టేట్‌మెంట్ పెద్ద హీరోలకు, పెద్ద సినిమాలకు, ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచాలనుకునే వారికి పెద్ద షాకిచ్చే విషయమనే చెప్పాలి.
రష్మికతో కలిసి చేసిన మూడో మూవీ రణబాలి
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం `రణబాలి` చిత్రంలో నటించారు. అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. నార్మల్ రేట్లతోనే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఈ సినిమాని చూడాలని, ఈ కథని తెలుసుకోవాలని విజయ్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రణబాలి మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రణబాలిలో ఏం చూపించబోతున్నారంటే
ఆయన మాట్లాడుతూ, `అప్పట్లో బెంగాల్ లో సంభవించిన కరవు గురించి చెప్పారు. ఎంతోమంది ప్రజలు ఆకలితో చనిపోయారట. కొన్ని అమెరికన్ పత్రికల ద్వారా భారతదేశ పరిస్థితి తెలుసుకున్న అమెరికన్లు బ్రిటీషర్లు ఎలాంటి దారుణ పరిస్థితులు సృష్టించారో తెలుసుకుని తమ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం ప్రారంభించారట. మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నమలై వెల్లడించారు. చరిత్రలో మన ప్రజలకు జరిగిన అన్యాయాల గురించి తెలుసుకుంటుంటే ఇవన్నీ నిజమా, ఇంత దారుణంగా జరిగాయా అని షాక్ కు గురవుతాం. కొందరికి మనమంటే అసలు లెక్కే కాదు. చెట్లు పుట్టల్లా మనం కూడా వాళ్లకు ఒకటే. అంత తక్కువగా చూసేవాళ్లు. మన దేశ భవిష్యత్ గురించి మనం ఆలోచించాలంటే చరిత్ర తెలియడం ముఖ్యం. ఈ సినిమాను మేము కరెక్ట్ గా అటెంప్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి సినిమాలు వస్తాయి. మన చరిత్రలో రహస్యంగా మనకు తెలియకుండా మిగిలిపోయిన అధ్యాయాలను సినిమా మాధ్యమం ద్వారా వెలికితీసే ప్రయత్నాలు జరుగుతాయి. లేదంటే ఇంకెవరూ ఇలాంటి కథల్ని ముట్టుకోరు. అందుకే ఒక బాధ్యతగా, చాలా జాగ్రత్తగా ఈ సినిమాను రూపొందించాం` అని చెప్పారు విజయ్.
బ్రిటీష్స్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు
ఆయన ఇంకా చెబుతూ, `బ్రిటీషర్స్ ఇక్కడ ఉండిపోదామని రాలేదు. వ్యాపారం కోసం వచ్చారు. ఇప్పటికీ మనలో కొందరు ఇండియన్ రైల్వేస్ బ్రిటీష్ వారు మన కోసం చేశారని అనుకుంటారు. వాళ్లు మన ప్రయాణ సౌకర్యం కోసం రైల్వే లైన్స్ నిర్మించలేదు. మన ధాన్యం, పత్తి, బంగారం..ఇలా మన సంపద దోచుకునేందుకు, రవాణా చేసుకునేందుకు అన్ని ప్రధాన నౌకాశ్రయాలకు రైల్వే లైన్స్ నిర్మించుకున్నారు. 1876 నుంచి 1878 మధ్య కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ లో వచ్చిన కరవు వల్ల 80 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే కావొచ్చు. పాశ్చాత్యులు తయారు చేసిన సాంకేతికత మనకు నిజాలు చెప్పదు. వాళ్ల కోణంలోనే చరిత్రను తెలియజేస్తుంది. ట్రావెన్ కోర్ ప్రాంతంలోనే 65 లక్షల మంది కరవుతో చనిపోయారు. ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఇంత దారుణమైన కరవు వస్తే, ఇంకా చరిత్రలో మనకు తెలియకుండా చేసిన బీహార్, బెంగాల్..ఇలా ఎన్నో కరవు ఘటనలు ఉన్నాయి. వర్షపాతం కారణంగా వచ్చే కరవు వేరు. అప్పుడు స్థానికంగా ఉండే పాలకులు, పెద్దలు రైతులకు, ప్రజలకు పన్నుల భారం తగ్గించేవారు. కానీ బ్రిటీషర్స్ వచ్చాక కరవు ప్రాంతాల్లో రెట్టింపు పన్నులు వసూళ్లు చేయడం ప్రారంభించారు. ఆ ట్యాక్స్ కట్టకుంటే భారీ ప్రాజెక్ట్ లు, రైల్వే లైన్స్ నిర్మించే దగ్గరకు వారిని తరలించి కఠోరమైన పని చేయించేవారు. దానికి నామమాత్రంగా ధాన్యం ప్రతిఫలంగా ఇచ్చేవారు. పనిచేయని వారికి ఆకలితో చావే గతి. చరిత్రలో జరిగిన ఈ దారుణాలు తెలుసుకుంటే మనసు వికలమై పోతుంది. `రణబాలి` సినిమా మీకు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఒక ఎమోషనల్ హై ఇస్తుంది. ఆద్యంత ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక మన చరిత్ర, కల్చర్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ డైరెక్టర్ రాహుల్` అని వెల్లడించారు.

