- Home
- Entertainment
- Wild Card Entry List: బిగ్ బాస్ తెలుగు 10 వైల్డ్ కార్డ్ అఫీషియల్ లిస్ట్.. ఏమాత్రం పసలేదు, ఇలా అయితే కష్టమే
Wild Card Entry List: బిగ్ బాస్ తెలుగు 10 వైల్డ్ కార్డ్ అఫీషియల్ లిస్ట్.. ఏమాత్రం పసలేదు, ఇలా అయితే కష్టమే
Wild Card Entry List: బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. మరి ఈ సారి ఎవరు రాబోతున్నారనేది క్లారిటీ వచ్చింది. ఐదుగురు కంటెస్టెంట్లు కన్ఫమ్ అయ్యారు. వాళ్లు ఎవరంటే?

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి రంగం సిద్దం
బిగ్ బాస్ తెలుగు 10 వ సీజన్ మరో మినీ గ్రాండ్ లాంచ్‌కి రంగం సిద్ధమవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి మిని లాంచింగ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇది గత కొన్ని సీజన్లుగా నడుస్తోంది. ఈ ఆదివారం 2.0 పేరుతో మరో లాంచింగ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పంపబోతున్నారు. అయితే ఈ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చింది. వాళ్ల లిస్ట్ చూస్తే మరింత నీరసంగా కనిపిస్తోంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది వీళ్లే
బిగ్ బాస్ తెలుగు 10 వైల్డ్ కార్డ్ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లు రాబోతున్నారు. వారిలో కామనర్ రామకృష్ణ ఉన్నాడు. వీరితోపాటు టీవీ నటుడు శివకుమార్, నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్, దక్షి, స్వేత నాయుడు ఉన్నారు. నూకరాజు, రాకింగ్ రాకేష్, కావ్యశ్రీ, చైత్ర రాయ్ వంటి వారి పేర్లు బయటకు వచ్చాయి. కానీ వీళ్లు మాత్రమే ఫైనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈవెంట్‌కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. మరి ఈ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల గురించి చూస్తే,
టీవీ నుంచి వస్తోన్న శివకుమార్, కామనర్ రామకృష్ణ
శివకుమార్ టీవీ నటుడు అనే విషయం తెలిసిందే. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ప్రియుడు. `కోయిలమ్మ` సీరియల్ ద్వారా పాపులర్ అయ్యాడు. `నిన్ను కోరి` సీరియల్ కూడా చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి రాబోతున్నాడు. ఆయనతోపాటు కామనర్‌గా వచ్చిన రామకృష్ణ రాబోతున్నాడు. ఈయన అగ్నిపరీక్షలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆ మధ్య అపూర్వ, మిథిలేష్‌తోపాటు రావాల్సి ఉంది, కానీ మిస్ అయ్యింది. ఇప్పుడు అఫీషియల్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు.
లేడీ కంటెస్టెంట్లు వీళ్లే
వీరితోపాటు ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు ఉన్నారు. నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్ రాబోతుంది. ఆమె పలు టీవీ షోస్‌లో మెరిసింది. బోల్డ్, స్ట్రెయిట్‌గా మాట్లాడుతూ ఆకట్టుకుంటుంది. ఆ మధ్య `మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్` షోలో కూడా మెరిసింది. డాన్స్ రియాలిటీ షోస్‌తో పాపులర్ అయిన స్వేతా నాయుడు కూడా రాబోతుంది. ఆమె కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది. డాన్సులతో దుమ్మురేపే స్వేతా నాయుడు బిగ్ బాస్‌లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. అలాగే పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకున్న దక్షి కూడా రాబోతుంది.
పసలేని కంటెస్టెంట్లు రాబోతున్నారా?
అయితే వీరిలో ఒక్కరు కూడా ఎగ్జైటింగ్ కంటెస్టెంట్లు లేరనే కామెంట్ వినిపిస్తుంది. హౌజ్‌లో ఉన్నవారే కొంత బెటర్ అంటున్నారు నెటిజన్లు. వైల్డ్ కార్డ్ ద్వారా చాలా మంది క్రేజీ కంటెస్టెంట్లని తీసుకొస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం ఆ ఊపు కనిపించడం లేదు. అయితే చాలా మంది సెలబ్రిటీలను అప్రోచ్ అయినా ఎవరూ రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. ఈ క్రమంలో పెద్దగా నోటెడ్ కానివారిని కూడా తీసుకొస్తున్నట్టు సమాచారం. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్లు ఎక్కువగా వెంటనే ఎలిమినేట్ అవుతున్నారు. మొన్న వచ్చిన మిథిలేష్, అపూర్వ(ఈ వారం ఎలిమినేట్) వెంటనే వెళ్లిపోయారు. అంతకు ముందు సీజన్‌లో కూడా వచ్చినవాళ్లు వచ్చినట్టే పోయారు. మరి ఈ సారి అయినా ఆడతారా? చివరి వరకు నిలుస్తారా? అనేది చూడాలి.

