- Home
- Entertainment
- విజయ్ దేవరకొండ కి అనారోగ్యం, హాస్పిటల్ లో రౌడీ హీరో, ఆందోళనలో అభిమానులు, నిజమెంత?
విజయ్ దేవరకొండ కి అనారోగ్యం, హాస్పిటల్ లో రౌడీ హీరో, ఆందోళనలో అభిమానులు, నిజమెంత?
నటుడు విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. కింగ్‌డమ్ సినిమా విడుదలకు ముందు ఆయన అనారోగ్యానికి గురవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ విషయంలో విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చారు.
- FB
- TW
- Linkdin
Follow Us

పాన్ ఇండియా సినిమా ద్వారా స్టార్ హీరోగా ఎదిగాడు టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ . ప్రస్తుతం కింగ్ డమ్ సినిమా బిజీలో ఉన్న విజయ్ దేవరకొండకు సబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. కింగ్ డమ్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రౌడీ హీరో అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు న్యూస్ ఇండస్ట్రీలో ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది. .
విజయ్ దేవరకొండ అనారోగ్యం
హీరో విజయ్ దేవరకొండ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ముందుగా ఎటువంటి సమాచారం అందించలేదు విజయ్ టీమ్. ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలియక ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే విజయ్ కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరీక్షల్లో అది డెంగ్యూ జ్వరంగా నిర్థారణ అయినట్టు సమాచారం. అందుకే విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం.
విజయ్ దేవరకొండ టీమ్ ఏమంటున్నారంటే?
జులై 31న కింగ్‌డమ్ సినిమా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న ఈ సమయంలో విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరడంతో మూవీ టీమ్ కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ప్రస్తుతం విజయ్ డెంగ్యూ చికిత్స తీసుకుంటున్నారట. ప్లేట్‌లెట్స్ కౌంట్ కూడా మెరుగైనట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో జులై 20న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే విజయ్ టీమ్ మాత్రం ఆయన బాగున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం కోలుకున్నారని అంటున్నారు. విజయ్ హాస్పిటల్ లో ఉన్నారా లేదా అనే విషయాన్ని వారు దృవీకరించలేదు.
కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడంటే?
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్‌డమ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈసినిమాపైనే విజయ్ దేవరకొండ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈసినిమా వాయిదా పడింది. నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందంలో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది.ఇక ఈమూవీని జులై 31న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈసినిమా రిలీజ్ కు కొద్దిరోజులే ఉండటంతో, ప్రమోషన్ల వేగం పెంచాలి అనుకుంటున్న టైమ్ లో, విజయ్ దేవరకొండ ఆసుపత్రి పాలవ్వడం మూవీ టీమ్ ను ఆందోళనకు గురి చేస్తోంది.