కోటకు వాణి శ్రీ స్ట్రాంగ్ వార్నింగ్, బాబు మోహన్ వెల్లడించిన రహస్యం ఏంటంటే
కోట శ్రీనివాసరావుకు షూటింగ్ స్పాట్ లోనే వార్నింగ్ ఇచ్చింది సీనియర్ నటి వాణిశ్రీ. ఈ విషయాన్నిబాబుమోహన్ ఓసందర్భంలో వెల్లడించారు. ఇంతకీ కోటను వాణిశ్రీ ఏమన్నారు? ఎందుకన్నారు?
- FB
- TW
- Linkdin
Follow Us

రీసెంట్ గా తిరుగిరాని లోకాలకు వెళ్లిపోయారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. తెలుగు సినీపరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన కెరీర్ లో చేయని పాత్రలేదు, వేయని వేషం లేదు. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం కోట పేరు చెరిపివేయలేరు. కోటా కెరీర్ లో ఎన్ని అద్భుతమైన సినిమాలు ఉన్నాయో.. అన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. కోట జీవితంలో విశేషాల గురించి.. ఆయన ప్రాణ స్నేహితుడు బాబుమోహన్ ఓ సందర్భంల్లో వెల్లడించారు.వాణిశ్రీ కోటాకు వార్నింగ్ ఇచ్చిన సందర్భాల్లో ఆయన గుర్తు చేశారు.
కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ కాంబినేషన్ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు ఈ కాంబోలో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పాత తెలుగు సినిమాల్లో కమెడీ జంటల మధ్య chemistry గురించి మాట్లాడితే, మొదటగా రేలంగి-రమణారెడ్డి, ఆ తరువాత రావు గోపాలరావు-అల్లూ రామలింగయ్య లాంటి అల్లరి జంటలు గుర్తుకు వస్తాయి. అయితే ఆ వారసత్వాన్ని కొనసాగించిన జంటగా కోట శ్రీనివాసరావు - బాబూ మోహన్ లను పేర్కొనవచ్చు. ఒకానొక దశలో ఈ ఇద్దరు నటులు కనిపించని సినిమా అంటూ లేనేలేని పరిస్థితి నెలకొంది.
ఇక కోటతో తన అనుబంధం గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్వూలో వెల్లడించారు బాబుమోహన్ . బాబు మోహన్ మాట్లాడుతూ..“ఒకవైపు నేను, మరోవైపు కోట అన్నా… ఇద్దరం మా సినిమాలు చేసుకుంటూ పోతున్నాం. అప్పట్లో పెద్దగా పరిచయం కూడా లేదు. ‘బొబ్బిలి రాజా’ సినిమాలో తొలిసారిగా కలిసి పనిచేశాం. అప్పుడే పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతోంది. అయితే మా కాంబినేషన్ వెలుగులోకి వచ్చిన సినిమా మాత్రం ‘మామగారు’. ఆ సినిమా తర్వాత మేమిద్దరం బిజీ అయిపోయాం”.
అలాగే కోట శ్రీనివాసరావు నుంచి తనకు వచ్చిన ప్రేరణ గురించి బాబూ మోహన్ వివరించారు,“ఆయన గొప్ప నటుడు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. సహజంగా నటించడం ఆయనకు చక్కగా వచ్చేది,” అన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సంఘటనను కూడా బాబూ మోహన్ వెల్లడించారు.
‘బొబ్బిలి రాజా’ షూటింగ్ సందర్భంగా కోట శ్రీనివాసరావు తనతో సరదాగా ఏదో మాట అన్నారు. మేము సరదాగా ఏదో ఒకటి తింటుకోవడం సాధారణంగా జరిగి విషయమే. కాని ఆ మాట విన్న వాణిశ్రీ గారు, అది సీరియస్‌గా భావించి కోట అన్నపై ఫైర్ అయ్యారు.
ఆయన సీనియర్ నటుడు ఆయన్ను పట్టుకుని అలా అన్నావేంటి, నేను కూడా సీనియర్ నే కదా.. నాతో కూడా ఇలానే ఉంటావా అని వాణిశ్రీ గారు ఫైర్ అయ్యారు.ఇంకోసారి అలా అంటే ఊరికోను అని కోటకు ఆమె వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఇక అప్పటి నుంచి కోట నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని బాబూ మోహన్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.
కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ కాంబినేషన్ కలిసింది బొబ్బిలి రాజా సినిమాతో. ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. వీరి కాంబోలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ తదితరులు ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు వీరి కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా రాయడం, సినిమాలో వీరి సన్నివేశాలు పెంచడం లాంటివి చేసేవారు.
ఇక కోటా, బాబుమోహన్ కాంబినేషన్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన సినిమాలు చిన్నరాయుడు, ఏవండి ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, నెంబర్ వన్, మాయలోడు, జంబలికిడిపంబ, సహా దాదాపు 60 సినిమాల్లో వీరి కాంబినేషన్ అద్భుతంగా పండింది. ఓనర్ పనివాడు,తండ్రీ కొడుకు, స్నేహితులు, రాజకీయ నాయకులు, ఇలా రకరాకల పాత్రలు వీరిద్దరు అదరగొట్టారు. ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబుమోహన్, హీరోయిన్ తండ్రిగా కోటా.. వీధి అరుగు మీద వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్టపట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు.