MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో అడ్డంగా దొరికిపోయిన విజయ్ దేవరకొండ.. ఫోటోలు లీక్‌.. ఎవరీ అమ్మాయి?

Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో అడ్డంగా దొరికిపోయిన విజయ్ దేవరకొండ.. ఫోటోలు లీక్‌.. ఎవరీ అమ్మాయి?

Vijay Deverakonda: హీరోయిన్‌ రష్మిక మందన్నాతో పెళ్లి వార్తల మధ్య, విజయ్ దేవరకొండ తన మాజీ ప్రియురాలితో దిగిన పాత ఫోటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో  పెద్ద దుమారం రేపుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 11 2026, 09:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రష్మిక మందన్నాతో త్వరలో విజయ్‌ దేవరకొండ పెళ్లి
Image Credit : Reddit

రష్మిక మందన్నాతో త్వరలో విజయ్‌ దేవరకొండ పెళ్లి

హీరోయిన్‌ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంటకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయిందని ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ ఇంట్లో,  వెకేషన్‌లో  రష్మిక కనిపించడంతో అభిమానులు ఈ వార్తలను నిజమని నమ్ముతున్నారు. ఈ నెలాఖరులో వీరి పెళ్లి జరగనుందనే రూమర్స్ వస్తున్న టైంలో, విజయ్ పాత ఫోటోలు లీకై సంచలనం సృష్టిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మాజీ లవర్‌తో విజయ్‌ దేవరకొండ ఫోటోలు లీక్‌
Image Credit : instagram

మాజీ లవర్‌తో విజయ్‌ దేవరకొండ ఫోటోలు లీక్‌

విజయ్ దేవరకొండ మాజీ ప్రియురాలు అంటూ కొన్ని పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సినిమా కెరీర్ తొలి రోజుల్లో విజయ్ ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. రెడ్డిట్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి వార్తల నేపథ్యంలో ఇవి మళ్లీ వైరల్ అవుతున్నాయి.
35
బెల్జియం మోడల్‌తో విజయ్‌ డేటింగ్‌?
Image Credit : facebook

బెల్జియం మోడల్‌తో విజయ్‌ డేటింగ్‌?

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, విజయ్ దేవరకొండ బెల్జియంకు చెందిన ఒక మోడల్‌తో డేటింగ్ చేశాడని చెబుతున్నారు. ఈ మోడల్‌తో విజయ్ క్లోజ్‌గా ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పుడు అన్నిచోట్లా హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు డేటింగ్‌లో ఉన్నారని టాక్. కోవిడ్ సమయంలో కూడా విజయ్ ఆ మోడల్‌ను కలవడానికి యూరప్ వెళ్లాడని కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఆమె తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ వచ్చారట. అయితే, వీరి డేటింగ్ అకస్మాత్తుగా ముగిసింది. రష్మిక మందన్నాతో సినిమా చేసిన తర్వాత ఈ బెల్జియం మోడల్‌తో బ్రేకప్ అయిందని అంటున్నారు. కానీ, ఈ సమాచారం ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు.

45
విజయ్‌ పెళ్లి వేళ తప్పుడు ప్రచారమా?
Image Credit : facebook.com/TheDeverakonda

విజయ్‌ పెళ్లి వేళ తప్పుడు ప్రచారమా?

ఈ బెల్జియం మోడల్ పేరు వర్జీనీ అని తెలుస్తోంది. ఈమె 2016లో వచ్చిన విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత విజయ్, ఈమె మంచి స్నేహితులయ్యారు. ఆ సమయంలో తీసిన ఫోటోలే ఇవని అంటున్నారు. విజయ్, వర్జీనీ మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య మరే బంధం లేదని అభిమానులు చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం, ఈ ఫోటోలు చూస్తే కేవలం స్నేహితుల్లా లేరని, అంతకంటే ఎక్కువ బంధం ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పెళ్లి జరగబోతున్న వేళ కొందరు పడని వాళ్లు కావాలని వైరల్‌ చేస్తున్నారని, తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఏది నిజమే తెలియాల్సి ఉంది. 

55
ఈ నెల 26న ఉదయ్‌ పూర్‌లో విజయ్‌, రష్మిక పెళ్లి
Image Credit : X/GeethaArts

ఈ నెల 26న ఉదయ్‌ పూర్‌లో విజయ్‌, రష్మిక పెళ్లి

ఇదిలా ఉంటే ఈ నెల 26న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అతికొద్ది మంది బంధుమిత్రులు, సినీ సెలబ్రిటీలు వీరి పెళ్లికి హాజరు కానున్నారట. ఇక మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ జరగబోతుందని, దీనికి సినిమా సెలబ్రిటీలంతా హాజరు కానున్నారట. ప్రస్తుతం గెస్ట్ లను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు విజయ్‌, రష్మిక. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved