MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • `కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్

`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్

బుధవారం టాలీవుడ్‌లో చాలా ఆసక్తికర అప్‌ డేట్లు చోటు చేసుకున్నాయి. `కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచిన విషయం బయటకు వచ్చింది, `నిలవే` మూవీ లవ్‌ స్టోరీస్‌లో కేజీఎఫ్‌ అంటున్నారు. `సతీ లీలావతి` రిలీజ్‌ డేట్‌ వచ్చింది. 

4 Min read
Author : Aithagoni Raju
Published : Feb 11 2026, 11:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్‌ లో క్రేజీ అప్‌ డేట్స్
Image Credit : Asianet News

టాలీవుడ్‌ లో క్రేజీ అప్‌ డేట్స్

టాలీవుడ్‌ బుధవారం జరిగిన అప్‌ డేట్స్ చూస్తే,  యంగ్‌ టాలెంటెడ్‌ బ్యాచ్‌ చేసిన లేటెస్ట్ మూవీ `నిలవే`. సౌమిత్‌ పోలాడి హీరోగా, శ్రేయాసి సేన్‌ హీరోయిన్‌గా సాయి కే వెన్నం దర్శకత్వం వహించిన మూవీ `నెలవే`. దీనికి హీరో కూడా దర్శకుడే. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. పీఓవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలకాబోతుంది. బుధవారంనాడు మాదాపూర్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లవ్‌ స్టోరీస్‌లో `నిలవే` మరో `కేజీఎఫ్‌`
Image Credit : Asianet News

లవ్‌ స్టోరీస్‌లో `నిలవే` మరో `కేజీఎఫ్‌`

ఈ కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ `అన్ని ఎమోషన్స్ చూపించేలా ఉన్న చిత్రమే `నిలవే`. కాలం మారినా ఇంటెన్స్ మ్యూజిక్ అలానే ఉంటుంది. `నిలవే` మ్యూజికల్ లవ్ స్టోరీ. క్లాసికల్ మూవీస్ `సఖి`, `ఏ మాయే చేశావే` తరహాలో మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుంది. ఇందులోని పాటలు కీరవాణిగారు విని ప్రమోషన్ చేయడం సినిమా పై పాజిటివ్ నెలకొంది` అని అన్నారు. హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ, `నేను సినిమాలో వెళుతున్నానని చెప్పినప్పటినుంచీ మా నాన్న సపోర్ట్ చేశారు. నన్ను హీరో, దర్శకుడిగా మార్చింది సాయి కే వెన్నం. చిన్నప్పటినుంచీ నటుడు కావాలనే కోరిక ఉండేది. అందుకు నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవిగారే. ఫిబ్రవరి 13న నా తొలి సినిమా విడుదలకాబోతుంది. ప్రీమియర్స్ వేశాం, మంచి స్పందన లభించింది. యాక్షన్ మూవీస్ లో కె.జి.ఎఫ్. ఎలా ఉంటుందో లవ్ స్టోరీస్ లో కే జీ ఎఫ్ .. నిలవే` అని అన్నారు. ఇందులో దర్శకుడు, నిర్మాతలు, ఆర్టిస్టులు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇతర టీమ్‌ పాల్గొని సినిమాని ఆదరించాలని తెలిపారు.

36
 `కపుల్‌ ఫ్రెండ్లీ` సినిమాలో చాలా ఉంటుంది
Image Credit : Asianet News

`కపుల్‌ ఫ్రెండ్లీ` సినిమాలో చాలా ఉంటుంది

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం `కపుల్ ఫ్రెండ్లీ`. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన `కపుల్ ఫ్రెండ్లీ` సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఇది చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే మంచి లవ్ స్టోరీ మూవీ. టైటిల్ చూసి ఇదోదే ఓన్లీ యూత్ చూడాల్సిన సినిమా అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. శివ, మిత్ర అనే రెండు క్యారెక్టర్స్ జర్నీ చూస్తారు. ట్రైలర్‌లో చూసింది కాదు, సినిమాలో ఇంకా చాలా దాచాం. మూవీ చూస్తే మీరు సర్‌ప్రైజ్‌ అవుతారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండే మంచి లవ్ స్టోరీ. మేము మా చిత్రాలతో ప్రేక్షకులు ఎమోషన్ తో ఏడిపిస్తాం. అయితే ఈ చిత్ర దర్శకుడు అశ్విన్‌ ప్రేక్షకుల్ని ఏడిపించలేదు గానీ హార్ట్ టచింగ్ గా మూవీ చేశారు. మూవీలో ప్రతి సీన్ కు మరొక సీన్ తో లింకు ఉండేలా పక్కాగా స్క్రిప్ట్ చేసుకున్నారు. స్క్రిప్ట్ తో పాటు ఆ కథను అందరికీ నచ్చేలా తెరకెక్కించారు. అయితే సినిమా చూశాక మేము ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ లో ఉంటే ఇంకో పది పర్సెంట్ ఇంటెన్స్ గా చేయగలిగి ఉండేవాళ్లం. డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మూవీలో మార్పులు చెప్పడం కరెక్ట్ కాదు. ఇది డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ మొదటి నుంచి నమ్మి చేసిన కథ. సినిమా అంతే బాగా వచ్చింది. థియేటర్లో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది` అని చెప్పారు ధీరజ్‌.

46
లావణ్య `సతీ లీలావతి` రిలీజ్‌ డేట్‌
Image Credit : Asianet News

లావణ్య `సతీ లీలావతి` రిలీజ్‌ డేట్‌

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఇటీవల బాబుకి కూడా జన్మించారు. తల్లిగా కొడుకుతో బిజీగా ఉన్నా ఆమె సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. పెళ్లి తర్వాత లావణ్య `సతీ లీలావతి` చిత్రంలో నటించింది. ఆ మూవీ ఇప్పుడు రిలీజ్‌ అవుతుంది. తాజాగా బుధవారం రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. మార్చి 6న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో ఈ చిత్రంలో దేవ్‌ మోహన్‌ ఆమెకి జోడీగా నటించగా, తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ పతాకాలపై నాగ మోహన్‌ నిర్మించారు. రిలీజ్‌ డేట్‌ ప్రకటన సందర్భంగా మీడియాతో లావణ్య త్రిపాఠి కొణిదెల మాట్లాడుతూ, ``సతీ లీలావతి’ని ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. సప్తగిరి తో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అందరూ గొప్ప ఆర్టిస్టులు నటించారు. దేవ్ మోహన్ గారి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం` అని తెలిపింది.

56
గ్రాండ్‌గా `ఫంకీ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌
Image Credit : Asianet News

గ్రాండ్‌గా `ఫంకీ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా, అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఫంకీ`. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా బుధవారం ఖమ్మంలోని లేక్‌ వ్యూ క్లబ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో టీమ్‌ అంతా పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. సినిమాని ఆదరించాలని తెలిపారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని చెప్పారు.

66
స్వయంభు మూవీ టీజర్‌
Image Credit : Asianet News

స్వయంభు మూవీ టీజర్‌

నిఖిల్‌ హీరోగా, సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం `స్వయంభు`. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ పాన్‌ ఇండియా మూవీ రూపొందింది. ఈ చిత్ర టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. నిఖిల్‌ మార్క్ `బాహుబలి`ని తలపించేలా టీజర్‌ ఉంది. విజువల్స్ బాగున్నాయి. గ్రాండియర్‌ అదిరిపోయింది. ఈ సమ్మర్‌లో మూవీని విడుదల చేయబోతున్నారు. అయితే వీఎఫ్‌ఎక్స్ వల్ల మూవీ డిలే అయ్యిందని హీరో నిఖిల్‌ తెలిపారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Related Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved