MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ

Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ

తమన్నా ఇప్పుడు కన్నడనాట చిచ్చు పెట్టింది. మైసూర్‌ సాండల్‌ సోప్‌కి ఆమె ప్రచారకర్తగా నియమితులైన నేపథ్యంలో అక్కడ పెద్ద వివాదం నడుస్తోంది. దీనికితోడు ఆమె తీసుకుంటున్న పారితోషికం మరింత హీటెక్కిస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 12 2026, 07:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివాదంలో ఇరుక్కున్న తమన్నా
Image Credit : Prime Video

వివాదంలో ఇరుక్కున్న తమన్నా

మిల్కీ బ్యూటీ ఇప్పుడు సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్ తోనే బిజీగా ఉంటుంది. గడిచిన మూడేళ్లలో ఆమె తెలుగులో రెండే చిత్రాల్లో నటించింది. అవి కూడా పరాజయం చెందాయి. హిందీలోనూ అడపాదడపా చేస్తోంది. రొటీన్‌, రెగ్యూలర్‌ గ్లామర్స్ రోల్స్ చేయడం లేదు. దాన్ని మించిన ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు, బోల్డ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. సంచలనంగా మారుతుంది. అయితే ఇప్పుడు మరో రూపంలో సంచలనంగా మారింది. వివాదంలో ఇరుక్కుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మైసూర్‌ సాండల్‌ సోల్‌ ప్రచారకర్తగా తమన్నా
Image Credit : Asianet News

మైసూర్‌ సాండల్‌ సోల్‌ ప్రచారకర్తగా తమన్నా

తమన్నా ప్రస్తుతం కర్నాటకకి చెందిన మైసూర్‌ సాండల్‌ సోప్‌ ని ప్రమోట్‌ చేస్తుంది. ఇది కర్నాటక స్టేట్‌ గవర్నమెంట్‌ ఉత్పత్తి చేస్తోన్న సాంప్రదాయ సబ్బు. చాలా పాపులర్‌గా ఉంది. చాలా కాలంగా రన్నింగ్‌లో ఉంది. దీన్ని విస్తరించే బాధ్యతలు చేపట్టింది ప్రభుత్వం. అందుకు కొన్ని మార్పులు చేశారు. అదే సమయంలో మార్కెట్‌ని విస్తరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగా తమన్నాని ప్రచారకర్తగా నియమించారు. రెండేళ్లపాటు తమన్నా ఈ మైసూర్‌ సాండల్‌ సోప్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు.

35
మైసూర్‌ సాండల్‌ సోప్‌ వివాదం
Image Credit : MB Patil X Account

మైసూర్‌ సాండల్‌ సోప్‌ వివాదం

ఇటీవలే ఈ కొత్త సోప్‌ ని ప్రారంభించారు. అయితే ఇప్పుడిది వివాదంగా మారింది. సొంత రాష్ట్రం కర్నాటకలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. స్టార్స్ ఉన్నారు. వారిని కాదని నార్త్ కి చెందిన హీరోయిన్‌ని ప్రచార కర్తగా నియమించడం పట్ల కన్నడీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సొంత రాష్ట్రానికి చెందిన స్టార్స్ ని ప్రచారకర్తలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కన్నడనాట పెద్ద దుమారం రేపుతుంది.

45
మైసూర్‌ సాండల్‌ సోప్‌ యాడ్‌కి తమన్నా షాకిచ్చే పారితోషికం
Image Credit : MB Patil X Account

మైసూర్‌ సాండల్‌ సోప్‌ యాడ్‌కి తమన్నా షాకిచ్చే పారితోషికం

ఇలాంటి వివాదాల మధ్య తమన్నా ఈ సోప్‌ యాడ్‌ కోసం తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. సాధారణంగా ఇలాంటి యాడ్స్ కి కోటి, రెండు కోట్లు, మహా అయితే మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటారు. కానీ ఈ సోప్‌ ని ప్రమోట్‌ చేస్తున్నందుకు తమన్నా తీసుకుంటున్న పారితోషికం తెలిస్తే మతిపోవాల్సిందే. ఏకంగా రూ.6.2కోట్లు తీసుకుందని సమాచారం. తమన్నా ఒక్కో మూవీకి కూడా అంత తీసుకోవడం లేదు. అందులో సగమే ఉంటుంది. కానీ ఇప్పుడు డబుల్‌ పేమెంట్‌ రావడం ఆశ్చర్యపరుస్తుంది. సొంత రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాదు, పైగా ఇంత రెమ్యూనరేషన్‌ అనేది కూడా కన్నడ ప్రజలకు మరింతగా మండేలా చేస్తుంది.

55
తమన్నాని ప్రచారకర్తగా తీసుకోవడానికి కారణమిదే
Image Credit : MB Patil X Account

తమన్నాని ప్రచారకర్తగా తీసుకోవడానికి కారణమిదే

అయితే తమన్నాని ప్రచారకర్తగా నియమించడానికి ఓ కారణం ఉందట. తమన్నా నార్త్ లో బాగా పాపులర్‌. ఆమె ఈ సోప్‌ని ప్రమోట్‌ చేస్తే ఉత్తరాధి ప్రజలకు కూడా చేరువవుతుంది, మార్కెట్‌ విస్తరిస్తుందని కన్నడ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సోప్‌ మార్కెట్‌ని విస్తరించే ఉద్దేశ్యంలో భాగంగానే తమన్నాని తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక తమన్నా ప్రస్తుతం తమన్నాకి తెలుగులో ఒక్క మూవీ కూడా లేదు. తమిళంలో ఓ మూవీ, హిందీలో ఐదు సినిమాలున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో అడ్డంగా దొరికిపోయిన విజయ్ దేవరకొండ.. ఫోటోలు లీక్‌.. ఎవరీ అమ్మాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved