MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ డేట్ ఫిక్స్..వీరమల్లుకి వారం గ్యాప్ లోనే, అదిరిపోయిన ప్రోమో

విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ డేట్ ఫిక్స్..వీరమల్లుకి వారం గ్యాప్ లోనే, అదిరిపోయిన ప్రోమో

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2025, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : youtube

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ,  త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Asianet News

‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' అనే సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘కింగ్డమ్’ విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.

‘కింగ్డమ్ ’ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, హీరోయిజం, డ్రామాల సమపాళ్లలో కలబోసిన చిత్రంగా కింగ్డమ్ రిలీజ్ కానుంది. ప్రోమోలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, విజువల్స్ కట్టిపడేశాయి. మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించబోతున్నట్లు ఈ ప్రోమో హామీ ఇస్తోంది.

Related Articles

Related image1
నిర్మాతతో 'కోర్ట్' మూవీ హీరోయిన్ రొమాన్స్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగు బ్యూటీ
Related image2
ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే ఎన్టీఆర్..12 టేక్ లు తీసుకున్న సందర్భం, కంట్రోల్ చేసుకోలేక..
35
Image Credit : Asianet News

ఈ అద్భుతమైన చిత్రాన్ని వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కొత్త విడుదల తేదీ ప్రకటన ఎంతో ఉపశమనాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అభిమానుల అంచనాలకు మించే చిత్రాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో 'కింగ్డమ్ ' కోసం చిత్ర బృందం అదనపు సమయాన్ని కేటాయిస్తోంది.

కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు స్పందిస్తూ.. "కింగ్డమ్ కేవలం సినిమా కాదు.. ఇది మేము ఎంతో ఇష్టంతో నిర్మించిన ఒక గొప్ప ప్రపంచం. ప్రతి ఫ్రేమ్ మరపురానిదిగా ఉండాలని మేము కోరుకున్నాము. జూలై 31న ఈ చిత్రం బాక్సాఫీస్ తుఫానుకు నాంది పలుకుతుంది." అన్నారు.

45
Image Credit : Asianet News

కింగ్డమ్ రిలీజ్ డేట్ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్భుతమైన విజువల్స్, సంగీతంతో రూపొందిన ఈ ప్రోమో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ చిత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి వారం గ్యాప్ లోనే రిలీజ్ అవుతుండడం ఆసక్తికర పరిణామం అనే చెప్పాలి. 

ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' కోసం అద్భుతమైన కథను ఎంచుకున్నారు. ఆ అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

55
Image Credit : Asianet News

'కింగ్డమ్' చిత్రానికి ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జోమోన్ టి. జాన్ , గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉండనుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora Skincare: 52 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న మలైకా.. ఆమె నైట్ స్కిన్‌కేర్ సీక్రెట్ ఇదే!
Recommended image2
Reality Show: బిగ్ బాస్ ని మించిన వింత, కాంట్రవర్షియల్ రియాలిటీ షోలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Recommended image3
Sreeleela: అందానికే అసూయ పుట్టించేలా మహేష్ బాబు హీరోయిన్ లేటెస్ట్ లుక్! రాధలా మారిన శ్రీలీల..
Related Stories
Recommended image1
నిర్మాతతో 'కోర్ట్' మూవీ హీరోయిన్ రొమాన్స్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగు బ్యూటీ
Recommended image2
ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే ఎన్టీఆర్..12 టేక్ లు తీసుకున్న సందర్భం, కంట్రోల్ చేసుకోలేక..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved