- Home
- Entertainment
- ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే ఎన్టీఆర్..12 టేక్ లు తీసుకున్న సందర్భం, కంట్రోల్ చేసుకోలేక..
ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే ఎన్టీఆర్..12 టేక్ లు తీసుకున్న సందర్భం, కంట్రోల్ చేసుకోలేక..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటనకి తిరుగులేదు. ఎంతటి కష్టమైనా సన్నివేశమైనా, ఎంతటి భారీ డైలాగు అయినా, ఎలాంటి హావభావాలైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే సత్తా ఎన్టీఆర్ కి ఉందని చాలామంది దర్శకులు, ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసిస్తుంటారు. డ్యాన్స్ విషయంలో కూడా తారక్ కి తిరుగులేదు.
అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ సన్నివేశాలు నటించే సమయంలో పది టేకులు తీసుకుంటారని తెలుస్తోంది. దీని గురించి దివంగత కమెడియన్ వేణుమాధవ్, ఎన్టీఆర్ మధ్య ఒక సందర్భంలో చర్చ జరిగింది. నాతో నటించేటప్పుడు కొన్నిసార్లు నీవు 10 టేకులు తీసుకుంటావు. 12 టేక్ లు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాతో నటించేటప్పుడు మాత్రమే అన్ని టేక్ లు తీసుకుంటావా లేక ఇంకెవరైనా హీరోయిన్లతో నటించేటప్పుడు ఇలాంటి అనుభవం ఉందా అని వేణుమాధవ్ ప్రశ్నించారు.
దీనికి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ..నాకు ఎప్పుడూ ఎక్కువ టేక్ లు అవసరం కావు. కానీ మీతో, బ్రహ్మానందం గారితో, అలీ గారితో నటించేటప్పుడు మాత్రమే నాకు ఎక్కువ టేక్ లు అవసరం అవుతుంటాయి. ఎందుకంటే మీతో నటించేటప్పుడు నేను నా నవ్వుని కంట్రోల్ చేసుకోలేను అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
బ్రహ్మానందం, వేణుమాధవ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సింహాద్రి, బృందావనం లాంటి చిత్రాల్లో అద్భుతమైన హాస్య సన్నివేశాలు ఉన్నాయి.