MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • VD-Shouryuv: విజయ్‌ దేవరకొండ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్.. ఇలాంటి పోస్టర్‌ ఇప్పటి వరకు చూసి ఉండరు

VD-Shouryuv: విజయ్‌ దేవరకొండ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్.. ఇలాంటి పోస్టర్‌ ఇప్పటి వరకు చూసి ఉండరు

విజయ్‌ దేవరకొండ, శౌర్యువ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ మాత్రం అదిరిపోయేలా ఉంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 18 2026, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండు నెలలుగా విజయ్‌ దేవరకొండ సందడి
Image Credit : Asianet News

రెండు నెలలుగా విజయ్‌ దేవరకొండ సందడి

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ గత రెండు నెలలుగా టాలీవుడ్‌లోనే కాదు ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా మారారు. తన పెళ్లి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాని విజయ్‌ మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత వరుసగా పలు విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సొంతింట్లో వ్రతం చేశాడు, ఆ తర్వాత సంగీత్‌ కార్యక్రమం, అభిమానులకు ప్రత్యేకమైన విందు, మీడియాకి విందు, ఆ తర్వాత ఇండస్ట్రీ వర్గాలకు మరో విందుని ఏర్పాటు చేశారు. అందరిని కలిశారు. ఇటీవల రష్మిక మందన్నా ఊరికి వెళ్లి సందడి చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హాయ్‌ నాన్న దర్శకుడిగా విజయ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్
Image Credit : Asianet News

హాయ్‌ నాన్న దర్శకుడిగా విజయ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్

తాజాగా విజయ్‌ దేవరకొండ తన కొత్త సినిమాని ప్రకటించారు. `హాయ్‌ నాన్న` ఫేమ్‌ శౌర్యువ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. వీడీ ఎక్స్ శౌర్యువ్‌ పేరుతో దీన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ అదిరిపోయింది. ఇందులో నాలుగు బ్లాక్‌ డాగ్స్ ని పట్టుకుని రాజులా నడిచి వస్తుండగా, వెనక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలు చేపట్టి రావడం ఆసక్తి కలిగిస్తోంది. దర్శకుడు శౌర్యువ్‌ గుర్రాన్ని పట్టుకొని వస్తున్నాడు. ఈ సందర్భంగా `ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ` అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది. ఇలాంటి పోస్టర్‌ కూడా ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూడలేదని చెప్పొచ్చు. ఒకప్పటి ప్రేమ ఇప్పుడు యుద్ధానికి దారితీసిందా? ఆగ్రహానికి దారి తీసిన అంశాలేంటి? అనే కథాంశంతో మూవీ సాగబోతున్నట్టు తెలుస్తోంది.

34
మతిపోయేలా ఉన్న విజయ్‌ కొత్త సినిమా పోస్టర్‌
Image Credit : X

మతిపోయేలా ఉన్న విజయ్‌ కొత్త సినిమా పోస్టర్‌

ఈ మూవీని గ్లోబల్‌ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు హీరో విజయ్ దేవరకొండ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.  వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ సినిమాకు `హౌస్ ఆఫ్ ది డ్రాగన్`, `ఫాల్ ఔట్` వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. `గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్`, `బ్యాట్ మ్యాన్ ఫరెవర్`, `స్నోపియర్సర్` చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

44
రణబాలి, రౌడీ జనార్థన్‌తో బిజీగా ఉన్న విజయ్‌
Image Credit : Asianet News

రణబాలి, రౌడీ జనార్థన్‌తో బిజీగా ఉన్న విజయ్‌

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం `రణబాలి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకుడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. సెప్టెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు రవి కిరణ్‌ కోలా దర్శకత్వంలో `రౌడీ జనార్థన్‌` మూవీ చేస్తున్నాడు విజయ్‌. ఇది కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇందులో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు కొత్తగా శౌర్యువ్‌ తో సినిమాని ప్రకటించాడు విజయ్‌. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. `హాయ్‌ నాన్న` తర్వాత దర్శకుడు చేస్తున్న సినిమా ఇది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
బాలకృష్ణ క్లాప్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన చిరంజీవి.. బిగ్గర్‌ దెన్ బచ్చన్‌ని చేసిన మూవీ ఏంటంటే?
Recommended image2
Bad Boy Karthik: 30కోట్లు పెట్టి సినిమా తీస్తే, టీ ఖర్చులు కూడా రాలే.. నాగశౌర్య మూవీకి దారుణమైన కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved