MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ క్లాప్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన చిరంజీవి.. బిగ్గర్‌ దెన్ బచ్చన్‌ని చేసిన మూవీ ఏంటంటే?

బాలకృష్ణ క్లాప్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన చిరంజీవి.. బిగ్గర్‌ దెన్ బచ్చన్‌ని చేసిన మూవీ ఏంటంటే?

బాలకృష్ణ క్లాప్‌ కొట్టగా చిరంజీవి మూవీ ప్రారంభమైంది. కట్‌ చేస్తే అది ఇండస్ట్రీని షేక్‌ చేసింది. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. చిరంజీవిని బిగ్గర్‌ దెన్‌ బచ్చన్‌గా మార్చేసింది. ఆ మూవీ ఏంటంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 18 2026, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి మూవీకి బాలయ్య క్లాప్‌
Image Credit : Asianet News

చిరంజీవి మూవీకి బాలయ్య క్లాప్‌

మెగాస్టార్‌ చిరంజీవి 1990లో తిరుగులేని సూపర్‌ స్టార్‌గా రాణించారు. అప్పుడు ఆయన చేసిన సినిమాలే ఆయన్ని మెగాస్టార్‌గా నిలబెట్టాయని చెప్పొచ్చు. `ఖైదీ`, `రౌడీ అల్లుడు`, `ఘారానా మొగుడు`, `గ్యాంగ్‌ లీడర్‌`, `జగదేక వీరుడు అతిలోక సుందరి` ఇలా ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చిరంజీవిని ఓ దశలో ఇండియాలోనే టాప్‌ హీరోని చేసింది. అయితే అప్పట్లో టాలీవుడ్‌ లో ఫస్ట్ 10కోట్ల(షేర్‌)ని వసూలు చేసిన ఘనత చిరంజీవి పేరుతోనే ఉండటం ఒక విశేషమైతే, దానికి బాలయ్య క్లాప్‌ కొట్టడం మరో విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఘరానా మొగుడుతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌
Image Credit : sun nxt

ఘరానా మొగుడుతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌

చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిత్రాల్లో `ఘరానా మొగుడు`మూవీ ప్రధానంగా చెప్పొచ్చు. ఇందులో చిరంజీవిలోని అసలైన మ్యానరిజం, స్టయిల్‌, యాక్షన్‌, డైలాగ్స్ కనిపిస్తాయి. పక్కా కమర్షియల్ మూవీ ఇది. పాటలు, డాన్సులు, మాస్‌ డైలాగ్‌లు, కామెడీ, యాక్షన్‌, గ్లామర్‌, ఎమోషన్స్, సెంటిమెంట్‌ ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కంప్లీట్‌ ప్యాకేజ్‌ ఫిల్మ్ అని చెప్పొచ్చు. దీనికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో నగ్మా హీరోయిన్‌గా నటించింది. వాణి విశ్వనాథ్‌ మరో ముఖ్య పాత్రలో మెరిసింది. రావు గోపాల రావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు.

35
పది కోట్లకుపైగా షేర్‌ సాధించిన ఘరానా మొగుడు, ఇండస్ట్రీలో రికార్డ్
Image Credit : sun nxt

పది కోట్లకుపైగా షేర్‌ సాధించిన ఘరానా మొగుడు, ఇండస్ట్రీలో రికార్డ్

ఈ సినిమా 1992 ఏప్రిల్‌ 9న విడుదలైంది. ఇటీవలే 34ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో పది కోట్లకుపైగా షేర్‌ వసూళ్లని రాబట్టింది. టాలీవుడ్‌లో ఫస్ట్ పది కోట్ల షేర్‌ని సాధించిన సినిమా ఇదే అని ట్రేడ్‌ వర్గాలు చెబుతుంటాయి. అంటే ఆల్మోస్ట్ ఇరవై కోట్ల గ్రాస్‌ వసూళు చేసిందని చెప్పొచ్చు. బ్యాక్‌ టూ బ్యాక్‌ రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్‌లో మూడో ఇండస్ట్రీ హిట్‌. 1990లో `జగదేక వీరుడు అతిలోక సుందరి`, 1991లో `రౌడీ అల్లుడు`, 1992లో `ఘరానా మొగుడు` చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ కొట్టాయి. ఇలా ఈ కాంబో హ్యాట్రిక్‌ ఇండస్ట్రీ హిట్స్ కొట్టింది.

45
మ్యానరిజమ్ చిరంజీవి రచ్చ
Image Credit : sun nxt

మ్యానరిజమ్ చిరంజీవి రచ్చ

ఈ సినిమాలో చిరంజీవి ఎడమ చేతిని వెనక్కి పెట్టి, కుడిచేతితో నమస్కారం చెబుతున్నట్టుగా ఉంచి కొంచెం ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో అనే డైలాగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఇది ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ దీన్ని ప్రత్యేకంగా వాడుతుంటారు. దీనికి విశేషమైన క్రేజ్‌ ఉంది. అలాగే  సినిమాలో `బంగారు కోడిపెట్ట` పాట ఎంతగా ఉర్రూతలూగించిందో తెలిసిందే. ఇప్పటికీ మాస్‌ ఆడియెన్స్ చేత డాన్సులు వేయిస్తుంది. ఈ పాటకి థియేటర్లు ఊగిపోయాయంటే అతిశయోక్తి కాదు. అలాగే వాణి విశ్వనాథ్‌, చిరు మీద వచ్చిన `అబ్బా ఇదేమీ వాన` పాట కుర్రాళ్లకి మతిపోయేలా చేసింది. కీరవాణి అందించిన పాటలు సినిమాకి పెద్ద అసెట్‌ అయ్యాయి. ఇది కన్నడలో వచ్చిన `అనురాగ అరలితు` చిత్రానికి రీమేక్. ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక అంతా చిరంజీవిని `బిగ్గర్‌ దెన్‌ బచ్చన్‌` అని పిలిచారు. మలయాళ మనోరమా  మేగజీన్‌ ఇదే పేరుతో కవర్ పేజీని ముద్రించింది. దీంతో అప్పట్లో ఇది ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా మారింది.

55
ఘరానా మొగుడికి బాలయ్య క్లాప్‌
Image Credit : Asianet News

ఘరానా మొగుడికి బాలయ్య క్లాప్‌

అయితే ఈ సినిమా ఓపెనిగ్‌కి బాలకృష్ణ క్లాప్‌ కొట్టడం విశేషం. అప్పట్లో బాలయ్య ఓపెనింగ్‌లో క్లాప్‌ కొడితే సినిమా హిట్‌ పక్కా అనే కామెంట్‌ వినిపించేది. అలా బాలయ్య క్లాప్‌తో ఇండస్ట్రీని షేక్‌ చేశారు చిరంజీవి. దీనికి సంబంధించిన అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో చిరంజీవి, బాలయ్య మధ్య ఉన్న అనుబంధానికి, హీరోల మధ్య ఉన్న స్నేహానికిది నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది జులైలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో ఓ మూవీ ప్రారంభం కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Related Stories
Recommended image1
Actress No Make up: మేకప్‌ లేకుండా కూడా మెరిసిపోతున్న సమంత, రష్మిక, నయన, త్రిష, మీనాక్షి, శ్రీలీల
Recommended image2
Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved