MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్మిక సస్పెన్స్ ని బహిర్గతం చేసిన విజయ్‌ దేవరకొండ.. ఈ దాగుడు మూతలకు తెరపడేది అప్పుడేనా?

రష్మిక సస్పెన్స్ ని బహిర్గతం చేసిన విజయ్‌ దేవరకొండ.. ఈ దాగుడు మూతలకు తెరపడేది అప్పుడేనా?

Vijay Deverakonda-Rashmika : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా కాలంగా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. 

Aithagoni Raju | Published : Apr 06 2025, 08:04 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
vijay deverakonda, rashmika mandanna

vijay deverakonda, rashmika mandanna

Vijay Deverakonda-Rashmika : నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచుతున్నారు. ఓ రకంగా దోబూచులాడుతున్నారు. ఫెస్టివల్స్ ని కలిసే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

వెకేషన్‌ కూడా కలిసే ఎంజాయ్‌ చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ బర్త్ డే అయినా, రష్మిక బర్త్ డే అయినా వీరిద్దరు కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. చాలా వరకు వెకేషన్‌కి వెళ్లి అక్కడ రహస్యంగా ప్రేమించుకుంటున్నారు. 

26
vijay deverakonda, rashmika mandanna

vijay deverakonda, rashmika mandanna

అయితే ఆ విషయంలో మాత్రం చిన్న సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తున్నారు. ఇద్దరు ఒకే చోట ఉన్నా, ఆ విషయాన్ని డైరెక్ట్ చెప్పకుండా, కాస్త సస్పెన్స్ లో పెట్టి, ఇంకాస్త దాగుడు మూతలు ఆడుతూ అసలు విషయాన్ని వెల్లడిస్తున్నారు.

గత రెండు మూడేళ్లుగా ఈ ఇద్దరు చేస్తున్నది ఇదే. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. ఏప్రిల్‌ 5న రష్మిక మందన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓమన్‌ వెళ్లింది రష్మిక. అక్కడే బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటుంది.  

36
rashmika mandanna, vijay deverakonda

rashmika mandanna, vijay deverakonda

మొదట రష్మిక మందన్నా సోషల్‌ మీడియా ద్వారా ఫోటోలను పంచుకుంది. సముద్రపు ఒడ్డున బోట్‌లో ఆమె విందు ఆరగిస్తుంది. స్మైలీ లుక్‌లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన ప్రేమని వ్యక్తం చేసింది.

బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ సైతం ఆమెకి విషెస్‌ తెలియజేశారు. రష్మిక ఫోటోల్లో విజయ్‌ కనిపించలేదు. దీంతో ఈ సారి ఒంటరిగానే వెళ్లిందా అనే అనుమానాలు క్రియేట్‌ అయ్యాయి. నెటిజన్లు కూడా కాస్త డిజప్పాయింట్‌ అయ్యారు. 
 

46
vijay deverakonda

vijay deverakonda

దానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు విజయ్‌ దేవరకొండ. రష్మిక మందన్నా సస్పెన్స్ ని బహిర్గతం చేశాడు. తాను కూడా ఆదివారం వెకేషన్‌ ఫోటోలను పంచుకున్నారు. ఓమన్‌లోనే, రష్మిక మందన్నా ఉన్న చోట నుంచే ఆయన దిగిన పిక్స్ ని అభిమానులతో షేర్‌ చేశారు.

బీచ్‌లోని ఇసుకపై నడుస్తూ, హార్స్ రైడ్‌ చేస్తూ, బోట్‌లో కూర్చొని దిగిన పిక్స్ ని పంచుకున్నారు. ఇప్పుడివి వైరల్‌ అవుతున్నాయి. దీంతో అసలు దొంగలు దొరికిపోయినట్టు అయ్యింది. 

56
vijay deverakonda, rashmika

vijay deverakonda, rashmika

వీరి విషయంలో విసిగిపోయిన నెటిజన్లు ఇంకా ఎన్నాళ్లు దాగుడు మూతలంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒకటి తేల్చేయాలని అడుగుతున్నారు. ఎక్కువ సాగదీసినా వర్కౌట్‌ కాదు, త్వరగా తేల్చుకోవాలని సలహాలిస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.

ఇంకా కొంత కాలం వేచి ఉండే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది లో వీరి రిలేషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకుంటారా? ఫ్రెండ్స్ గానే ఉండిపోతారా? అనేది వచ్చే ఏడాది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
 

66
vijay deverakonda, rashmika

vijay deverakonda, rashmika

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో `కింగ్‌డమ్‌` మూవీలో నటిస్తున్నారు. దీంతోపాటు రవి కిరణ్‌ కోలా, రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది.

అలాగే రష్మిక మందన్నా ఇటీవలే `సికందర్‌`తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది నిరాశ పరిచింది. ఇప్పుడు `ది గర్ల్ ఫ్రెండ్‌`, `కుబేరా` చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రాబోతున్నాయి. రష్మిక, విజయం కాంబినేషన్‌లోనూ ఓ మూవీప్లాన్‌ జరుగుతుందని తెలుస్తుంది. 

read  more: రాజమౌళిని తక్కువ అంచనా వేసి బ్లాక్‌ బస్టర్‌ మిస్‌ చేసుకున్న ప్రభాస్‌.. సినిమా చూస్తూ ఎన్టీఆర్‌ వద్ద ఆవేదన

also read: విజయశాంతిపై మనసు పడ్డ స్టార్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసా? లేడీ సూపర్‌స్టార్‌ చేసిన పనికి మైండ్‌ బ్లాక్‌

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories