- Home
- Entertainment
- రాజమౌళిని తక్కువ అంచనా వేసి బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న ప్రభాస్.. సినిమా చూస్తూ ఎన్టీఆర్ వద్ద ఆవేదన
రాజమౌళిని తక్కువ అంచనా వేసి బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న ప్రభాస్.. సినిమా చూస్తూ ఎన్టీఆర్ వద్ద ఆవేదన
Prabhas: ప్రభాస్ తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌ని మిస్ చేసుకున్నారు. అలా రాజమౌళితోనూ ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వదులుకున్నాడు. ఆ విషయాన్ని చెబుతూ బాధపడ్డాడు డార్లింగ్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
prabhas, rajamouli
Prabhas: ప్రభాస్ తన కెరీర్‌లో చాలా సినిమాలను మిస్ చేసుకున్నారు. అందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అంతా ఫెయిల్యూర్ సినిమాలను మిస్ చేసుకుంటారు. కానీ డార్లింగ్ మాత్రం అన్నీ బ్లాక్ బస్టర్స్ మూవీస్ మిస్ చేసుకోవడం గమనార్హం. అయితే రాజమౌళి సినిమా విషయంలో మాత్రం ఆయన చాలా బాధపడ్డాడు. ఓపెన్‌గానే ఆ విషయాన్ని తెలిపారు.
Prabhas, rajamouli
ప్రభాస్.. రాజమౌళితో `ఛత్రపతి` సినిమా చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత చాలా గ్యాప్‌తో `బాహుబలి` మూవీస్ చేశాడు. ఈ చిత్రాలతో ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇండియన్ సినిమా లెక్కలను మార్చేశారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్నారు. భారీ సినిమాల లైనప్‌తో దూసుకుపోతున్నాడు.
Prabhas, rajamouli
`ఛత్రపతి`, `బాహుబలి` చిత్రాల కంటే ముందే ప్రభాస్.. రాజమౌళితో ఓ సినిమా చేయాల్సింది. అప్పటికి రాజమౌళి కేవలం `స్టూడెంట్ నెంబర్ 1` మూవీ ఒక్కటే చేశారు. అది హిట్ అయ్యింది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. రాజమౌళి ఆ తర్వాత ప్రభాస్‌ని కలిసి ఓ స్క్రిప్ట్ చెప్పాడు. కానీ జక్కన్నని తక్కువ అంచనా వేశాడు డార్లింగ్. తాను చేయను అని రిజెక్ట్ చేశాడు.
simhadri movie
ఆ తర్వాత ఆ మూవీ ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. వీరిద్దరు మళ్లీ కలిసి సినిమా చేశారు. థియేటర్లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రివ్యూ చూడ్డానికి ప్రభాస్‌ని ఇన్‌వైట్ చేశాడు ఎన్టీఆర్. వెళ్లి మూవీ చూస్తుంటే ప్రభాస్‌కి పిచ్చెక్కిపోయిందట.
ఈ డైరెక్టర్ నా నేను మిస్ చేసుకుంది? అని ఫీలయ్యాడట. ఇక ఆయనతో చేయలేనేమో అనుకున్నాడట. మరి ఆ సినిమా ఏదో కాదు `సింహాద్రి`. దీన్ని మొదట ప్రభాస్‌కే చెప్పగా రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ సినిమా చూసి ఇలాంటి మంచి సినిమాను తాను మిస్ చేసుకున్నందుకు బాధపడినట్టు తెలిపారు ప్రభాస్.
Prabhas, rajamouli
రాజమౌళితో చేసిన `బాహుబలి` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని చెప్పాడు ప్రభాస్. స్టేజ్‌పైనే అందరి ముందు తన విచారం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వెంటనే మరో కథతో వచ్చాడు రాజమౌళి. దీంతో వెంటనే ఓకే చేశాడు డార్లింగ్. అలా వచ్చిన `ఛత్రపతి` ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.
ప్రభాస్‌కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన చితమని చెప్పొచ్చు. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పటికీ ఆయన సరికొత్త సంచలనాలు సృష్టిస్తూ సినిమా స్థాయిని పెంచుతూనే ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.
red more: విజయశాంతిపై మనసు పడ్డ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా? లేడీ సూపర్‌స్టార్ చేసిన పనికి మైండ్ బ్లాక్
also read: ఎన్ని కాపురాలు కూలుస్తావమ్మా.. రోడ్డుపై సూర్యకాంతంని పట్టుకుని చెడా మడా వాయించిన మహిళ