- Home
- Entertainment
- థ్రిల్లర్ మూవీ ప్రియులకు పర్ఫెక్ట్ బొమ్మ 'మార్గన్'..ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్, ఐబొమ్మలో ట్రెండింగ్
థ్రిల్లర్ మూవీ ప్రియులకు పర్ఫెక్ట్ బొమ్మ 'మార్గన్'..ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్, ఐబొమ్మలో ట్రెండింగ్
విజయ్ ఆంటోని నటించిన థ్రిల్లర్ మూవీ మార్గన్ ఇటీవల ఓటీటీలో విడుదలైంది. వెంటనే ఐబొమ్మలో కూడా లీకై ట్రెండింగ్ గా మారింది. థ్రిల్లర్ చిత్రాలు ఆశించే వారికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.

విజయ్ ఆంటోని నుంచి మరో థ్రిల్లర్ మూవీ 'మార్గన్'
హీరో విజయ్ ఆంటోని థ్రిల్లర్ చిత్రాలకు బ్రాండ్ గా మారిపోయారు. విజయ్ ఆంటోని ఇటీవల నటించిన మార్గన్ చిత్రం థియేటర్లలో పర్వాలేదనిపించింది. సీరియల్ కిల్లర్ కథాంశంతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీలో విజయ్ ఆంటోనీతో పాటు అజయ్ దిశాన్, సముద్రఖని, బ్రిగడ సాగా కీలక పాత్రలో నటించారు.
ఓటీటీలోకి వచ్చేసింది, ఐబొమ్మలో లీక్
ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. జూలై 25 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మార్గన్ చిత్రానికి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీలో విడుదలైందో లేదో వెంటనే పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ లో కూడా లీకై ట్రెండింగ్ గా మారింది.
కథ ఏంటంటే
ఇంతకీ ఈ చిత్ర కథాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో అడిషనల్ డీజీపీ పోలీస్ అధికారిగా నటించారు ముంబైలో అతడు అడిషనల్ డీజీపీ గా పని చేస్తుంటాడు. హైదరాబాద్ లో ఓ యువతి దారుణంగా హత్యకు గురై కాలిపోయిన శరీరంతో చెత్త కుప్పలో కనిపిస్తుంది. సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి విజయ్ ఆంటోనీకి తెలుస్తుంది. తాను ముంబైలో ఉన్నప్పటికీ హైదరాబాద్ వెళ్లి ఎలాగైనా ఈ కేసుని ఛేదించాలని విజయ్ ఆంటోనీ అనుకుంటారు.
ఊహించని మలుపులు
ఈ కేసుని విజయ్ ఆంటోని అంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం అతడి జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉంటుంది. అనధికారికంగా విజయ్ ఆంటోని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో అజయ్ దిశాన్ విజయ్ అంటోనీకి అనుమానకరంగా కనిపిస్తాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకొని విచారించడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో అజయ్ దిశాన్ గురించి ఊహకందని విషయాలు విజయ్ ఆంటోనికి తెలుస్తాయి. కానీ కొంత సమయానికే అతడు నిర్దోషి అని విజయ్ అంటోనీకి అర్థం అవుతుంది. కానీ అజయ్ దిశాన్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారుతాడు.
సినిమాకి హైలైట్ అతడే
నేరం చేయనప్పటికీ చేయనప్పటికీ అజయ్ దిశాన్ ఈ కేసులో ఎందుకు కీలకమయ్యాడు. వరుసగా యువతుల హత్యలు చేస్తున్నది ఎవరు.. ఈ కేసుని విజయ్ ఆంటోని ఎలా చేదించారు? ఇలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో అజయ్ దిశాన్ పాత్ర హైలెట్ అని చెప్పాలి. అతడికున్న మెమరీ పవర్, నీటిలో ఎక్కువసేపు ఊపిరి తీసుకోకుండా ఉండగలిగే శక్తి లాంటి అంశాలు బాగా ఆకట్టుకుంటాయి. విజయ్ ఆంటోనీకి ఈ కేసును ఛేదించడంలో అతడు చేసే సహాయం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. థ్రిల్లర్ సినిమా ప్రియులకు మార్గన్ చిత్రం పర్ఫెక్ట్ బొమ్మ అని చెప్పొచ్చు.