- Home
- Entertainment
- హీరో తనకంటే 8 ఏళ్ళు చిన్న వాడు, అయినా భార్యగా నటించిన స్టార్ హీరోయిన్.. ఓటీటీలో రిలీజైన మూవీ ఎలా ఉంది ?
హీరో తనకంటే 8 ఏళ్ళు చిన్న వాడు, అయినా భార్యగా నటించిన స్టార్ హీరోయిన్.. ఓటీటీలో రిలీజైన మూవీ ఎలా ఉంది ?
రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఓ చిత్రంలో సీనియర్ హీరోయిన్ కాజోల్ తనకంటే 8 ఏళ్ళు చిన్న వాడైన హీరోకి భార్యగా నటించింది. ఆ మూవీ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓటీటీలో సర్ జమీన్
బాలీవుడ్ నటి కాజోల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమెకి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అదేవిధంగా మలయాళీ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. వీళ్ళిద్దరూ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ సర్ జమీన్. ఈ చిత్రాన్ని జూలై 25న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు.
KNOW
8 ఏళ్ళు చిన్నవాడైన హీరోకి భార్యగా కాజోల్
జియో హార్ట్ స్టార్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మూవీలో కాజల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి భార్యగా నటించింది అందులో ఆశ్చర్యం ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఆమె కంటే పృథ్వీరాజ్ కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. అయినా కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటించడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి పెరిగింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉందా, అసలు ఎలాంటి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకుడు. ఆయన బాలీవుడ్ సీనియర్ నటుడు బొమన్ ఇరానీకి తనయుడు. బోమన్ ఇరానీ తెలుగులో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించారు. ఇక సర్ జమీన్ చిత్రం విషయానికి వస్తే.. ఇది ఆర్మీ నేపథ్యంలో సాగే కథ. దర్శకుడు పేరుకే ఆర్మీ బ్యాక్ డ్రాప్ పెట్టారు కానీ కథ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది.
కథ ఏంటంటే
ఈ మూవీలో పృథ్వీరాజ్ ఆర్మీ అధికారిగా నటించారు. పృథ్వీరాజ్ కాజోల్ దంపతులకు ఓ కొడుకు ఉంటాడు. దేశ రక్షణ కోసం కుటుంబాన్ని సైతం లెక్కచేయని ఆర్మీ అధికారిగా పృథ్వీరాజ్ కనిపిస్తారు. తన కొడుకు తనలా ధైర్యవంతుడు కాదనే అసంతృప్తి పృథ్వీరాజ్ కి ఉంటుంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు వస్తుంటాయి. తన కొడుకుని కూడా తనలాగే ధైర్యవంతుడిగా ఆర్మీ అధికారిగా చూడాలనేది పృథ్వీరాజ్ కల.
కానీ పృథ్వీరాజ్ పవర్ఫుల్ ఆర్మీ అధికారి కాబట్టి టెర్రరిస్టులు అతడి ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. తన కొడుకుని కిడ్నాప్ చేస్తారు. అక్కడి నుంచి కథ మారిపోతుంది. కిడ్నాప్ కి గురైన పృథ్వీరాజ్ కాజల్ కొడుకు ఏమయ్యాడు? ఏ విధంగా తిరిగి వచ్చాడు? టెర్రరిస్టులని పృథ్వీరాజ్ ఎలా ఎదుర్కొన్నారు అనేది మిగిలిన కథ. పృథ్వీరాజ్, కాజోల్ కొడుకు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు.
సినిమాకి మైనస్ అదే
ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో చిత్రం కదా అని భారీ యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిలటరీ ఆపరేషన్ లాంటివి ఎక్కువగా ఆశిస్తే ఊహించని నిరాశే ఎదురవుతుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే రన్ చేయాలని భావించారు. మిలటరీ ఆపరేషన్, యాక్షన్ సన్నివేశాల కంటే ఎక్కువగా ఈ చిత్రంలో తండ్రి కొడుకుల సెంటిమెంట్.. కొడుకుపై తల్లి ప్రేమ లాంటి అంశాలే కనిపిస్తాయి. ఆ ఎమోషన్స్ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. కథని ప్రారంభించిన విధానం బావుంది.
కొన్ని సన్నివేశాలు మాత్రమే వర్కౌట్ అవుతాయి
కిడ్నాప్ కి గురైన కొడుకు తిరిగి వచ్చాక అక్కడి నుంచి కథ ఒక రేంజ్ లో ఉంటుందని అంతా ఊహిస్తారు. కానీ అక్కడ కూడా దర్శకుడు ఎమోషనల్ సీన్స్ తో నింపేశాడు. క్లైమాక్స్ అయితే ఆడియన్స్ సహనానికి పరీక్ష అని చెప్పాలి. చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాలు కొన్ని ఉంటాయి కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ స్థాయిలో ఉండవు. అక్కడక్కడ వర్కౌట్ కొన్ని భావోద్వేగ సన్నివేశాలకు కోసం ఒక్కసారి ఈ చిత్రాన్ని ట్రై చేయొచ్చు. కాకపోతే అంచనాలు తక్కువగా పెట్టుకుని చూడాలి.