MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Trisha Movies List: విజయ్ దళపతి, త్రిష కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు?అందులో ఎన్ని హిట్స్?

Vijay Trisha Movies List: విజయ్ దళపతి, త్రిష కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు?అందులో ఎన్ని హిట్స్?

Vijay Trisha Movies List: తమిళ రాజకీయాల్లో విజయ్ దళపతి సంచలనం సృష్టించిన నేపథ్యంలో త్రిష, విజయ్ ల పేర్లు మారుమోగుతున్నాయి. మరి రాజకీయాల్లో సత్తా చాటిన ఈ జంట.. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారు. అందులో హిట్ లెన్ని? ఫట్ లెన్నో ఇక్కడ చూద్దాం

2 Min read
Author : Kavitha G
Published : May 04 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్ దళపతి, త్రిష కలిసి నటించిన సినిమాలు
Image Credit : X

విజయ్ దళపతి, త్రిష కలిసి నటించిన సినిమాలు

విజయ్ దళపతి, త్రిష ఇద్దరూ తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులు. వీరిద్దరి కాంబినేషన్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ చాలా సహజంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ జంటను మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. అయితే ఇప్పటివరకు విజయ్, త్రిష కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు. వాటిలో ఏ సినిమాలు బాక్సాఫీసును షేక్ చేశాయో ఇక్కడ చూద్దాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
గిల్లి- 2004
Image Credit : trisha krishnan instagram

గిల్లి- 2004

విజయ్, త్రిష కలిసి 5 సినిమాల్లో నటించారు. మొదటిది గిల్లి. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలిపిన ఈ సినిమా తమిళ సినిమాల్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇందులో వీరి జోడీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్ కెరీర్‌ ని మలుపు తిప్పిందనే చెప్పవచ్చు.

Related Articles

Related image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Related image2
Top 5 Budget Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ ఇవిగో!
36
తిరుపాచి-2006
Image Credit : trisha krishnan instagram

తిరుపాచి-2006

ఆ తర్వాత విజయ్, త్రిష కలిసి తిరుపాచి సినిమాలో నటించారు. 2005 లో విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరం విడుదలై బాక్సాఫీసు దుమ్ముదులిపిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు పెరరసు దర్శకత్వం వహించారు. అన్నా చెల్లెల్ల సెంటిమెంటు, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ కథ.. విజయ్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

46
ఆది- 2006
Image Credit : instagram

ఆది- 2006

2006లో వచ్చిన ఆది(Aathi) సినిమాలో కూడా విజయ్, త్రిష కలిసి నటించారు. ఈ సినిమా ప్రధానంగా రివేంజ్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ చుట్టూ తిరుగుతుంది. విజయ్ ఇందులో మాస్ హీరోగా కనిపించి, తన యాక్షన్ స్కిల్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

56
కురువి- 2008
Image Credit : trisha krishnan instagram

కురువి- 2008

మరో రెండేళ్ల తర్వాత ఈ జంట కురువి సినిమాలో కలిసి సందడి చేశారు. 2008 లో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. విజయ్ స్టైల్, ఫైట్స్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేశాయనే చెప్పాలి. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

66
లియో- 2023
Image Credit : instagram

లియో- 2023

దాదాపు 15 సంవత్సరాల తర్వాత విజయ్, త్రిష మళ్లీ 2023లో కలిసి లియో సినిమాలో నటించారు. ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్‌గా నిలిచింది. త్రిష ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి కథకు బలాన్ని ఇచ్చారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించింది. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్ అన్నీ కలిపిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా విజయ్-త్రిష రీ యూనియన్‌కి అభిమానులు చాలా ఆనందించారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Recommended image2
Salman Khan: కెరీర్‌లో ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు.. భాయ్ చెప్పిన షాకింగ్ నిజం!
Recommended image3
Savitri: మహానటి సావిత్రి చివరిగా స్నేహితురాలిని కలిసి చెప్పిన మాటలివే.. కన్నీళ్లు ఆపుకోలేరు
Related Stories
Recommended image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Recommended image2
Top 5 Budget Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ ఇవిగో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved