MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: స్టార్ హీరోయిన్ ముఖం మీద సిగరెట్ పొగ ఊదిన నాగార్జున.. కింగ్ ఎందుకు అలా చేశాడు?

Nagarjuna: స్టార్ హీరోయిన్ ముఖం మీద సిగరెట్ పొగ ఊదిన నాగార్జున.. కింగ్ ఎందుకు అలా చేశాడు?

టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున ఓ స్టార్ హీరోయిన్ ముఖం మీద సిగరెట్ పొగ ఊది.. ఐ లవ్ యూ చెప్పాడని మీకు తెలుసా? తన కంటే 30 ఏళ్లు పెద్దదైన నటికి కింగ్ అలా ఎందుకు చెప్పాడు. కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 23 2026, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ కింగ్ నాగార్జున..
Image Credit : Pinterest

టాలీవుడ్ కింగ్ నాగార్జున..

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 66 ఏళ్ల వయసులో కూడా.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో.. ఏమాత్రం తగ్గడంలేదు. సినిమాల విషయంలో కాస్త వెనుకబడి ఉన్నా.. స్టార్ డమ్, ఇమేజ్ విషయంలో నాగర్జునకు వచ్చిన ఇబ్బందేమి లేదు. టాలీవుడ్ కు చిరంజీవి, బాలకష్ణ, వెంకటేష్ తో పాటు.. నాగార్జున కూడా కలిసి నాలుగు పిల్లర్లమాదిరిగా నిలిచారు.

 రొమాంటిక్, యాక్షన్, భక్తిరస సినిమాలతో నాగార్జున అద్భుతాలు చేశాడు. ఇప్పటికి హీరోగా నటిస్తూ.. సక్సెస్ ఫుల్ హోస్ట్ గా.. మల్టీ టాస్క్ లతో దూసుకుపోతున్నాడు. అయితే కెరీర్ బిగినింగ్ లో నాగార్జున ఓ స్టార్ హీరోయిన్ ముఖంపై సిగరెట్ పొగఊది మరీ ఐ లవ్యూ చెప్పిన సంగతి మీకు తెలుసా. ఆ స్టార్ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు షావుకారు జానకి. అవును ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
70 ఏళ్ల సినిమా జీవితాన్ని పూర్తి చేసుకున్న నటి..
Image Credit : our own

70 ఏళ్ల సినిమా జీవితాన్ని పూర్తి చేసుకున్న నటి..

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంలో.. సీనియర్ నటి ఎవరంటే వినిపించే పేరు షావుకారు జానకి. 94 ఏళ్ల వయసులో కూడా ఆమె ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా.. హుషారుగా ఉన్నారు. ప్రస్తుతం వయసురిత్య సినిమాలు చేయకపోయినా.. ఇండస్ట్రీలో ఆమె 70 ఏళ్ళకు పైగా యాక్టీవ్ గా ఉంది. 1949 లో కెరీర్ ను స్టార్ట్ చేసిన జానకీ.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వదినగా,అమ్మగా, అమ్మమ్మగా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించింది. ఇప్పటికీ ఇంటర్వ్యూలలో అప్పటి విశేషాలను షేర్ చేసుకుంటూ.. ఈతరం తారలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈక్రమంలోనే నాగార్జున నటన గురించి గుర్తు చేసుకుంది జానకి.

Related Articles

Related image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Related image2
Sudigali Sudheer: మిడ్ నైట్ లారీలెక్కి, మధ్యాహ్నానికి మళ్లీ డ్యూటీకి, సుడిగాలి సుధీర్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
35
జానకి ముఖంపై సిగరెట్ పొగఊది ఐలవ్యూ చెప్పిన నాగ్..
Image Credit : Asianet News

జానకి ముఖంపై సిగరెట్ పొగఊది ఐలవ్యూ చెప్పిన నాగ్..

కింగ్ నాగార్జున కెరీర్ బిగినింగ్ లో కొట్టిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో గీతాంజలి ఒకటి. ఈమూవీ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈసినిమాలో షావుకారు జానకి గెస్ట్ రోల్ చేసింది. ఈ సినిమాలో అల్లరి కుర్రాడి పాత్రలో నాగ్ నటించాడు. మూవీ బిగినింగ్ లో.. గ్రాడ్యూయేషన్ పట్టా అందుకుంటాడు నాగార్జున. ఆ మెడల్ ను అందించే పాత్రలో జానకి కనిపించింది. సరిగ్గా అదే టైమ్ లో నాగార్జున సిగరెట్ తాగి స్టేజ్ మీదకు వస్తాడు.. అప్పుడు ఆ పొగ నోటిలో ఉంటుంది. దాన్ని ఎటు వదలాలో తెలియక.. జానకి ముఖం మీదకు వదిలేస్తాడు.. ఆమె షాక్ లో ఉండగానే ఐలవ్యూ చెప్పి వెళ్లిపోతాడు.

45
గుర్తు చేసుకున్న సీనియర్ నటి..
Image Credit : our own

గుర్తు చేసుకున్న సీనియర్ నటి..

ఓ ఇంటర్వ్యూలో నాగార్జున నటన గురించి సందర్భం వచ్చినప్పుడు.. షావుకారు జానకి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ లో చేసిన మంచి మంచి సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. గీతాంజలి సినిమాను, నాగార్జున నటనను ఆమె ప్రశంసించారు. తన పిల్లలను సినిమా వైపు తీసుకురాలేదు షావుకారు జానకి.. అందరు రకరకాల రంగాల్లో సెటిల్ అవ్వగా.. ఆమె ప్రస్తుతం తన లైఫ్ ను హ్యాపీగా గడుపుతున్నారు.

55
నాగార్జున మల్టీ టాలెంట్..
Image Credit : Asianet News

నాగార్జున మల్టీ టాలెంట్..

ఇక నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా బిజీలో ఉన్నాడు. ఈ సినిమాతో రికార్డు క్రియేట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు కింగ్. తెలుగు పరిశ్రమలో నాగార్జున హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగా, స్టూడియో అధినేతగా, హోస్ట్ గా సక్సెస్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీని దాటుకుని నాగార్జున సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా కూడా సత్తా చాటాడు. ఎన్నో బిజినెస్ లు చేస్తూ.. టాలీవుడ్ లోనే రిచ్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని రిచ్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ
Recommended image2
Kangana Ranaut: మెడలో మంగళసూత్రంతో ప్రభాస్ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి చేసుకుందా?
Recommended image3
Arasan: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శింబు..బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ
Related Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
Sudigali Sudheer: మిడ్ నైట్ లారీలెక్కి, మధ్యాహ్నానికి మళ్లీ డ్యూటీకి, సుడిగాలి సుధీర్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved