MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode:సూపర్ ఎపిసోడ్-జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప,కార్తీక్-అమ్మ ఒడికి దీప

Karthika Deepam 2 Today Episode:సూపర్ ఎపిసోడ్-జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప,కార్తీక్-అమ్మ ఒడికి దీప

Karthika Deepam 2 Today Episode (మే 23వ తేదీ)లో కార్తీక్, దీప, శౌర్యలను కలవకుండా చేయాలి అనుకున్న జ్యో. దీపను తన గదిలో పడుకోమన్న సుమిత్ర. జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప, కార్తీక్. అమ్మ ఒడిలో పడుకోవాలని ఉందన్న దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : May 23 2026, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో అందరిని భోజనానికి పిలుస్తాడు శివన్నారాయణ. బావ, దీప తర్వాత తింటారు. మనం ముందు తిందాం అంటుంది జ్యోత్స్న. ఇక్కడ అందరూ సమానమే. మీ గొడవలు, పోటీలు ఆఫీసులో చూసుకోండి అని సీరియస్ గా చెప్తాడు శివన్నారాయణ. ఇది ఇంత శాడిస్ట్‌లా తయారైంది ఏంట్రా అని జ్యోత్స్న గురించి కార్తీక్ తో అంటుంది కాంచన. కొత్తగా తయారు కావడం ఏంటీ, బై బర్త్ తను అదేగా అంటాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జ్యోత్స్న రూల్స్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న రూల్స్

భోజనం చేసేటప్పుడు కూడా ఏదో రకంగా దీపను బాధపెట్టాలని చూస్తుంది జ్యోత్స్న. కార్తీక్ కౌంటర్ ఇస్తుంటాడు. ఆ తర్వాత శౌర్యను పిలిచి ఇంట్లో నువ్వు ఎవరి దగ్గర పడుకుంటావని అడుగుతుంది జ్యోత్స్న. అమ్మనాన్నలతో పడుకుంటాను. అప్పుడప్పుడు నానమ్మతో పడుకుంటాను అని చెప్తుంది శౌర్య. ఇక్కడ బావతో ఎవరూ పడుకోవడానికి వీల్లేదు.. రూల్స్ దాటితే పోటీ నుంచి తప్పుకోవాలి అంటుంది జ్యోత్స్న. 

సరే శౌర్య, దీప నా గదిలో పడుకుంటారని అంటుంది సుమిత్ర. నేను, కార్తీక్ నాన్న గదిలో పడుకుంటాము అంటాడు దశరథ. నేను జ్యోత్స్న గదిలో పడుకుంటాను అంటుంది కాంచన. దీని గొయ్యి ఇదే తీసుకున్నట్లుంది అని జ్యోత్స్న గురించి మనసులో అనుకుంటుంది పారు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: దీపకు జ్యో వార్నింగ్- జ్యోకు కార్తీక్ కౌంటర్- జ్యోపై సుమిత్ర కోపం
Related image2
Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
37
స్వప్న, కాశీల ప్రేమ
Image Credit : Jiohotstar

స్వప్న, కాశీల ప్రేమ

మరోవైపు కాశీని హగ్ చేసుకుంటుంది స్వప్న. ఏంటీ స్పీడు అని అడుగుతాడు కాశీ. మనం హనీమూన్‌కు వెళ్దాం అంటుంది స్వప్న. ఇప్పుడు పరిస్థితులు బాలేవు. తర్వాత వెళ్దామంటాడు కాశీ. అమ్మానాన్నే చెప్పారు వెళ్లమని అంటుంది స్వప్న. వాళ్లు అలాగే చెప్తారు. కానీ మన బాధ్యతలు మనం మర్చిపోవద్దు అంటాడు కాశీ. సరే అంటుంది స్వప్న. తర్వాత భార్యా భర్త ఇద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు.

47
జ్యోకు దీప థాంక్స్
Image Credit : Jiohotstar

జ్యోకు దీప థాంక్స్

ఇంకోవైపు జ్యోత్స్న దగ్గరకి వెళ్లి బుగ్గ గిల్లుతుంది దీప. గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఈ బుజ్జమ్మకు థ్యాంక్స్ చెప్పాలి బావ అని జ్యోత్స్నకు బుజ్జమ్మ అనే కొత్త పేరు పెడుతుంది దీప. బుజ్జమ్మకు థ్యాంక్స్ ఎందుకో అని అడుగుతాడు కార్తీక్. ఇది ఆఫీసులో నాతో ఛాలెంజ్ చేసింది. నా తల్లికి నన్ను దూరం చేస్తానని. కానీ, ఇక్కడ నాకు మా అమ్మతో కలిసి ఉండే అవకాశం దక్కింది అని మళ్లీ జ్యోత్స్నకు థ్యాంక్స్ చెప్తుంది దీప.

57
జ్యోతో ఆడుకున్న దీప, కార్తీక్
Image Credit : Jiohotstar

జ్యోతో ఆడుకున్న దీప, కార్తీక్

జ్యోత్స్న ఏం చేసినా మనకు మంచే జరుగుతుంది దీప అంటాడు కార్తీక్. అదెలా బావ అంటుంది దీప. ఈ బుజ్జమ్మ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించకపోతే మనం ఈ ఇంటికి వచ్చేవాళ్లమే కాదు.. జ్యోత్స్న గురించి ఈ ఇంట్లో నిజం తెలిసేదే కాదు. అలాగే సీఈఓ విషయంలో పంతానికి పోకుంటే నిన్ను పోటీకి దించేవాళ్లమే కాదు అంటాడు కార్తీక్. అందుకే థ్యాంక్స్ చెప్పాలని జ్యోత్స్న రెండు చెంపలను గట్టిగా గిల్లుతారు దీప, కార్తీక్.

గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. వేషాలు వేయకుండా వెళ్లి పడుకో అని వార్నింగ్ ఇస్తుంది దీప. నెల రోజుల్లో పెళ్లి చేస్తానని మాటిచ్చారు అని పెళ్లి గురించి గుర్తు చేస్తుంది జ్యోత్స్న. కచ్చితంగా అవుతుంది, నువ్వు కంగారుపడకు అని చెప్తాడు కార్తీక్. ఆ తర్వాత జ్యోత్స్న దాన్ని కంటిన్యూ చేస్తుంటే.. నేను మూర్ఖులతో వాదించను అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. వాళ్లు నీతో ఫుట్‌బాల్ ఆడుకున్నట్లు ఉంది అని జ్యోత్స్నతో అంటుంది పారు. ఆఫీస్‌లో నేను ఆడుకున్నా, ఇంట్లో వాళ్లు ఆడుకున్నారు, లెక్క సరిచేస్తానని అంటుంది జ్యోత్స్న.

67
బేబీ ఇబ్బంది పడదా?
Image Credit : Jiohotstar

బేబీ ఇబ్బంది పడదా?

తర్వాత సుమిత్ర గదిలో కింద పడుకోవాలి అనుకుంటుంది దీప. పైన పడుకోమని చెప్తుంది సుమిత్ర. నీ కడుపులో చిన్న బేబీ ఉంది కదమ్మా. నువ్వు కింద పడుకుంటే తను ఇబ్బంది పడదా అంటుంది శౌర్య. నీ కూతురు పెద్దది అయిపోయింది దీప. నేను అనాల్సిన మాటలు అదే అంటోంది, ఇలా పైన కూర్చో అని చెప్తుంది సుమిత్ర. 

77
తల్లి ఒడికి దీప
Image Credit : Jiohotstar

తల్లి ఒడికి దీప

శౌర్య సుమిత్ర ఒడిలో పడుకుని ఉండటం చూసి ఎమోషనల్ అవుతుంది దీప. ఏమైంది దీప, నీ కళ్లు ఎందుకు చెమమ్మగిల్లాయి. నీ మనసులో ఏముందో చెప్పు. నేనే మీ అమ్మను అనుకో అంటుంది సుమిత్ర. అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని ఉందని చెప్పి ఎమోషనల్ అవుతుంది దీప. రా దీప, నేనే నీ తల్లి అనుకో. నా ఒడిలో పడుకో అంటుంది సుమిత్ర. కన్నీళ్లతో తల్లి వంక ప్రేమగా చూస్తుంది దీప. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దీపకు జ్యో వార్నింగ్- జ్యోకు కార్తీక్ కౌంటర్- జ్యోపై సుమిత్ర కోపం
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved