MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Top 5 Budget Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ ఇవిగో!

Top 5 Budget Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ ఇవిగో!

తక్కువ బడ్జెట్ లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. లాంగ్ రైడ్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే, బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి స్టైల్ తో పాటు కంఫర్ట్ గా కూడా ఉంటాయి. మరి ఆలస్యమెందుకు ఓ లుక్కేయండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 27 2026, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్
Image Credit : AI

టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బైక్ తప్పనిసరి అయింది. చాలామంది తమకు నచ్చిన వాళ్లతో బైక్‌పై లాంగ్ రైడ్ వెళ్లాలనుకుంటారు. లేదా ఉద్యోగాలు, పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తుంటారు. అయితే పెట్రోల్ ఖర్చులు, నడుము నొప్పి వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతుంటాయి. అలాంటి వారికోసం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి, ఎంత దూరమైనా కంఫర్ట్ గా ప్రయాణించగలిగే బైక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో, వాటి ఫీచర్లు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
బజాజ్ ప్లాటినా 110
Image Credit : Google

బజాజ్ ప్లాటినా 110

లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి బజాజ్ ప్లాటినా 110 బెస్ట్ ఆప్షన్. దీనిలోని 'కంఫర్ట్' టెక్నాలజీ నడుం నొప్పి రాకుండా చూసుకుంటుంది. పొడవైన, మెత్తటి సీటు ప్రయాణంలో వచ్చే కుదుపులను తగ్గిస్తుంది. గతుకుల రోడ్లపై కూడా స్మూత్‌గా వెళ్లొచ్చు. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 నుంచి 75 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.72,000 నుంచి మొదలవుతుంది.

Related Articles

Related image1
Fridge Buying Tips: సింగిల్ డోర్ vs డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. ఎవరికి ఏది బెస్ట్?
Related image2
Power Saving Tips: AC, కూలర్, ఫ్యాన్ ఎక్కువగా వాడినా కరెంట్ బిల్లు తగ్గాలా? ఇలా చేస్తే చాలు!
36
టీవీఎస్ రేడియాన్ బైక్
Image Credit : tvs

టీవీఎస్ రేడియాన్ బైక్

టీవీఎస్ రేడియాన్ బైక్, దాని రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటుంది. దీని సీటు చాలా వెడల్పుగా, కుషనింగ్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ప్రయాణించడానికి ఇది మంచి మోడల్. ఇందులో సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (SBT) ఉండటంతో భద్రత ఎక్కువ. ఎక్కువసేపు నడిపినా కాళ్లు, నడుముపై ఒత్తిడి పడదు. ఇది 70 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.78,000 వరకు ఉంటుంది.

46
హోండా షైన్ 100/125
Image Credit : Honda

హోండా షైన్ 100/125

ఈ బైక్‌లోని 125cc మోడల్ లాంగ్ జర్నీకి సూపర్ గా సెట్ అవుతుంది. 100cc మోడల్ బడ్జెట్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీన్ని నడుపుతున్నప్పుడు వైబ్రేషన్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించినా అలసట, నడుం నొప్పి ఉండవు. హోండా షైన్ ఇంజిన్ చాలా సైలెంట్‌గా ఉంటుంది. స్మూత్ గేర్ షిఫ్టింగ్ వల్ల రైడింగ్ ఈజీగా ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ఈ బైక్ 65 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.85,000 వరకు ఉంటుంది.

56
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
Image Credit : SOCIAL MEDIA

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

మైలేజ్, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బెస్ట్ ఛాయిస్. దీనిలోని సెమీ-డిజిటల్ క్లస్టర్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ గతుకుల రోడ్లపై కూడా ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. తక్కువ బరువు ఉండటం ఈ మోడల్ స్పెషాలిటీ. అందుకే ట్రాఫిక్‌లో, హైవేలపై నడపడం సులభం. ఈ మోడల్ 70 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.78,000 వరకు ఉంటుంది.

66
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R
Image Credit : heromotocorp.com

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R

బడ్జెట్ ధరలో ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజ్ రెండూ అందించే బెస్ట్ 125cc బైక్.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R. స్పోర్టీ లుక్‌లో ఉండే ఈ మోడల్ రైడింగ్ పొజిషన్‌ను నడుం నొప్పి రాకుండా డిజైన్ చేశారు. ఈ బైక్ లీటర్‌ పెట్రోల్‌కు 66 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.95,000 వరకు ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Scooter: ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం.. అదిరిపోయే ఫీచ‌ర్లతో
Recommended image2
EV Scooter: 15 రూపాయ‌ల‌తో 100 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం.. నెల‌కు రూ. 1800 క‌డితే చాలు
Recommended image3
Car Parking: ఎండ‌లో కారు పార్కింగ్ చేస్తున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలుసా
Related Stories
Recommended image1
Fridge Buying Tips: సింగిల్ డోర్ vs డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. ఎవరికి ఏది బెస్ట్?
Recommended image2
Power Saving Tips: AC, కూలర్, ఫ్యాన్ ఎక్కువగా వాడినా కరెంట్ బిల్లు తగ్గాలా? ఇలా చేస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved