MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార భర్త అని పిలిపించుకోవడం గర్వంగా ఉంది.. విఘ్నేష్ శివన్ ఓపెన్ కామెంట్స్..

నయనతార భర్త అని పిలిపించుకోవడం గర్వంగా ఉంది.. విఘ్నేష్ శివన్ ఓపెన్ కామెంట్స్..

'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ విగ్నేష్ శివన్ తన భార్య నయనతార గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 09 2026, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నయనతార పై విఘ్నేష్ శివన్ కామెంట్స్..
Image Credit : X

నయనతార పై విఘ్నేష్ శివన్ కామెంట్స్..

నయనతార భర్త అని పిలిపించుకోవడం తనకు గర్వంగా ఉందని డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అన్నారు. తనకు దొరికిన అతిపెద్ద వరం నయనతార అని, తాము ప్రేమలో పడినప్పుడు తాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ను కూడా కాదని చెప్పారు. నయన్‌తో దగ్గరగా పరిచయం అయ్యాకే ఆమెపై తన అభిప్రాయం మారిందని విగ్నేష్ శివన్ తెలిపారు. తన కొత్త సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నయనతారను చూస్తే భయం..
Image Credit : our own

నయనతారను చూస్తే భయం..

"నయనతార భర్తగా గుర్తింపు పొందడం నాకు గర్వంగా ఉంది. నాతో ఉన్న ఫొటోను నయన్ మొదటిసారి వాట్సాప్ డీపీగా పెట్టింది. అది 'నానుమ్ రౌడీ దాన్' సినిమా షూటింగ్ టైమ్. నాకు నయనతారను చూస్తే భయం. 'మేడమ్' అని తప్ప ఇంకేమీ పిలిచేవాడిని కాదు. రీ-టేక్ అడగాలన్నా చాలా సంకోచించేవాడిని. నయన్ ఈ విషయం అర్థం చేసుకుంది. ఒకరోజు అందరి ముందే, 'మీరు డైరెక్టర్, మీరు చెప్పింది ఎన్నిసార్లయినా చేయడానికి నేను రెడీ. అస్సలు మొహమాటపడొద్దు' అని చెప్పింది. షూటింగ్ మొదలైన మూడో రోజే ఇది జరిగింది," అని విఘ్నేష్ శివన్ గుర్తుచేసుకున్నారు.

35
నయనతారపై నా అభిప్రాయం మారింది
Image Credit : our own

నయనతారపై నా అభిప్రాయం మారింది

"దగ్గరగా పరిచయం అయ్యాకే నయనతారపై నా అభిప్రాయం మారింది. ఇంత మంచి మనసున్న మనిషా ఈమె అనిపించింది. అందరి ముందు మనల్ని మనం నిరూపించుకోవడానికి, వాళ్లకు నచ్చినట్టు ఉండటానికి ప్రయత్నిస్తే, మనకంటూ మనం బతకడానికి టైమ్ ఉండదు. అందరినీ సంతృప్తి పరచలేం. నయనతారది అద్భుతమైన వ్యక్తిత్వం. ఆమె స్టార్‌డమ్ ఇతరులకు మాత్రమే. చాలామందికి నా పేరు తెలియదు. లేదా నన్ను చూసినా పేరు గుర్తుకురాదు. అందుకే 'నయనతార' అని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు," అని విఘ్నేష్ శివన్ అన్నారు.

45
విఘ్నేష్ శివన్ మోషనల్..
Image Credit : our own

విఘ్నేష్ శివన్ మోషనల్..

"ఆమె పేరుతో నన్ను గుర్తించడంలో నేను గర్వపడతాను. ఆమె నాకు దొరికిన అతిపెద్ద వరం. మేం ప్రేమలో పడినప్పుడు, నేను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ను కూడా కాదు. ఇప్పటికీ నయనతారను చూస్తే నాలో ఒకరకమైన భయం ఉంటుంది. భార్యాభర్తల బంధంలో 'ఓవర్‌షాడో' లాంటివి ఏముంటాయి? ఒకసారి నయనతారే, 'నా పాపులారిటీ నీడలో నీ టాలెంట్, పర్సనాలిటీ కనపడకుండా పోతాయేమో' అని కంగారుపడింది," అని విఘ్నేష్ శివన్ఎ మోషనల్ అయ్యారు.

55
విఘ్నేష్ శివన్ సినిమాలు..
Image Credit : x/7screenstudio

విఘ్నేష్ శివన్ సినిమాలు..

విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఫాంటసీ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార నిర్మించారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. మిస్కిన్, ఎస్.జె.సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image2
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Recommended image3
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Related Stories
Recommended image1
Janhvi Kapoor: డిప్రెషన్‌లో రామ్ చరణ్ హీరోయిన్.. జాన్వీ కపూర్ ను ఇబ్బంది పెట్టిన హిట్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Sneha Reddy: అల్లు అర్జున్ భార్య సంపాదన ఎంతో తెలుసా? స్నేహా రెడ్డి ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved