MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: డిప్రెషన్‌లో రామ్ చరణ్ హీరోయిన్.. జాన్వీ కపూర్ ను ఇబ్బంది పెట్టిన హిట్ సినిమా ఏదో తెలుసా?

Janhvi Kapoor: డిప్రెషన్‌లో రామ్ చరణ్ హీరోయిన్.. జాన్వీ కపూర్ ను ఇబ్బంది పెట్టిన హిట్ సినిమా ఏదో తెలుసా?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ డిప్రెషన్‌లోకి వెళ్ళిందని మీకు తెలుసా? కెరీర్ బిగినింగ్ లో ఒక సినిమా వల్ల ఆమె ఎంత ఇబ్బందిపడిందో తెలుసా? మొదటి సినిమా హిట్ అయినా జాన్వీ కపూర్ ఆ సక్సెస్ ను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోయింది. జాన్వీ బయటపెట్టిన అసలు నిజాలు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 09 2026, 07:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రీదేవి కూతురికి ఇండస్ట్రీలో తప్పని కష్టాలు..
Image Credit : Instagram / Janhvi Kapoor

శ్రీదేవి కూతురికి ఇండస్ట్రీలో తప్పని కష్టాలు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ 2018 నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టయితే, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే, తన నటన, అందంతో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. సినిమా ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకానొక టైంలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని స్వయంగా జాన్వీనే చెప్పింది. జాన్వీ కపూర్ తన మొదటి సినిమా 'ధడక్' రిలీజ్ తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది.

25
ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ ఎంట్రీ..
Image Credit : Instagram\JanhviKapoor

ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ ఎంట్రీ..

శ్రీదేవి మరణం తరువాత.. 2018లో వచ్చిన ధడక్ సినిమాతోనే ఆమె యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది. కానీ, ఆ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు తనకు అంత సంతోషాన్ని ఇవ్వలేదట. రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన జాన్వీ, 'ధడక్' రిలీజ్ తర్వాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పింది. జనాలు తనను అస్సలు ఇష్టపడటం లేదని అప్పట్లో అనిపించినట్టు ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

Related Articles

Related image1
Peddi OTT Rights: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న పెద్ది, రామ్ చరణ్ మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?
Related image2
Sneha Reddy: అల్లు అర్జున్ భార్య సంపాదన ఎంతో తెలుసా? స్నేహా రెడ్డి ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ వివరాలు
35
డిప్రెషన్‌లోకి స్టార్ హీరోయిన్.. కారణం ఏంటి?
Image Credit : our own

డిప్రెషన్‌లోకి స్టార్ హీరోయిన్.. కారణం ఏంటి?

జాన్వీ మాట్లాడుతూ, "ఎవరైనా నా మొదటి సినిమా 'ధడక్' గురించి మాట్లాడితే, అందులో నేను బాగా నటించానని, సినిమా హిట్టయిందని అంటారు. కానీ నా జ్ఞాపకాలు వేరేలా ఉన్నాయి. ఆ సమయంలో నేను డిప్రెషన్‌లో ఉన్నాను. నా పని అయిపోయింది, జనాలు నన్ను ద్వేషిస్తున్నారు అనిపించింది. ఎందుకో తెలియదు అమ్మ(శ్రీదేవి) చనిపోయిన తర్వాత నేను ఎమోషనల్‌గా చాలా వీక్‌గా మారిపోయాను. అమ్మ నుంచి వచ్చే కాన్ఫిడెన్స్‌ను అప్పుడు ఆడియన్స్ నుంచి ఆశించాను, కానీ అన్ని వైపుల నుంచి అనుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో, కేవలం నెగటివ్ విషయాల మీదే దృష్టి పెట్టడం మొదలుపెట్టాన‌‌ు." అని జాన్వీ కపూర్ చెప్పింది.

45
సినిమా హిట్ అయినా సంతోషం లేదు..
Image Credit : Twitter\MythriMovieMakers

సినిమా హిట్ అయినా సంతోషం లేదు..

జాన్వీ కపూర్ మాట్లాడుతూ " సినిమా హిట్ అయ్యి.. అంతా బాగుంది అనుకుంటున్నా.. నేను కేవలం నెగటివ్ కామెంట్స్‌ మాత్రమే పట్టించుకునేదాన్ని. 'ధడక్' ఒక సక్సెస్‌ఫుల్ సినిమా అనే విషయం నాకు అస్సలు అర్థం కాలేదు. నేను సరిగ్గా నటించలేదు, జనాలు నన్ను ఇష్టపడటం లేదు అనే ఫీలింగ్‌లోనే ఉండిపోయాను" అని జాన్వీ చెప్పుకొచ్చింది. ధడక్' సినిమా మరాఠీ బ్లాక్‌బస్టర్ 'సైరాట్'కు రీమేక్. దీనికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 110 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

55
రామ్ చరణ్‌కు హీరోయిన్‌గా.. '
Image Credit : Asianet News

రామ్ చరణ్‌కు హీరోయిన్‌గా.. '

జాన్వీ కపూర్ కెరీర్ విషయానికొస్తే, ఆమె ఇటీవల 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చింది జాన్వీ కపూర్. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తోంది. పెద్ది సినిమా సక్సెస్ అయితే.. జాన్వీ కపూర్ డిమాండ్ మరింతగా పెరగబోతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur : మృణాల్ ఠాగూర్ కి.. స్టార్ హీరోయిన్ భార్త లక్కీ చార్మ్‌గా ఎలా మారాడు?
Recommended image2
Sneha Reddy: అల్లు అర్జున్ భార్య సంపాదన ఎంతో తెలుసా? స్నేహా రెడ్డి ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ వివరాలు
Recommended image3
చిరంజీవి తల్లి అంజనాదేవి కి ఫేవరెట్ సీరియల్ హీరో ఎవరో తెలుసా? ఎందుకంత అభిమానం..
Related Stories
Recommended image1
Peddi OTT Rights: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న పెద్ది, రామ్ చరణ్ మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?
Recommended image2
Sneha Reddy: అల్లు అర్జున్ భార్య సంపాదన ఎంతో తెలుసా? స్నేహా రెడ్డి ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved