MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bharathiraja: భారతీరాజా సాహసం.. ఇల్లు అమ్మి సినిమా తీసిన స్టార్ డైరెక్టర్.. చివరికి ఏమయ్యిందంటే?

Bharathiraja: భారతీరాజా సాహసం.. ఇల్లు అమ్మి సినిమా తీసిన స్టార్ డైరెక్టర్.. చివరికి ఏమయ్యిందంటే?

లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న టైంలో, తన సొంత ఇంటిని అమ్మి ఒక సినిమా తీశారు. ఆ సినిమానే ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇంతకీ ఏంటా సినిమా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 10 2026, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 రెండు జాతీయ అవార్డులు గెలిచిన సినిమా..
Image Credit : X

రెండు జాతీయ అవార్డులు గెలిచిన సినిమా..

తమిళ సినిమా చరిత్రలో 'మొదల్ మరియాదై' ఒక క్లాసిక్. నటుడు శివాజీ గణేశన్‌ను కొత్త కోణంలో చూపించిన ఈ సినిమా, దర్శకుడు భారతీరాజాకు కూడా ఓ పెద్ద సవాల్. 1985లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయం సాధించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్థికంగా ఇబ్బందుల్లో భారతీరాజా
Image Credit : x/offBharathiraja

ఆర్థికంగా ఇబ్బందుల్లో భారతీరాజా

ఈ సినిమా కథను రచయిత ఆర్. సెల్వరాజ్ రాశారు. అప్పటికే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో, భారతీరాజా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. సొంతంగా సినిమా తీయాలని నిర్ణయించుకుని, చెన్నై టి.నగర్‌లోని తన ఇంటిని అమ్మేశారు. ఆ డబ్బును ఓ సూట్‌కేసులో పెట్టి నేరుగా రచయిత సెల్వరాజ్‌కు ఇచ్చారని చెబుతారు.

Related Articles

Related image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Related image2
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
35
భారతీరాజాను కదిలించిన కథ
Image Credit : x/offBharathiraja

భారతీరాజాను కదిలించిన కథ

‘నా భవిష్యత్తు మొత్తం ఈ కథపైనే ఆధారపడి ఉంది’ అని భారతీరాజా ఆ డబ్బును రచయితకు ఇచ్చారట. మొదట సరైన కథ దొరకలేదు. ఓ ప్రయాణంలో సెల్వరాజ్, ప్రఖ్యాత రష్యన్ రచయిత దాస్తోవస్కీ జీవిత చరిత్ర చదివారు. అందులో వయసులో పెద్దవాడైన రచయితకు, తన దగ్గర పనిచేసే యువతికి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకోవడం ఆయన్ను కదిలించింది.

45
100 రోజుల్లోనే సినిమా రిలీజ్..
Image Credit : x/offBharathiraja

100 రోజుల్లోనే సినిమా రిలీజ్..

ఆ స్ఫూర్తితో, తమిళనాడు గ్రామీణ నేపథ్యంతో సెల్వరాజ్ ఒక కొత్త కథను సిద్ధం చేశారు. ఆ కథ వినగానే భారతీరాజాకు బాగా నచ్చింది. వెంటనే సినిమా పనులు మొదలుపెట్టారు. ఆసక్తికరంగా, మొదట మలైసామి పాత్రకు నటుడు రాజేష్‌ను అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఆ పాత్ర శివాజీ గణేశన్‌కు దక్కింది. ఆయన ఓకే చెప్పాక, షూటింగ్ వేగంగా పూర్తి చేశారు. భారతీరాజా డబ్బు పెట్టిన 100 రోజుల్లోనే సినిమా విడుదల కావడం విశేషం.

55
மக்கள் மனதை வென்ற பாரதிராஜா
Image Credit : x/offBharathiraja

மக்கள் மனதை வென்ற பாரதிராஜா

మలైసామిగా శివాజీ గణేశన్, కుయిలిగా రాధ, తమ పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా శివాజీ గణేశన్ హుందాగా, సహజమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచారు. ఇళయరాజా సంగీతం, మలేషియా వాసుదేవన్ గానం, పల్లెటూరి అందాలు.. అన్నీ కలిసి 'మొదల్ మరియాదై'ని ఒక అద్భుత కావ్యంగా మార్చాయి. ఇప్పటికీ ఆ సినిమా, మలైసామి పాత్ర తమిళ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
Recommended image2
Naga Chaitanya: సమంతతో మూవీ రిజెక్ట్ చేసిన చైతు, బ్యాడ్ లక్..3 సినిమాలు, ముగ్గురు హీరోలకు సూపర్ హిట్లు
Recommended image3
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image2
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved