నన్ను కెలకడం వల్లే అల్లు అర్జున్, మంచు ఫ్యామిలీ, ఆర్జీవీ, నాగార్జున అందరికీ సమస్యలు.. వేణు స్వామి కామెంట్స్
2024 టాలీవుడ్ కి సంచలనాలు, వివాదాల సంవత్సరంగా మారింది. కల్కి, హనుమాన్, పుష్ప 2 లాంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టాయి. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి వరుస వివాదాలు వెంటాడుతున్నాయి.
2024 టాలీవుడ్ కి సంచలనాలు, వివాదాల సంవత్సరంగా మారింది. కల్కి, హనుమాన్, పుష్ప 2 లాంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టాయి. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడంతో ఇండస్ట్రీలో తీవ్ర వివాదాలు మొదలయ్యాయి. దీనికంతటికీ కారణం ఏంటి అనే అంశంపై వేణు స్వామి తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఆ తర్వాత సమంత విషాయంలో అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మని పోలీసు కేసులు వెంటాడడం మొదలు పెట్టాయి. ఇటీవల మంచు ఫ్యామిలిలో ఆస్తి గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంచు ఇంట వ్యవహారం రచ్చకెక్కింది. మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదాలు తారా స్థాయికి చేరాయి.
Also Read : మగధీర కంటే ముందే అల్లు అరవింద్ దశతిరిగేలా చేసిన చిత్రం.. ఆయన బ్లండర్ మిస్టేక్ వల్లే
మీడియాలో మంచు ఫ్యామిలీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. జర్నలిస్ట్ పై దాడి సంఘటనలో మోహన్ బాబు కూడా కేసుల్లో చిక్కుకున్నారు. అత్యంత సంచలనంగా మారిన సంఘటన అల్లు అర్జున్ అరెస్ట్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ పై పలు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బన్నీ బెయిల్ పై విడుదలయ్యారు. కానీ కేసు మాత్రం కొనసాగుతోంది.
ఇలా ఇండస్ట్రీ వరుస వివాదాలతో సతమతం కావడానికి కారణం ఏంటో చెబుతూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను కెలికినప్పటి నుంచే ఇండస్ట్రీ గింగిరాలు తిరగడం మొదలు పెట్టింది. వేణు స్వామి సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయనపై కంప్లైట్ చేశారు. వేణుస్వామిపై ట్రోలింగ్ కూడా జరిగింది. తనకి కెలకడం వల్లే ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితి తలెత్తింది అని అర్థం వచ్చేలా వేణు స్వామి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇంకా చాలా సంచలనాలు జరుగుతాయి. వేణు స్వామి అంతా తుస్సు అని అన్నోళ్ల నోర్లు మూతపడ్డాయి. ఈ సంచలనాల గురించి తాను ఆగష్టు లోనే చెప్పాను అని వేణు స్వామి తనని తాను సమర్థించుకున్నారు.