మగధీర కంటే ముందే అల్లు అరవింద్ దశతిరిగేలా చేసిన చిత్రం.. ఆయన బ్లండర్ మిస్టేక్ వల్లే
అల్లు అరవింద్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరు. 70వ దశకం నుంచి అల్లు అరవింద్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే చిత్రాలని కూడా అల్లు అరవింద్ అప్పుడప్పుడూ నిర్మిస్తూ వచ్చారు.
అల్లు అరవింద్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరు. 70వ దశకం నుంచి అల్లు అరవింద్ నిర్మాతగా రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ ఇంటి అల్లుడయ్యాక ఆయనతో అల్లు అర్జున్ అనేక చిత్రాలు నిర్మించారు. హీరో, విజేత లాంటి చిత్రాలు అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చినవే. ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే చిత్రాలని కూడా అల్లు అరవింద్ అప్పుడప్పుడూ నిర్మిస్తూ వచ్చారు.
Ghajini
ఆ కోవకి చెందిన చిత్రమే పెళ్లి సందడి. ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా చేసిన చిత్రం మగధీర. అప్పటి వరకు తెలుగు సినిమాలో ఉన్న బడ్జెట్, కలెక్షన్స్ లెక్కలన్నీ పూర్తిగా మార్చేసింది మగధీర. పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభాలు తీసుకువచ్చింది.
అయితే మగధీర కంటే ముందే అల్లు అరవింద్ ఒక అద్భుతం చేశారు. కాకపోతే తెలుగులో కాదు హిందీలో. అదే అమీర్ ఖాన్ తో నిర్మించిన గజినీ చిత్రం. ఈ చిత్రంతో అల్లు అరవింద్ కి ఊహకందని లాభాలు వచ్చిపడ్డాయి. సూర్య నటించిన తమిళ చిత్రం గజినికి రీమేక్ గా హిందీ గజినీ తెరకెక్కింది. రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న అల్లు అరవింద్ హిందీలో నిర్మించారు.
వాస్తవానికి గజినీ రీమేక్ హక్కులు అల్లు అరవింద్ దగ్గర లేవు. మొదటి గజినీ చిత్రం చూసి దానిని తెలుగులో రీమేక్ చేయాలని భావించిన నిర్మాత బెల్లంకొండ సురేష్. ఆయన తమిళ వెర్షన్ చూసి.. అద్భుతంగా ఉంది.. కచ్చితంగా తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారట. దీనితో వెంటనే రిమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు. రీమేక్ హక్కులు కొన్న తర్వాత తెలుగులో ఒక స్టార్ హీరోని కలిసి ఈ చిత్రం చేయమని అడిగారట. కానీ ఆ స్టార్ హీరో సూర్య గెటప్ చూసి భయపడ్డారు.
సూర్య లాగా గుండు కొట్టించుకోవడం, ఒళ్ళంతా టాటూలు వేయించుకోవడం నా వల్ల కాదని రిజెక్ట్ చేశారు. దీనితో బెల్లంకొండ సురేష్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. తాను ఎలాగూ రీమేక్ చేయడం లేదు కదా అని హక్కులని కూడా వెనక్కి ఇచ్చేశారు. ఆ తర్వాత అల్లు అరవింద్, మరికొందరు రీమేక్ హక్కులు తీసుకుని ముందుగా తెలుగులో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేశారు. అప్పుడు బెల్లంకొండ సురేష్ తాను ఎంత బ్లండర్ మిస్టేక్ చేశానో కదా అని ఫీల్ అయ్యారట.
రీమేక్ చేయాలి అని అనుకున్నాను కానీ డబ్బింగ్ రిలీజ్ చేయాలి అనే ఆలోచనే తనకి రాలేదని సురేష్ తెలిపారు. డబ్బింగ్ ఆలోచన వచ్చి ఉంటే.. గజినీ మూవీ అల్లు అరవింద్ చేతుల్లోకి వెళ్ళేది కాదు. మొత్తంగా బెల్లంకొండ సురేష్ చేసిన మిస్టేక్ అల్లు అరవింద్ కి బాగా కలసి వచ్చింది.