MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venkatesh: అన్నకి పోటీగా వెంకటేష్‌ ప్రొడక్షన్‌, రామానాయుడుకి చుక్కలు.. సోగ్గాడితో చేదు అనుభవం

Venkatesh: అన్నకి పోటీగా వెంకటేష్‌ ప్రొడక్షన్‌, రామానాయుడుకి చుక్కలు.. సోగ్గాడితో చేదు అనుభవం

వెంకటేష్‌ నాలుగు దశాబ్దాలుగా హీరోగా రాణిస్తున్నారు. కానీ ఏనాడూ ఆయన నిర్మాణం వైపు వెళ్లలేదు. కానీ వెంకటేష్‌ నిర్మాతగా మారి ఓ మూవీని నిర్మించారు. గట్టి దెబ్బ తిన్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 14 2026, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సురేష్‌ ప్రొడక్షన్‌లోనే ఎక్కువగా వెంకటేష్‌ సినిమాలు
Image Credit : Facebook / Venkatesh

సురేష్‌ ప్రొడక్షన్‌లోనే ఎక్కువగా వెంకటేష్‌ సినిమాలు

విక్టరీ వెంకటేష్‌ ఎక్కువగా తమ సొంత బ్యానర్‌ సురేష్‌ ప్రొడక్షన్ లోనే మూవీస్‌ చేస్తుంటారు. ఇది ఆయన తండ్రి డి రామానాయుడు స్థాపించారు. ఈ మధ్యనే సురేష్‌ ప్రొడక్షన్స్  యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలుగులో ఇంతటి సుధీర్ఘంగా నిర్మాణంలో ఉన్న ఏకైక సంస్థగా సురేష్‌ ప్రొడక్షన్స్ ని చెప్పొచ్చు. ప్రస్తుతం వెంకీ అన్నయ్య సురేష్‌ బాబు సమక్షంలో ఈ ప్రొడక్షన్‌ రన్‌ అవుతుంది. అన్న సమక్షంలోనే ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నారు వెంకటేష్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సురేష్ ప్రొడక్షన్‌ ఉండగానే తన పేరుతోనే వెంకటేష్‌ ప్రొడక్షన్‌
Image Credit : our own

సురేష్ ప్రొడక్షన్‌ ఉండగానే తన పేరుతోనే వెంకటేష్‌ ప్రొడక్షన్‌

వెంకటేష్‌ హీరోగానే ఇన్నాళ్లు రాణించారు. కానీ ఎప్పుడూ ప్రొడక్షన్‌ వైపు వెళ్లలేదు. కానీ ఆయన ప్రొడ్యూసర్‌గా మారారు. ఒకే ఒక్క సినిమా తీశారు. తనపేరుతోనే నిర్మాణ సంస్థని స్థాపించారు. కానీ చేదు అనుభవాన్ని చవిచూశారు. నిర్మాత రామానాయుడు అయితే ఖంగు తిన్నారు. దీంతో ఆ ఒక్క మూవీతోనే ప్రొడక్షన్‌ని పక్కన పెట్టారు. ఇంతకి ఏం జరిగిందంటే. రామానాయుడు తన బ్యానర్‌లో తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ.. ఇలా అనేక భాషల్లో సినిమాలు నిర్మించారు. అప్పట్లో ఈ ప్రొడక్షన్‌ చాలా యాక్టివ్‌గా ఉండేది.

35
వెంకటేష్‌ ప్రొడక్షన్‌లో సోగ్గాడు `ఎంకి నాయుడు బావ` మూవీ
Image Credit : X/@filmytopics

వెంకటేష్‌ ప్రొడక్షన్‌లో సోగ్గాడు `ఎంకి నాయుడు బావ` మూవీ

అయితే వెంకటేష్‌కి సినిమాల్లోకి రావాలని ఆసక్తి లేదు. అప్పుడు స్టడీస్‌తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన్ని నిర్మాతగా సెట్‌ చేయాలనుకున్నారట రామానాయుడు. పెద్ద కొడుకు, వెంకీ అన్న సురేష్‌ బాబుతో సురేష్‌ ప్రొడక్షన్‌ ఉన్నప్పటికీ.. వెంకటేష్‌ పేరుతోనూ ప్రొడక్షన్‌ స్టార్ట్ చేశారు. `వెంకటేష్‌ ఎంటర్‌ప్రైజెస్‌` పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. తొలి ప్రయత్నంగా శోభన్‌ బాబు హీరోగా `ఎంకి నాయుడు బావ` అనే చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నిర్మాతగా వెంకటేష్‌ పేరు వేశారు. వాణిశ్రీ ఇందులో హీరోయిన్‌. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు.

45
వెంకటేష్‌, రామానాయుడుకి పెద్ద షాక్‌
Image Credit : X/@filmytopics

వెంకటేష్‌, రామానాయుడుకి పెద్ద షాక్‌

1978లో గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీని నిర్మించారు. కానీ ఇది బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.  వెంకటేష్‌ పేరుతో సినిమా తీస్తే ఈ రకంగా బెడిసి కొట్టిందేంటి అని రామానాయుడు షాక్‌ అయ్యారు. వెంకీ కూడా ఈ ప్రొడక్షన్‌ బాధ్యతలు చూసుకున్నారు. కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో అటు వెంకీ, ఇటు రామానాయుడు కూడా షాక్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ వెంకీని నిర్మాణ రంగంలోకి దించలేదు. మళ్లీ స్టడీస్‌ వైపు ఫోకస్‌ పెట్టారు.

55
కళియుగ పాండవులు మూవీతో వెంకటేష్‌ హీరోగా ఎంట్రీ
Image Credit : Facebook / Venkatesh

కళియుగ పాండవులు మూవీతో వెంకటేష్‌ హీరోగా ఎంట్రీ

ఆ తర్వాత వెంకటేష్‌ అనుకోకుండా `కళియుగ పాండవులు` చిత్రంతో హీరోగా మారాల్సి వచ్చింది. 1986లో ఆయన వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు టాలీవుడ్‌లో సీనియర్స్ లో టాప్‌ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ఇటీవల ఆయన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో పెద్ద హిట్‌ అందుకున్నారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు`మూవీతో మరో హిట్‌లో భాగం అయ్యారు. ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో `ఆదర్శకుటుంబం` మూవీ చేస్తున్నారు. నెక్ట్స్ అనిల్‌ రావిపూడితోనే మరో హిట్‌ అందుకోబోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
శోభన్ బాబు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Maheshbabu ని రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? మహేష్‌ అభిమానులకు తీరని కోరికే
Recommended image2
Funky Collections: `ఫంకీ` మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు.. అనుదీప్‌ దెబ్బకి విశ్వక్‌ సేన్‌ జాక్‌ పాట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved