MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: తెలిసి తెలియక పొరపాటు చేస్తున్న వేద.. యష్ లైఫ్ లోని మాళవిక మళ్ళీ రానుందా?

Ennenno Janmala Bandham: తెలిసి తెలియక పొరపాటు చేస్తున్న వేద.. యష్ లైఫ్ లోని మాళవిక మళ్ళీ రానుందా?

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి రేటింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. తన కొడుకుని చెత్త కుప్పపాలు చేసినందుకు మాజీ భార్యపై ఆవేశంతో రగిలిపోతున్న ఒక మాజీ భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Jun 02 2023, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో ఈ పరిస్థితి అంతటికీ నేనే కారణం ఏమో అనిపిస్తుంది. మాళవికతో సర్దుకుపోయి ఉండి ఉంటే ఈరోజు నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ బాధపడతాడు యష్. దానికి మీరేం చేస్తారు. మీరు బాధ పడినంత మాత్రాన జరిగిపోయింది మారదు. ఇప్పుడు పరిస్థితిని ఎలా చక్క పెట్టాలో అది మాత్రం ఆలోచించండి అంటూ భర్తకి సర్ది చెప్పి ఇంటికి తీసుకు వెళుతుంది వేద.
 

28

మరోవైపు ఆదిత్య దగ్గరికి వచ్చి దెబ్బ నొప్పిగా ఉందా అని అడుగుతుంది మాలిని. కొంచెం తగ్గింది నానమ్మ పెద్దగా నొప్పి లేదు అంటాడు ఆదిత్య. వాడు అలసిపోయినట్లుగా ఉన్నాడు తీసుకెళ్లి పడుకోబెట్టు అంటాడు రత్నం. పద ఆదిత్య నాతో పడుకుందువుగానివి అంటుంది మాలిని. అన్నయ్య మీ దగ్గర కాదు నా గదిలో పడుకుంటాడు మనం కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది కదా అని ఆదిత్యతో చెప్పి తనతో పాటు తీసుకువెళ్తుంది ఖుషి.
 

38

చూసావా తల్లుల పెంపకంలో ఎంత తేడా ఉందో. ఇద్దరు పిల్లల మానసిక పరిస్థితిలో ఎంత తేడా ఉందో చూడు  అంటుంది మాలిని. అవును ఆదిత్య ప్రతిదానికి భయపడుతున్నాడు. వేద దగ్గర పెరిగిన ఖుషి మాత్రం భయాన్ని పోగొట్టే లాగా మాట్లాడుతుంది అంటాడు రత్నం. అందుకే అంటారు తల్లి గొప్పతనం పిల్లల పెంపకంలోనే తెలుస్తుందని అంటూ వేదని మెచ్చుకుంటుంది మాలిని. మరోవైపు ఇంటికి వస్తూనే ఇంకా కోపంగా ఉన్నట్లున్నారు నాకు ఒక మాట ఇవ్వండి అని భర్తని అడుగుతుంది వేద.
 

48

నాకు ఏదో తేడా కొడుతుంది ముందు విషయం చెప్పు అంటాడు యష్. ఇప్పుడు మీరు మాళవిక ని ఏమీ అనకండి అనడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అంటుంది వేద. ఎందుకు అనకూడదు తను ఎలాగో పోనివ్వు తన సంగతి నాకు అనవసరం కానీ నా కొడుకుని చెత్తకుప్ప పాలు చేసింది అంటూ ఆవేశంతో రగిలిపోతాడు యష్. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అయినా తనని ఏమైనా అంటే ఆ ప్రభావం ఆదిత్య మీద పడుతుంది.
 

58

ఇప్పటికే తల్లి పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాడు. ఆదిత్య కోసమైనా మాళవికని ఏమీ అనకండి అంటుంది వేద. సరే అంటూ భార్యకి మాటిస్తాడు యష్. మరోవైపు నీలాంబరి దంపతులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కైలాష్ పూల బొకేతో వచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. ఇతను ఎవరు అని అడుగుతుంది నీలాంబరి. మన శత్రు వర్గానికి చాలా దగ్గర వాడు మనకి చాలా కావలసిన వాడు అంటాడు అభి.
 

68

దెబ్బలు తిన్నందుకు బాధగా ఉందా అంటాడు కైలాష్. తింటే తిన్నాను కానీ వాడి జీవితం మీద దెబ్బ కొట్టాను నాకు అంతే చాలు అంటాడు అభి. నిజమే బ్రో ఇప్పుడు రోడ్డున పడ్డ మాళవిక వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఎలాగూ నీతో వర్కౌట్ అవ్వదని తనకి అర్థమై ఉంటుంది. మళ్లీ యష్ కి  భార్యగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు చూడాలి యష్ బాధ అంటూ ఆనందపడతాడు కైలాష్.

78

అవును ఇప్పుడు యష్ రెండిళ్ళ పూజారి అని యష్ పరిస్థితిని తలుచుకొని పండగ చేసుకుంటారు కైలాష్, అభి. మరోవైపు పడుకున్న మాళవికని చూస్తాడు యష్. తను నిద్రపోతుంది డిస్టర్బ్ చేయకండి అంటుంది వేద. అందర్నీ డిస్టర్బ్ చేసి తను చూడు ఎంత ప్రశాంతంగా పడుతుందో అంటూ ఆవేశంతో రగిలిపోతాడు యష్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆదిత్య వస్తాడు. నాకు భయంగా ఉంది అమ్మ దగ్గర పడుకుంటాను అంటాడు. వేద తీసుకువెళ్లి మాళవిక పక్కన పడుకోబెడుతుంది. తిరిగి యష్ దగ్గరికి వస్తుంది.

88

నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది. ఆదిత్య మన కళ్ళముందే తిరుగుతున్నాడు అంటాడు యష్. చూశారా ఇందాకే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నారు ఇప్పుడు అదే విషయం సంతోషాన్నిస్తుంది అంటున్నారు. అలాగే ప్రతిదీ మంచి జరుగుతుందని అనుకుందాము. ఎలా అయినా ఆదిత్యని మీకు దగ్గర అయ్యేలాగా చేసే బాధ్యత నాది అంటుంది వేద. తరువాయి భాగంలో వేద ఆంటీ చాలా మంచిది అంటాడు ఆదిత్య. తన వల్లే మన బ్రతుకులు ఇలా తయారయ్యాయి అంటుంది మాళవిక.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
యష్ టాక్సిక్ వాయిదా వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ధురంధర్ 2 తో క్లాష్ భయమా?
Recommended image2
Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..
Recommended image3
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved