MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: అసలు విషయం చెప్పి విన్నికి షాకిచ్చిన అభి.. నిజం తెలుసుకొని నిర్గాంతపోయిన వేద!

Ennenno Janmala Bandham: అసలు విషయం చెప్పి విన్నికి షాకిచ్చిన అభి.. నిజం తెలుసుకొని నిర్గాంతపోయిన వేద!

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భార్యని అపార్థం చేసుకున్నందుకు పశ్చాతాప పడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Apr 27 2023, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎపిసోడ్ ప్రారంభంలో నేను లేకపోయినా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాను. రాత్రిపూట ఒక్కదానివే క్లినిక్ కి వెళ్ళకు, మా అమ్మానాన్నలకి కూడా నువ్వే ధైర్యం చెప్పాలి ఖుషి కూడా జాగ్రత్త అంటూ అప్పగింతలు పెడతాడు యష్. ఏదో అప్పగింతలు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు ఏంటి మీరు మళ్ళీ పది రోజుల్లో వచ్చేస్తారు కదా అంటుంది వేద.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

అన్ని మనం అనుకున్నట్లుగా జరగవు అంటాడు యష్. నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతాడు. మీకోసం ఏమైనా చేయటానికి నేను సిద్ధం అంటుంది వేద.జీవితంలో ఎప్పుడూ కన్నీళ్లు పెట్టనని మాట ఇవ్వు అంటాడు యష్. అలాగే అంటూ యష్ కి మాటిచ్చి హగ్ చేసుకుంటుంది వేద. ఎమోషనల్ అవుతాడు యష్. మరోవైపు అభి, విన్ని కి ఫోన్ చేసి యశోదర్  అమెరికాకి పారిపోతున్నాడంట కదా అంటాడు.

39

ఏం మాట్లాడుతున్నావ్ అని ఆశ్చర్యంగా అడుగుతాడు విన్ని. నీకు తెలియకపోవడమేంటి? ఆఫీస్ మొత్తం వసంత్ కి అప్పజెప్పి పర్మినెంట్గా వెళ్ళిపోతున్నాడంట కదా, దానికి కారణం మాత్రం నువ్వే, వేదని కెలికావు అందుకే రెండో పెళ్ళాన్ని కూడా వదిలేసి పోతున్నాడు వాడి జాతకమే అంత. అప్పట్లో నేను మాళవికని కెలికాను, ఇప్పుడు నువ్వు. వాడు పోతే పోయాడు నువ్వు  జాగ్రత్తగా చూసుకో అంటూ ఫోన్ పెట్టేస్తాడు అభి.

49

కోపంతో రగిలిపోయిన విన్ని ఆవేశంగా వేద వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు ఎయిర్ పోర్టుకు రావటానికి రెడీగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి మీరు ఎయిర్పోర్ట్ కి రావద్దు. నేను చూడటానికి పైకి బానే ఉన్నా, లోపల చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. అక్కడికి వస్తే మీరు కూడా బాధపడతారు అంటాడు యష్. నువ్వు ఏదంటే అదే, నిన్ను ఇబ్బంది పెట్టం అంటాడు రత్నం. అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని యష్  వెళ్ళిపోతుంటే మరొకసారి వదిన కోసమైనా ఆలోచించు.

59

నువ్వు ఎంత చెప్పినా నా మనసు అంగీకరించడం లేదు, నేను నిజం చెప్పేస్తాను అంటాడు వసంత్. నేను వెళ్ళేది వేదకోసమే, ఇంకొక మాట మాట్లాడొద్దు అంటూ వసంత్ మీద కోప్పడతాడు యష్. వాళ్ళిద్దరూ చిన్నగా మాట్లాడుకోవడం వల్ల పక్కనున్న వాళ్లకి ఏమీ వినిపించదు. వసంత్ వదినని ఎయిర్ పోర్ట్ వరకు తీసుకు వెళ్ళమంటున్నాడు అనుకుంటుంది మాలిని. ఆ మాత్రానికే వాడిని ఎందుకు కోప్పడతావు అంటుంది.

69

ఎప్పుడు మీ అన్నయ్య ఏం చెప్పినా కాదనే వాడివి కాదు, ఇప్పుడు ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు అంటుంది  వేద. ఇప్పుడు చెప్పకపోతే మరి ఎప్పుడూ చెప్పలేను వదిన అంటాడు వసంత్. నువ్వు చెప్పినా నేను వినను. నా గురించి నా భర్త కన్నా ఎక్కువ ఆలోచిస్తావా నువ్వు అంటూ వసంత్ నోరు మూయిస్తుంది  వేద. అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళబోతూ గుమ్మాన్ని తగిలి తూలిపోతాడు  యష్.

79

పడిపోకుండా అతన్ని పట్టుకుంటుంది వేద. నేను నీకు న్యాయమేం చేశానని నా మనసాక్షి చెప్తుంది అనుకుంటాడు యష్. మనసాక్షి నాకు చెప్తుంది మీరు నాకు అన్యాయం చేయరు అనుకుంటుంది వేద. బయటికి మాత్రం జాగ్రత్త చెప్పి వీడ్కోలు చెప్పి పంపిస్తుంది. కాసేపటి తర్వాత విన్ని ఆవేశంగా వచ్చి యష్ ఏడి అని అడుగుతాడు. ఇప్పుడే ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు అంటుంది వేద. వెళ్లిపోయాడా అంటూ ఎమోషనల్ అవుతాడు విన్ని.

89

మిమ్మల్ని మోసం చేశాడు, పది రోజుల్లో వచ్చేస్తానని మీకు అబద్ధం చెప్పాడు కానీ అక్కడ పర్మినెంట్ గా ఉండిపోవటానికి వెళ్ళాడు, వసంత్ కి ఆఫీస్ విషయాలు అప్పచెప్పేసాడు అంటూ చెప్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదంతా నిజమేనా అంటూ వసంత్ ని నిలదీస్తుంది వేద. నేను ఇందాక చెప్పాలనుకున్న విషయం ఇదే కానీ యష్ చెప్పనివ్వలేదు, ఇంకొక విషయం ఏంటంటే తను నీకు డైవర్స్ పేపర్స్ కూడా ఇచ్చాడు అంటూ ఆ పేపర్స్ ని వేద చేతిలో పెడతాడు వసంత్.
 

99

 ఎపిసోడ్ ప్రారంభంలో భర్త దగ్గరికి వచ్చి ఎందుకు తాగుతున్నారు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు నేను ఏం తప్పు చేశాను  అని అడుగుతుంది వేద. తప్పు చేసింది నువ్వు కాదు నేను జరిగిన పొరపాటు నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే తప్పు చేశాను. నేను దురదృష్టవంతుడిని అంటాడు యష్. ఎందుకు బాధ పడుతున్నారు నాతో చెప్పండి అంటుంది వేద. తరువాయి భాగంలో భర్తని తన కారులో తీసుకువచ్చి మధ్యలో దిగమంటుంది వేద. డైవర్స్ పేపర్స్ చూపిస్తే ఆశ్చర్యపోతాడు యష్. నేను నీకు ఏ విధంగానూ తగిన వాడిని కాదు అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. ఎమోషనల్ గా అతన్ని హత్తుకొని ఐ లవ్ యు చెప్తుంది వేద. యష్ కూడా ఐ లవ్ యు చెప్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Recommended image2
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image3
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved