- Home
- Entertainment
- Ennenno janmala bhandam: అమ్మా అని పిలిచిన ఖుషి.. కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలకు హత్తుకున్న వేద!
Ennenno janmala bhandam: అమ్మా అని పిలిచిన ఖుషి.. కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలకు హత్తుకున్న వేద!
Ennenno janmala bhandam: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno janmala bhandam) సీరియల్ ప్రేక్షకులకు రోజురోజుకి మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక రెండు ఫ్యామిలీలు యశోధర, వేద (Vedha)ల ఎంగేజ్మెంట్ వేడుకను ఘనంగా ముగించి ఆనందంగా చిందులు వేస్తూ ఉంటారు.

ఆ తర్వాత యశోదర్ (Yashodar) , వేదలు ఖుషి ను ఎంతగా మిస్ అవుతున్నారో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వేద, మాళవిక కు కాల్ చేసి 'మా ఇంట్లో చిన్న పార్టీ జరుగుతుంది మీకేమి అభ్యంతరం లేకపోతే ఆ పార్టీకి ఖుషి (khushi) ను పంపిస్తారా' అని అడుగుతుంది. దానికి మాళవిక సరే అని అంటుంది.
ఆ తర్వాత అభి (Abhi) .. వేద ను ఖుషి కి ఆయా గా పెట్టుకుందాము అని అడుగుతాడు. దాంతో మాళవిక 'యు ఆర్ టూ మచ్ అభి' అని చెప్పి కోర్టులో ఖుషి కస్టడీ మనకు వచ్చే దాకా వేద సహాయ పడితే అది చాలు అని మాళవిక చెబుతుంది. అంతేకాకుండా ఆ తర్వాత ఆ వేద (Vedha) ఎవరో..మనం ఎవరో అని అంటుంది.
మరోవైపు ఇరు ఫ్యామిలీల కలిసి పంతులు గారితో పెళ్లి ముహూర్తం పెట్టిస్తూ ఉండగా పంతులు కట్న కానుకలు గురించి మాటలు మాట్లాడుకొండి అంటాడు. దాంతో మాలిని (Maalini) మాకు ఎలాంటి కారణాలు అవసరం లేదు అని చెబుతుంది. ఆ మాటతో సులోచన (Sulochana) కట్నకానుకల విషయంలో ఎలాంటి లోటు చేయము అని చెబుతుంది.
ఆ తర్వాత మాలిని (Malini) 'వేదను నా కన్న కూతురు లా మహారాణిలా చూసుకుంటాను' అని సులోచన కు మాట ఇవ్వగా ఆ మాటతో సులోచన ఎంతో ఎమోషనలగా మాలిని కి చేతులెత్తి దండం పెడుతుంది. ఇక దాంతో మాలిని ఊరుకో సులోచన (Sulochana) మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా అని ఎంతో ఆనందంగా చెబుతుంది.
ఇక ఆ తర్వాత ఫ్యామిలీ అంతా పెళ్లిలో సంగీత్ ను కూడా ఏర్పాటు చేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత యశోధర, ఖుషి (Khushi) తో ' మీ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోయేది మీ డాడీ నె' అని చెబుతాడు. దాంతో ఖుషి ఆనందంగా వెళ్లి వేదను అమ్మ అని తెలుస్తుంది. దాంతో ఖుషి ను వేద (Veda) దగ్గరగా తీసుకుని ఎంతో ఆనంద పడుతుంది.