MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న వేద.. షాక్ లో రాజా, రాణి?

Ennenno Janmala Bandham: యష్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న వేద.. షాక్ లో రాజా, రాణి?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 6వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Jan 06 2023, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో యష్ మీ అమ్మమ్మ తాతయ్య నాకు చాలా బాగా నచ్చారు. ఈ వయసులో కూడా వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ కపుల్ అనడంతో అవును యశోదర్ గారు నన్ను చూసిన తర్వాత మనం కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ కావాలి అని నా ఆశ అని మనసులో అనుకుంటుంది వేద. ఏం ఆలోచిస్తున్నావ్ వేద అనగా ఏం లేదు మా అమ్మమ్మ తాతయ్యలకు మీరు కూడా బాగా నచ్చారు మాట్లాడుతూ ఉండగా వారి వెనకాలే రాజా రాణి ఇద్దరు ఆ మాటలు వింటూ ఉంటారు. ఇదే కదా వేద నువ్వు నా నుంచి కోరుకుంది ఇదే కదా నువ్వు ఆశించింది.

27

నేను నువ్వు అనుకున్నట్టుగానే ఉన్నానా అనడంతో అవును అని సిగ్గుపడుతూ దానికి మించి ఉన్నారండి అని అంటుంది. నాకు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వేద.  ఎందుకంటే ఈరోజు నువ్వు నేను అని చెబుతూ ఉండగా వేద సిగ్గుపడుతూ ఉంటుంది. నువ్వు కోరుకున్నట్లుగానే నటించాను కదా అనడంతో రాజా రాణి, వేద ముగ్గురు షాక్ అవుతారు. అప్పుడు వేద యష్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు సంతోషంగానే ఉంది కదా, ఈ సంతోషం చూసి నాకు కూడా హ్యాపీగానే ఉంది. అప్పుడు రాజారాణి ఇద్దరు ఆశ్చర్యపోతారు. మొదటిసారిగా నటిస్తున్నాను చేయగలనా లేదా అనుకున్నాను బాగానే నటించాను అని అనడంతో వేద ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
 

37

ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఫుల్ గా మార్క్స్ కొట్టేసాను అని అనడంతో రాజారాణి ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు ఇదంతా యాక్టింగ్ ఏంటండీ అన్నంతో ఈ వేద అనగా మరి నిజంగానే అని అనుకున్నావా వేద అని నవ్వుతాడు యష్. అయినా నా గురించి నీకు తెలిసిందే కదా నేను ఇలా ఉండడం అంతే కష్టమే కొత్త వ్యక్తులతో మామూలుగా నేను దూరంగా ఉంటాను. కానీ మీ అమ్మమ్మ తాతయ్యలతో కలిసిపోయాను. నీకు కావాల్సినట్టుగా నటించాను వాళ్లు నమ్మేశారు నువ్వు కూడా నమ్మేశావు. కానీ నా సూపర్ యాక్టింగ్ తో మిమ్మల్ని అందరిని నమ్మించాను అని సంతోషంగా మాట్లాడుతాడు.

47

నేను ఇలా చేసి ఉండకూడదు కానీ చేశాను పెద్దవాళ్ళను మోసం చేయకూడదు కానీ చేశాను అని అంటాడు. అప్పుడు వేద ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కేవలం నీకోసమే చేశాను వేద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యష్. అప్పుడు వేద యష్ తో గడిపిన క్షణాలు అన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది.   యష్ అన్నమాట తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది వేద. అంటే ఆయన నాతో ఇక్కడికి వచ్చినప్పటి నాతో నటించింది అంతా డ్రామా నేనా ఇది నిజం కాదా అని ఏడుస్తూ ఉంటుంది వేద. ఒక భర్తగా నా మీద చూపించిన ప్రేమ అభిమానం అంతా కూడా డ్రామానైనా అని ఏడుస్తూ ఉంటుంది.
 

57

 అంటే ఆయన ఇలా మాట్లాడారు అంటే నేను రాసిన ఉత్తరం చూడలేదన్నమాట అంటూ అక్కడికి వెళుతుంది వేద. అప్పుడు యష్ అయ్యో లెటర్ సంగతి మర్చిపోయానే అని అక్కడికి వెళ్లి ఆ పేపర్ తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఆ తర్వాత వేద అక్కడికి వచ్చి ఆ పేపర్ ఎక్కడికి వెళ్లింది అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు వేద బయటికి వెళ్లి చూడగా యష్ చేతిలో ఆ పేపరు ఉండడం చూసి పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఆ తరువాత యష్ ఆ లెటర్ ఓపెన్ చేస్తాడు అప్పుడు ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు యష్. అప్పుడు యష్ చేతిలో ఉన్న పేపర్ ని తీసుకోవాలని వేద ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పేపర్ గాలికి ఎగిరిపోవడంతో వేద ఆ పేపర్ ని వెతుక్కుంటూ వెళ్తుంది.

67

 అప్పుడు ఆ పేపర్ కనిపించకపోతే టెన్షన్ పడుతూ ఉంటుంది వేద. అప్పుడు యష్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆ లెటర్ పనిమనిషి చేతికి చిక్కుతుంది. ఆ లెటర్ ని యష్ కీ ఇవ్వడానికి వెళుతుండగా వేద పరిగెత్తుకుంటూ వెళ్లి లెటర్ ఇవ్వకుండా అడ్డుకుంటుంది. అప్పుడు ఏమైంది వేద అని అడగడంతో కాఫీ కావాలా అడగగా వద్దు అని అంటాడు యష్. దాంతో వేద అక్కడి నుంచి ఆ లెటర్ తీసుకొని వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజారాణి ఇద్దరూ జరిగిన విషయాన్ని తలుచుకునే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఏం జరుగుతుంది రాజా వాళ్ళు మనల్ని మోసం చేశారా? లేకపోతే మనమే మోసపోయామా అని అడుగుతుంది రాణి. ఇది సంతోష పడాల్సిన విషయమే రాణి ఎందుకంటే అంటూ రాణికీ ఎగ్జాంపుల్ గా నచ్చచెబుతాడు రాజా.
 

77

 అప్పుడు వాళ్ళిద్దరూ వారి ప్రాబ్లంని అర్థం చేసుకొని ఒకరికొకరు నచ్చ చెప్పుకుంటారు. మరొకవైపు వేద జరిగిన విషయాలు తెలుసుకుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది నేను ఎందుకు ఏడుస్తున్నాను అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది వేద. ఏం చేసినా నాకోసమే చేస్తున్నారు నా సంతోషమే కోసమే చేస్తున్నారు అయినా ఇదంతా నేనే చెప్పాను కదా ఇలా చేయమని నేను అడిగితే చేశారు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది వేద.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి, నలుగురు పిల్లలు.. ఇచ్చిపడేసిన త్రిష
Recommended image2
Ranbir Kapoor Numerology : రణ్‌బీర్ కపూర్ పుట్టిన తేదీలో అసలు సీక్రెట్, బాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే?
Recommended image3
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved