MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha Krishnan: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి, నలుగురు పిల్లలు.. ఇచ్చిపడేసిన త్రిష

Trisha Krishnan: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి, నలుగురు పిల్లలు.. ఇచ్చిపడేసిన త్రిష

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా? పెళ్లి కూడా చేసుకుందా? సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న వార్తలపై త్రిష స్పందన ఏంటి? ఈ రూమర్లపై ఆమె పెట్టిన సెటైరికల్ పోస్ట్ లో ఏముందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 07 2026, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్రిష సినిమాలు మానేస్తుందా?
Image Credit : instagram /@trishakrishnan

త్రిష సినిమాలు మానేస్తుందా?

స్టార్ హీరోయిన్ త్రిష సినిమాలు మానేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అవుతారని, నటనకు పూర్తిగా గుడ్ బై చెబుతారని పుకార్లు వ్యాపించాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ వదంతులకు చెక్ పెడుతూ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టారు.

25
త్రిష పెట్టిన పోస్ట్ లో ఏముంది?
Image Credit : instagram /@trishakrishnan

త్రిష పెట్టిన పోస్ట్ లో ఏముంది?

ఆ పోస్ట్‌లో.. "నా కథ అయిపోయిందా? నేను సినిమాలు వదిలేశాను, ఓ ధనవంతుడిని పెళ్లి చేసుకున్నాను, నలుగురు పిల్లలకు తల్లిని అయ్యాను.. వాళ్లకు నిన్ననే రెండేళ్లు నిండాయి. ఇవేనా.. ఇంకేమైనా యాడ్ చేయా చేయాలా?" అని త్రిష ప్రశ్నించారు. ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని ఆమె ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పింది. త్రిష పెట్టిన ఈ పోస్ట్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Related Articles

Related image1
కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? నిరుపమ్ కంటే ముందు ఎవరిని అనకున్నారు?
Related image2
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
35
త్రిష విషయంలో రకరకాల వివాదాలు..
Image Credit : instagram /@trishakrishnan

త్రిష విషయంలో రకరకాల వివాదాలు..

"ఒక్క పోస్ట్‌తో అన్ని రూమర్స్‌కు కరెక్ట్‌గా సమాధానం ఇచ్చారు" అని చాలామంది త్రిషను మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో, తరచూ ఇలాంటి తప్పుడు వార్తలు రావడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో త్రిష వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె పెళ్లి, రిలేషన్‌షిప్స్, భవిష్యత్ ప్రణాళికలపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరవ్వడాన్ని కూడా కొందరు అనవసరంగా వివాదం చేశారు.

45
రూమర్స్ హద్దులు దాటడంతో
Image Credit : instagram /@trishakrishnan

రూమర్స్ హద్దులు దాటడంతో

ఇలాంటి వివాదాలపై పెద్దగా స్పందించని త్రిష, ఈసారి రూమర్స్ హద్దులు దాటడంతో నేరుగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. తన పనిపైనే పూర్తి దృష్టి పెట్టిన ఆమె, ఒక్క పోస్ట్‌తో అన్ని వదంతులకు చెక్ పెట్టారు. తాను సినిమాలు వదిలేసే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'కరుప్పు' అనే సినిమా ఉంది. ఇందులో సూర్యకు జోడీగా ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా మే 14న థియేటర్లలోకి రానుంది.

55
త్రిష చేతిలో సినిమాలు?
Image Credit : instagram /@trishakrishnan

త్రిష చేతిలో సినిమాలు?

'కరుప్పు' సినిమా తర్వాత ఆమె చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ 'రామ్'. మోహన్‌లాల్ - జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా ఏళ్లుగా ఆగిపోయింది. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి జోడీగా విశ్వంభర సినిమాలో నటించింది త్రిష. ఈసినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ లేదు. 

ఇక  ఈ మధ్య కొత్త సినిమాలకు కమిట్ అవ్వకపోవడమే కొన్ని రూమర్స్ రావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. త్వరలోనే త్రిష తన కొత్త సినిమా ప్రకటన చేస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో త్రిష కూడా ఒకరు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranbir Kapoor Numerology : రణ్‌బీర్ కపూర్ పుట్టిన తేదీలో అసలు సీక్రెట్, బాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే?
Recommended image2
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Recommended image3
Actors Before Life: సినిమాల్లోకి రాకముందు తాప్సీ, కియారా, మాధవన్ ఏం చేసేవారో తెలుసా?
Related Stories
Recommended image1
కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? నిరుపమ్ కంటే ముందు ఎవరిని అనకున్నారు?
Recommended image2
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved