- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: ఖుషి స్కూల్ లో వేద గురించి గొప్పగా చెప్పిన యష్.. కన్నీరు పెట్టుకున్న మాళవిక!
Ennenno Janmala Bandham: ఖుషి స్కూల్ లో వేద గురించి గొప్పగా చెప్పిన యష్.. కన్నీరు పెట్టుకున్న మాళవిక!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. యష్ (Yash), వేద తమ ఆఫీస్ లకు బయలు దేరడానికి కారు దగ్గరకు నడుచుకుంటూ వస్తారు. ఆ సమయంలో యష్ కీస్ వేద కాళ్ల దగ్గర పడటంతో.. ఆ కీస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. వేద (Vedha) దొరికిందే ఛాన్స్ అంటూ ఏం జరుగుతుందా అన్నట్లు ఎదురు చూస్తూ ఉంటుంది.
కానీ యష్ వేదకు లొంగిపోకుండా ఆ కీస్ ను తన కాళ్లతో ఎగరేసుకుని పట్టుకుంటాడు. దాంతో వేద షాక్ అవుతుంది. ఇక కాసేపు అక్కడ వారి మధ్య సరదాగా చిన్న గొడవ జరుగగా యష్ (Yash) అక్కడనుంచి వెళ్ళి పోతాడు. వేద (Vedha) కూడా బయలుదేరుతుండగా.. తనకు చిత్ర, వసంత్ మాటలు వినిపిస్తాయి.
పక్కనే ఉన్న పార్కులో చిత్ర (Chithra) వసంత్ (Vasanth) తో ప్రేమ విషయంలో చిన్న గొడవ పడుతూ ఉంటుంది. ప్రేమ అంటే గొడవలు, కోపాలు అంటూ వివరిస్తుంది. అలా ఉంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది అని.. ఉదాహరణకు యష్, వేదల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు గురించి వివరిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా తమ పెళ్లి గురించి కూడా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. పక్కనే ఉన్న వేద (Vedha) అవన్నీ వింటూ ఎలాగైనా వీరిద్దరి పెళ్లి చేయాలి అని యష్ (Yash) కు ఫోన్ చేస్తుంది. కానీ యష్ వేద ఫోన్ లిఫ్ట్ చేయకుండా కాసేపు ఆటపట్టిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేస్తాడు.
దాంతో వేద (Vedha) ఆఫీస్ ఫోన్ కి చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ మాట్లాడకుండా అవాయిడ్ చేసి కట్ చేస్తాడు. ఆఫీస్ లో యష్ వసంత్ కు కొన్ని బాధ్యతలు అప్పజెప్పుతాడు. మరోవైపు మాళవిక (Malavika) వేద అన్న మాటలను తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అభి రావటంతో అతడిపై అరుస్తుంది.
ఇక ఇంట్లో మరోసారి వేద (Vedha), యష్ ల మధ్య సరదా గొడవ జరుగుతుంది. యష్ స్నానం చేస్తూ ఉండగా వాటర్ ఆగిపోవడంతో వెంటనే దొరికిందే ఛాన్స్ అంటూ వేద కాసేపు ఆడుకుంటుంది. ఇక తరువాయి భాగంలో ఖుషి (Khushi) స్కూల్లో.. వేద గురించి అద్భుతంగా చెబుతాడు యష్. అక్కడికి అభి, మాళవికలు కూడా వస్తారు.