- Home
- Entertainment
- Guppedantha manasu: వసుధార సలహాకు షాకైన రిషి.. జగతి దెబ్బకు దేవయాని ప్లాన్ అట్టర్ ప్లాప్!
Guppedantha manasu: వసుధార సలహాకు షాకైన రిషి.. జగతి దెబ్బకు దేవయాని ప్లాన్ అట్టర్ ప్లాప్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రిషి వసుతో, ఇప్పటివరకు కష్టపడి చదివావు, ఒంట్లో బాగాలేకపోయినా సరే పరీక్షలు రాశావు, కనుక నువ్వు ఏమైనా కోరుకో వసుధార, నెరవేరుస్తాను అని అంటాడు. దేవయాని చెప్పిందాని గురించి వసు ఆలోచించి,నేను మీకు తర్వాత మెసేజ్ చేస్తాను సార్ అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతార. అప్పుడు రిషి అద్దంలో తనని తాను చూసుకొని మురిసిపోతూ ఉంటాడు.వసుధార గురించి జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.
అంతలో వసుధార నుంచి మెసేజ్ వస్తుంది.ఆ మెసేజ్ లో వసుధార,సార్ మీరు నాకు ఒక కోరిక కోరుకోమని అవకాశం ఇచ్చారు కదా,అది జగతి మేడం, మహేంద్ర సార్ల పెళ్లి రోజు ఈ వారంలో ఉన్నది. దానినీ మీరు సెలబ్రేట్ చేయాలనే కోరుకుంటున్నాను అది కూడా మీ ఇంట్లోనే.నాకు తెలుసు నీకు కోపం రావచ్చు అని కానీ మీరు నా కొడుకు తీరుస్తాను అన్నారు కనుక చెప్పాను అని అంటుంది. ఆ మాటలు విన్న రిషి ఒకేసారి ఆలోచనలలో పడతాడు.
ఆ తర్వాత రోజు ఇద్దరూ కలిసినప్పుడు రిషి, ఎందుకు వసుధార, ఇచ్చిన దానికన్నా అందరూ ఎక్కువ ఆశిస్తారు జగతి మేడంని క్షమించి ఇంటికి తీసుకొచ్చాను అయినా సరే నువ్వు ఇంకా ఇలాంటివన్నీ అని అంటున్నావు.మా నాన్నకి అంత అన్యాయం చేసిన సరే కేవలం మా నాన్న కోసమే నేను ఇక్కడికి తీసుకు వచ్చాను, అయినా ఇప్పుడు నువ్వు పార్టీలు అంటున్నావు అని అంటాడు రుషి. అప్పుడు వసు, అలా కాదు సార్ నేను మీకోసమే చెప్తున్నాను. అయినా మీరు జగతి మేడం కోసం చేస్తున్నారు అనుకోవద్దు సార్.
మహేంద్ర సార్ కూడా ఉన్నారు కదా,ఆయన బాధపడతారు కదా.మీకు మహేంద్ర సార్ అంటే ప్రాణం, మహేంద్ర సార్ కి జగతి మేడం అంటే ప్రాణం. కనుక మీరు మహేంద్ర సార్ మీద ఉన్న ప్రేమని ఇలా చూపిస్తే ఇద్దరూ సంవత్సరం పాటు చాలా ఆనందంగా ఉంటారు అని అంటుంది. అప్పుడు రిషి ,మా నాన్న మీద నాకు ప్రేమ ఉందని తెలుసు కదా మళ్లీ ఇలాంటివి ఎందుకని అడుగుతాడు. అప్పుడు వసు, ఇప్పుడు పిల్లలు సంవత్సరం అంతా చదువుతారు. పరీక్ష రాస్తేనే కదా వాళ్ళకి వచ్చిన మార్కులు బట్టి వాళ్ళు చదువు తెలిసేది.
అలాగే ఇలాంటి సమయంలో మీరు బైటకి చూపిస్తేనే, మీకు ఎంత ప్రేమ ఉన్నదో వాళ్లకి తెలుస్తుంది. అయినా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటే సంవత్సరం అంతా వాళ్లకు గుర్తుండిపోతుంది. మీరే కాని ఈ పెళ్లి రోజుని జరిపేటట్టు చేస్తే, జగతి మేడం,మహీంద్ర సార్ సంవత్సరం వరకు దీన్ని గుర్తుంచుకుంటారు, ఎప్పటికీ మర్చిపోరు. నేను చెప్పవలసింది చెప్పాను సార్ మిమ్మల్ని బలవంతం పెట్టడం నాకు ఇష్టం లేదు ఇంక మీ ఇష్టం అని అంటుంది వసు.
ఆ తర్వాత సీన్లో జగతి తన గదిలో కూర్చొని,గతాన్ని గుర్తుతెచ్చుకుంటూ రిషి తనని పేరు పెట్టి పిలవద్దన్నాడ, కాలేజ్ కి తనకి సంబంధం లేదన్నాడు,దాని తర్వాత, ఇంటికి రానిచ్చాడు, పేరు పెట్టి పిలవని చెప్పాడు. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ, నేను జీవితంలో ఎన్నో చూశాను ఆఖరికి ఇప్పుడు బానే ఉంది అనుకున్నాను ఇంకా ఎన్ని పడాల్సి వస్తుందో అని బాధపడుతుంది. ఇంతలో మహేంద్ర అక్కడికి వచ్చి పెళ్లి రోజు గురించి మాట్లాడుతూ ఉండగా జగతి, మనం పెళ్లి రోజు జరుపుకుంటే మనకి బానే ఉంటుంది.
కానీ మనం భార్య భర్తలమే కాకుండా తల్లిదండ్రులను కూడా. మన ఆనందం రిషికి బాధ కలిగించవచ్చు అలా బాధ కలిగించే ఆనందం మనకొద్దు మహేంద్ర. ఇప్పటికే రిషి నా వల్ల పడిన బాధ చాలు, ఇప్పటికీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు భారమవ్వకూడదు. సంవత్సరంకు ఒకసారి వచ్చేది అని నాకు సరదా ఉంటుంది, కానీ రిషి నీ బాధపెట్టే ఏది నాకొద్దు అని అంటుంది జగతి. ఈ మాటలన్నీ రిషి ఒక మూల నుంచి వింటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!