- Home
- Entertainment
- Guppedantha Manasu: సాక్షి ముందే రిషీ, వసుధార రొమాన్స్... గౌతమ్ కు ప్రశ్నలు వేసి తల తింటున్న దేవయాని!
Guppedantha Manasu: సాక్షి ముందే రిషీ, వసుధార రొమాన్స్... గౌతమ్ కు ప్రశ్నలు వేసి తల తింటున్న దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో వసు(vasu) రిషి గురించి ఆలోచిస్తూ రిషి నీ బాధ పెట్టినందుకు సారీ చెప్పాలి అని అనుకుంటూ రిషి కి సారీ అని మెసేజ్ చేస్తుంది. మరొకవైపు రిషి,వసు పెట్టిన మెసేజ్లు చూసి ఈసారి లకు ఏం తక్కువ లేదు చేసేవన్నీ చేసి చివర్లో సారీ చెబుతుంది అని అనుకుంటూ ఫోన్ విసిరే గా ఇంతలో కరెక్ట్ గా అక్కడికి వచ్చి మహేంద్ర(Mahendra)ఫోన్ ని పట్టుకుంటాడు.
అప్పుడు మహేంద్ర అసలు ఫోను ఎందుకు విసిరేసాను అని ఫోన్ చెక్ చేస్తూ ఉండగా అప్పుడు రిషి (rishi)వెంటనే ఫోన్ ని లాక్కుంటాడు. అప్పుడు వారిద్దరూ కాసేపు కామెడీగా పోట్లాడుకుంటారు. అప్పుడు కామెడీ గా రిషి, మహేంద్ర(mahendra) కు గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మహేంద్ర రూమ్ లోకి వెళ్లడంతో జగతి కామెడీగా ఆట పట్టిస్తుంది.
అప్పుడు మహేంద్ర సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అని జరుగుతాయా ఏంటి. అప్పుడు మహేంద్ర జరిగిన విషయం గురించి చెప్పగా జగతి(jagathi) కామెడీగా నవ్వుతుంది. అలా వారిద్దరూ కాసేపు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వసు, రిషి కి మెసేజ్ చేసి రిషి నుంచి మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు రిషి(rishi), వసు పదే పదే మెసేజ్ పెడుతుంది అని ఫోన్ స్విచాఫ్ చేస్తాడు.
ఆ తర్వాత వసు (vasu)ఆటోలో వెళ్తూ ఎలా అయినా ఈ రోజు రిషి సార్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార కాలేజీలో ఉషారుగా కనిపించడంతో అప్పుడు పుష్ప(pushpa) ఏంటి వసు నీలో ఈ మార్పు ఎందుకు ఇలా హుషారు గా కనిపిస్తున్నావు అని అడుగుతుంది. మరొక వైపు రిషి, వసు కూర్చునే ప్లేస్ లోకి వెళ్ళి వసు ఉన్నట్లుగా ఊహించుకుంటాడు.
మరొకవైపు దేవయాని, గౌతమ్(Gautham)ని పిలిచి రిషి యోగక్షేమాల గురించి అడుగుతుంది. అప్పుడు గౌతమ్, దేవయానికి(devayani)స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతాడు. ఇంతలోనే గౌతమ్ కి ఫోన్ రావడంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరోవైపు రిషి, జగతి కి ఒక పని చెబుతాడు. ఇంతలో వసు అక్కడికి వచ్చి మినిష్టర్ గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడు రిషి వసుతో మాట్లాడకుండా జగతి తో మాట్లాడతాడు.
ఆ తరువాత జగతి(jagathi)అక్కడనుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి, క్లాస్ కి వెళ్తూ ఉండగా సాక్షి ఎదురు పడుతుంది. ఈ కాలేజీలో పోస్టులు ఉన్నాయి అనగానే అప్లై చేశాను ఇంటర్వ్యూ కి రమ్మన్నారు అందుకే వచ్చాను అని చెబుతుంది. అప్పుడు తన స్టైల్లో మాట్లాడగా రిషి(rishi) కూడా సాక్షి తగ్గట్టుగా మాట్లాడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
మరొకవైపు వసు(vasu)తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా పుష్ప ఏమైందో నీకు అని అంటూ ఉండగా ఇంతలో రిషి క్లాస్ కి వస్తాడు. అప్పుడు వసుధార నాకు ఒక డౌట్ అంటూ నా పైన నీకు ఎన్నాళ్ళు కోపం ఉంటుంది సార్ అని అడిగినట్లు అనుకుంటూ ఉండగా ఇంతలో జగతి(jagathi)క్లాస్ కి వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో వసుధార,రిషి ఇద్దరు ఒకరివైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అది చూసి సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.