Guppedantha Manasu: చక్రపాణికి ఎదురు తిరిగిన వసుధార.. రిషిని కలుసుకున్న వసు?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్లో వసుధార అన్నింటికీ మిమ్మల్ని మీరే తగ్గించుకుంటారు. మీకేం తక్కువ అనడంతో పరువు అని గట్టిగా అరుస్తాడు చక్రపాణి. ఇప్పుడు వసుధార పరువు ఎవరు ఇస్తే వచ్చేది కానీ తీసుకుంటే పోయేది కాదు నాన్న, పరువు అంటే మన ఆలోచనలు మన వ్యక్తిత్వం, పరుగు అంటే పరులకు హాని చేయకుండా ధర్మంగా బతకడం అని అంటుంది. అప్పుడు చక్రపాణి వసుధార నీ అపార్థం చేసుకుంటూ చూశావా సుమిత్ర పరువుకి నీ బిడ్డ పెద్దపెద్ద సూత్రాలు చెబుతోంది. తండ్రి చేతగానోడని నీతులు నేర్పిస్తోంది అని అంటాడు. అప్పుడు నాన్న నీ ఏం తప్పు చేశాను అనడంతో పెళ్లి పీటల నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అని అంటాడు.
తండ్రి పరువు నీ బజార్లో నిలబెట్టి ఉంటాడో ఉరి వేసుకుంటాడో అని ఆలోచించకుండా వెళ్ళిపోవడం తప్పు కదా అని అంటాడు. పారిపోయిందో లేకపోతే లేచిపోయిందో అంటూ నలుగురు ఆ మాటలు మాట్లాడుతుంటే ప్రాణం పోయినట్టు ఉంది అని అంటాడు. నాన్న మీ బిడ్డ మీద మీకే నమ్మకం లేకపోతే ఎలా చెప్పండి అన్నంతో వెంటనే సుమిత్ర ఇన్నాళ్లకు బిడ్డ వచ్చింది కదా ఈ గొడవలన్నీ ఎందుకు అనడంతో తల్లి బిడ్డ ఇద్దరూ ఒకటై మాట్లాడుతున్నారా, ఇన్ని రోజులకు తిరిగి వచ్చిన తప్పు తప్పే అవుతుంది అని అంటాడు. నువ్వు వెళ్లావు కానీ అక్కడ ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు నాకు చెప్పావా? దారిలో వెళ్లే ప్రతి వెధవ నన్ను నీ గురించే ప్రశ్నిస్తున్నాడు అని అంటాడు. అప్పుడు రాజీవ్ గురించి గొప్పగా పొగుడుతూ అల్లుడు గారి వల్లే మేము ఇంకా ఉన్నాము అనడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడు తన అల్లుళ్లు ఇద్దరు దేవుళ్ళు అన్నట్లు మాట్లాడడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు సుమిత్ర ఎమోషనల్ అవుతూ అల్లుళ్ల గురించి గొప్పగా చెప్పి కూతురుని మాత్రం దూరం పెడుతున్నారు అంటుంది. అప్పుడు వసుధర వాళ్ళు చేసిన తప్పుల గురించి చెబితే చెప్పు తీసుకొని కొడతారు అనడంతో చక్రపాణి కొట్టబోతుండగా సుమిత్ర అడ్డుపడుతుంది. పెద్దల్లుడు చిన్నల్లుడు ఒకటే అనడంతో నా అల్లులను అనే అంత పెద్దదాన్ని అయిపోయావా అని అంటాడు. ఏం చేశారో చెప్పు అని అంటాడు చక్రపాణి. మరొకవైపు రిషి, వసుధార వాళ్ళింటికి దగ్గరకు వచ్చి హార్న్ కొట్టడంతో రిషి సార్ వచ్చాడా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అనగా మా సార్ వచ్చారు అనడంతో వాడెవడు అనగా నాన్న మర్యాదగా మాట్లాడండి అని అంటుంది. వసుధర బయటికి వెళ్తుండగా చక్రపాణి చేయి లాగి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. నాన్న వచ్చాక అన్ని చెబుతాను అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసుధార. అప్పుడు సుమిత్ర దాన్ని ఏమి అనకండి చక్రపాణి కాళ్లు పట్టుకొని అడ్డుపడుతుంది. మరొకవైపు రిషి, వసుధార ఫోన్ కి ట్రై చేస్తుండగా స్విచ్ ఆఫ్ వస్తుండగా ఇంతలో వసు అక్కడికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చారు సరే ముందు ఇక్కడి నుంచి మనం వెళ్దాం పదండి అని రిషి ని ఒక చోటికి తీసుకొని వెళుతుంది.
అప్పుడు ఇద్దరు కారులో వెళ్తుండగా వసుధార ని చూసిన రిషి ఏదో జరిగింది నువ్వు ఏదో న దగ్గర దాస్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు ఒక చోట కూర్చొని ఉంటారు. మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అనగా లేదు సార్ అనడంతో మరి ఎందుకు అలా ఉన్నావ్ నేను మీ ఇంటికి దగ్గరలోకి వస్తే ఎందుకు వచ్చారు సార్ అని అడిగావు ఏంటి వసు నువ్వు అని అంటాడు రిషి. లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది వసుధార నువ్వు ఎప్పటిలాగే గలగల మాట్లాడాలి ఇలా మౌనంగా ఉండకూడదు అని అంటాడు. వసుధార కొత్తగా మాట్లాడుతున్నావేంటి ఈ ఊరి గురించి మొత్తం అన్ని చెబుతావు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటాడు రిషి.
అప్పుడు రిషి నువ్వు చిన్నప్పుడు నువ్వు తిరిగిన ప్రదేశాలన్ని చూసి మీ చిన్నప్పటి స్నేహితులను కలిసి ఇదిగో ఇతనే నా భర్త అని గర్వంగా పరిచయం చేస్తావని అనుకున్నాను అని అంటాడు. నువ్వు ఈ ఊరికి వచ్చినా కొత్తలో ఎంత సంతోషంగా మాట్లాడావు కానీ ఇప్పుడు ఇలా ఉన్నావు అసలు నాతో వచ్చిన వసుధార నువ్వేనా అన్న అనుమానం వస్తుంది అని అంటాడు రిషి. అప్పుడు వసుధార రిషి చేయి పట్టుకుని ఎమోషనల్ అవుతుండగా ఎందుకు ఏడుస్తున్నావు వసుధార ఏమయింది అని అడుగుతాడు రిషి వీ కన్నీళ్లు కాదు సార్ మిమ్మల్ని నాకు ఇచ్చినందుకు మీ ప్రేమ పొందినందుకు వస్తున్నందుకు ఆనంద భాష్పాలు అని అంటుంది.
అప్పుడు నేను అన్ని సార్లు కాల్ చేశాను నేను నువ్వు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు నీ మొబైల్ ఏది ఇలా ఇవ్వు అనడంతో ఒకసారి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార అబద్ధం చెబుతూ ఫోన్ కింద పడి పగిలిపోయింది సార్ అని అంటుంది. సరే ఆ ఫోన్ సంగతి వదిలేసేయ్ నేను కొత్త ఫోన్ కొనిస్తాను అని అంటాడు రిషి. అప్పుడు రిషి సరే నా ఫోన్ కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఫోన్ చేసి అందర్నీ రమ్మని చెబుతాను ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అని అంటాడు. అప్పుడు వసు వద్దు అని అంటుంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు ఇంట్లో అందరూ బాగున్నారా అని అడగగా బాగున్నారు అని అంటుంది వసు. మరొకవైపు రాజీవ్, వసుధార ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు వసుని చూసి కారు ఆపుతాడు. అప్పుడు వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు రిషి వాళ్ల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు.