MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే

OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే

OTT Movies: ఓటీటీలో సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంటాయి. థియేటర్లలో డిజాస్టర్‌ అయిన చిత్రాలు కూడా అందులో హిట్‌ అవుతాయి. ఇప్పుడు థియేటర్లో డిజాస్టర్‌ అయిన రెండు చిత్రాలు ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్నాయి. అవేంటో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 04 2026, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రైమ్‌ ఓటీటీలో దుమ్మురేపుతున్న `సరస్వతి` మూవీ
Image Credit : X/@varusarath5

ప్రైమ్‌ ఓటీటీలో దుమ్మురేపుతున్న `సరస్వతి` మూవీ

ఓటీటీలో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న తెలుగు సినిమా `సరస్వతి`. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ రూపొందించిన చిత్రమిది. తనే దర్శకురాలిగా మారి, నిర్మాతగా మారి ఈ మూవీని తెరకెక్కించింది. తనే మెయిన్‌ లీడ్‌గా చేసింది. ప్రియమణి, ప్రకాష్‌ రాజ్, జీవా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీలో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండియాలో టాప్‌ 2లో వరలక్ష్మి సస్పెన్స్ థ్రిల్లర్‌
Image Credit : X/@varusarath5

ఇండియాలో టాప్‌ 2లో వరలక్ష్మి సస్పెన్స్ థ్రిల్లర్‌

`సరస్వతి` చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది. ఈ వారం ఓటీటీలోకి వచ్చింది. దీంతో రెండు రోజుల్లోనే ఇది టాప్‌ 10లోకి వచ్చింది. అంతేకాదు ఇండియా వైడ్‌గా రెండో స్థానంలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. దీన్ని ఆడియెన్స్ తెగ చూస్తున్నారని చెప్పొచ్చు. ఈ మూవీలో వరలక్ష్మి కూతురు కనిపించకుండా పోతుంది. పాప కోసం ఆమె పోలీసులను అప్రోచ్‌ కాగా, అదంతా కట్టు కథ అని, పాప ఎవరూ లేరని చెబుతారు, కేసుని తీసుకోరు. దీంతో లాయర్‌ ప్రకాష్‌ రాజ్‌ వద్దకు వెళ్లగా, ఆయన ఈ కేసుని వాధిస్తాడు. ఈ విచారణలో షాకింగ్‌ విషయాలు బయటకు వస్తాయి. అదేంటనేది సినిమా.

35
టాప్‌ 8లో శ్రీవిష్ణు `విష్ణు విన్యాసం`
Image Credit : Asianet News

టాప్‌ 8లో శ్రీవిష్ణు `విష్ణు విన్యాసం`

ఇక అమెజాన్‌ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న మరో తెలుగు సినిమా `విష్ణు విన్యాసం`. శ్రీవిష్ణు, నయన సారిక జంటగా నటించారు. యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ ప్రధానంగా రూపొందింది. పెళ్లి, జాతకాలకు సంబంధించిన అంశంతో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌ అయ్యింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయినా టాప్‌ 10లో ఉంది. ఇండియా వైడ్‌గా 8వ స్థానంలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

45
రచ్చ చేస్తున్న అనుపమా `లాక్‌ డౌన్‌`
Image Credit : prime videos

రచ్చ చేస్తున్న అనుపమా `లాక్‌ డౌన్‌`

ఇక తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్న మరో మూవీ `లాక్‌ డౌన్‌`. అనుపమా పరమేశ్వరన్‌ మెయిన్‌ లీడ్‌గా చేసింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తమిళంలో రూపొందిన చిత్రమిది. ఏఆర్‌ జీవా దర్శకత్వం వహించారు. జనవరిలో థియేటర్లో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. ప్రైమ్‌ వీడియోస్‌లో ఇండియా వైడ్‌గా 7వ స్థానంలో దూసుకుపోతుంది.

55
top 10 movies
Image Credit : prime videos

top 10 movies

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 మూవీస్‌ లిస్ట్ చూస్తే.

1.క్రైమ్‌ 101 (ఇంగ్లీష్‌)

2.సరస్వతి (తెలుగు)

3.నౌయూ సీమీ నౌ యూ డోంన్ట్ (ఇంగ్లీష్‌)

4.ఉలతూశాంతే కల్లన్‌(మలయాళం)

5.రాహు కేతు(హిందీ)

6.సుబేదార్‌(హిందీ)

7.లాక్‌డౌన్‌(తమిళం)

8.విష్ణు విన్యాసం(తెలుగు)

9.ది హౌజ్‌మేడ్‌(ఇంగ్లీష్‌)

10.మై లార్డ్(మలయాళం)

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image3
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Related Stories
Recommended image1
Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే
Recommended image2
Superstar krishna: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు, డైరెక్టర్‌ చనిపోయాడు, అయినా కృష్ణ తగ్గలేదు.. ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్డుకి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved