- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషికి ఛాలెంజ్ విసిరిన వసు.. జగతిని ఈరోజంతా అమ్మ అని పిలవమన్నా వసుధార!
Guppedantha Manasu: రిషికి ఛాలెంజ్ విసిరిన వసు.. జగతిని ఈరోజంతా అమ్మ అని పిలవమన్నా వసుధార!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి ఇచ్చిన గిఫ్ట్ ను వసుధార రిషి కి ఇవ్వడానికి ఫోన్ చేసి ఒక గదిలోకి రమ్మంటుంది. ఇక గదిలోకి వచ్చిన రిషిని నీ నుంచి ఒక గిఫ్ట్ కావాలి అని అంటుంది వసుధార (Vasudhara).

మొత్తానికి తన మాటలతో వసుధార ( Vasudhara ) ఆ బట్టలను రిషికు (Rishi) ఎలాగైనా ఇస్తుంది. ఆ తర్వాత వారిరువురూ కలిసి చిట్టీల ఆట ఆడతారు. ఈ చిట్టీల ఆటలో ఎవరు ఓడిపోతే వాళ్లు గెలిచిన వారి మాట వినాలి అని వసు అంటుంది. ఇద్దరూ కలిసి చిట్టీల ఆట స్టార్ట్ చేస్తారు. ఇక చిట్టీల గేమ్ లో చివరికి వసు నే గెలుస్తుంది.
అలా గెలిచిన వసుధార (Vasudhara) రిషి ను ఒక మాట ఇవ్వమని అడుగుతుంది. ఇక వసు.. జగతి మేడమ్ ను అమ్మ అని పిలవాలి సార్ అని రిషి ను అడుగుతుంది. దాంతో రిషి బాగా సీరియస్ అవుతాడు. అవును సార్ ఈరోజు మీరు జగతి (Jagathi) మేడమ్ ను మేడమ్.. అని పిలవకూడదు. ఈ రోజు మొత్తం అమ్మా అని పిలవాలి అంటుంది.
దానికి రిషి, నో.. అని గట్టిగా అరుస్తాడు. ఇక్కడ అసలు సంగతి ఏమిటి అంటే వసు (Vasu) ఇంకా ఏమీ అడగలేదు. రిషి నే అలా ఊహించుకుంటాడు. అది గ్రహించుకున్న రిషి ఏం కావాలో అడగమంటాడు. పండగ రోజు మీరు ఏ విషయంలోనూ కోపగించుకోకూడదు సార్ అని వసు అడుగుతుంది. దానికి రిషి (Rishi) ఓస్.. ఇంతేనా అనుకుంటాడు.
ఇక జగతి, ధరణి (Dharani) లు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడకు దేవయాని వచ్చి వాళ్ల మూడ్ చెడగొడుతుంది. ఆ తర్వాత దేవయాని జగతి తో 'అడుగు పెట్టావని విర్రవీగకు జగతి అని అంటుంది' దాంతో జగతి (Jagathi) తనదైన స్టైల్లో సమాధానం చెబుతుంది.
ఇక రిషి.. వసుధార (Vasudhara) ఇచ్చిన డ్రెస్ వేసుకొని భోజనం చేస్తూ ఉండగా గౌతమ్.. రిషిను నీ డ్రెస్ బాగుంది సెలక్షన్ ఎవరిది అని అంటాడు. దానికి దేవయాని ఆ డ్రెస్ సెలక్షన్ జగతిది (Jagathi) అని చెబుతోంది. దాంతో ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు.