- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషిని అనుమానిస్తున్న వసుధార.. మహేంద్రకు నిజం చెప్పనున్న చక్రపాణి?
Guppedantha Manasu: రిషిని అనుమానిస్తున్న వసుధార.. మహేంద్రకు నిజం చెప్పనున్న చక్రపాణి?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తనకి నమ్మకద్రోహం చేసినందుకు బాధతో అయిన వాళ్ళందరికీ దూరమైన ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఆలోచనలో ఉన్న రిషి ని ఏం జరిగింది మళ్లీ ఎందుకు అలా అయిపోయావు గతంలో నీకేమైనా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతుంది ఏంజెల్. ఏం లేదు అంటూ తప్పించుకుంటాడు రిషి. ఉందో లేదో నేను తెలుసుకుంటాను అని నవ్వుతుంది ఏంజెల్రే.సరే కానీ నువ్వు ఎన్ని చపాతీలు తింటావు అని అడుగుతుంది.
నేను చపాతీలు తినటం మానేశాను అంటాడు రిషి. అదేంటి ఈరోజు రేపు అందరూ డైటింగ్ అని చెప్పి భోజనం మానేసి మరి చపాతీలు తింటున్నారు నువ్వేమో చపాతీలు మానేశాను అంటున్నావు అంటుంది ఏంజెల్. ఇంతలో వసుధార ఫోన్ చేయడంతో నా చేతులు బాగోలేవు నువ్వే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చెయ్యు అని రిషికి చెప్తుంది ఏంజెల్.
ఏంజెల్ చెప్పినట్లే చేస్తాడు రిషి. వసుధార మాట్లాడుతూ ఏంజెల్ యోగక్షేమాలు కనుక్కుంటుంది. నేను బానే ఉన్నాను ఖాళీగా ఉంటే రావచ్చు కదా చపాతీలు చేస్తున్నాను నీకు కూడా చేస్తాను అంటుంది ఏంజెల్. ఇలాంటి పరిస్థితులలో నువ్వు వంట చేయడమేంటి అంటుంది వసు. పర్వాలేదు రిషి హెల్ప్ చేస్తున్నాడు అంటుంది ఏంజెల్.
అప్పుడు నాకు హెల్ప్ చేసినట్లే ఏంజెల్ కి కూడా చేస్తున్నారా అని రిషి ని అనుమానిస్తుంది వసు. కానీ మళ్ళీ తనే తమాయించుకొని రిషి సార్ అలా చేయరు అనుకుంటుంది. రిషి చపాతీలు తినడంట అని ఆశ్చర్యంగా వసు కి చెప్తుంది ఏంజెల్. అంతలో రిషి చపాతి మార్చేయడం గమనించి నువ్వు మళ్ళీ అయిపోయావు. నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను లేదంటే కిచెన్ తగలబెట్టేస్తావు అంటూ రిషి ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఏంజెల్.
మరోవైపు బయటకు వెళ్తున్న మహేంద్రని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ధరణి. పని ఉంది కంటూ కారణం చెప్పకుండా వెళ్ళిపోతాడు మహేంద్ర. నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు కాని ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు నేను వస్తాను అంటూ మెసేజ్ పెడుతుంది జగతి. మహేంద్ర ధరణికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయమని చెప్పి నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పకపోతేనే నీకు ఎంత బాధగా ఉంది.
అలాంటిది నా కొడుకుని ఏం చేసావో చెప్పమంటే చెప్పడం లేదు నాకు ఎంత బాధగా ఉంటుంది ఇంకెప్పుడు ఇలా విసిగించొద్దు అని చెప్పి చికాగ్గా ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర. మీ ఇద్దరి మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఊహించలేదు అంటుంది ధరణి. పరిస్థితుల ప్రభావం అలాంటిది మేము మళ్లీ ఎప్పటికైనా కలుస్తాము అంటూ నమ్మకంగా చెప్తుంది జగతి.
మరోవైపు రిషి గురించి కచ్చితంగా వసుకి తెలుస్తుంది ఎలా అయినా కనుక్కోవాలని వసు కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు మహేంద్ర. అది గమనించిన వసుధార అటెండర్ తో తను లీవ్ లో ఉన్నానని ఊర్లో లేనని అబద్ధం చెప్పిస్తుంది. నిరాశతో వెనక్కి వెళ్ళిపోతాడు మహేంద్ర. ఆ వెళ్లిపోవడం రిషి చూస్తాడు. డాడ్ మళ్ళీ ఎందుకు వచ్చారు వసుధార రమ్మని ఉంటుంది తనకి గట్టిగా క్లాస్ ఇవ్వాలి ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అనుకుంటూ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళబోతాడు.
అంతలోనే నేను మహేంద్ర సార్ ని కలవలేదు. నేను కాలేజీకి రాలేదని అటెండర్ చేత అబద్ధం చెప్పించాను అని వాయిస్ మెసేజ్ పెడుతుంది వసుధార. ఇంతలోనే కేడి బ్యాచ్ మళ్ళీ ఏదో చేస్తున్నట్లుగా ఉంది సార్ అందరూ అక్కడ గుంపుగా ఉన్నారు అని అటెండర్ చెప్పడంతో కంగారుగా అక్కడికి వెళ్తాడు రిషి. అయితే మాత్రం మోకాళ్ళతో నిలబడి అందరికీ క్షమాపణ చెప్తారు.
మా వల్ల అందరూ ఇబ్బంది పడ్డారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాము మా ప్రవర్తనకి క్షమించండి అంటూ రిషి కాళ్ళు పట్టుకో పోతారు. ఒక స్టూడెంట్ నుంచి ఏ లెక్చరర్ కూడా క్షమాపణ కోరుకోవడం వాడు భవిష్యత్తు బాగోవాలనే కోరుకుంటారు మరెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పి పంపించేస్తాడు రిషి. వీళ్ళలో ఎంత మార్పు వస్తుందని ఊహించలేదు ఇదంతా మీ గొప్పతనమే అంటూ రిషితో సెల్ఫీ తీసుకుంటారు లెక్చర్స్ అందరూ.
సీన్ కట్ చేస్తే మహేంద్ర కారు దారిలో ఆగిపోతుంది. అటుగా వెళ్తున్న వాళ్ళ దగ్గర మెకానిక్ నెంబర్ తీసుకుని అతనిని రమ్మని చెప్పి మెకానిక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మహేంద్ర. అందులో అటుగా వెళుతున్న చక్రపాణి కనిపిస్తాడు. ఇదేంటి వసుధర ఊరు వెళ్తే ఇతను ఎందుకు ఎక్కడ ఉన్నారు ఏదో జరిగింది అనుకుంటూ చక్రపాణిని పిలుస్తాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.