- Home
- Entertainment
- Guppedantha Manasu: వసు బ్రతుకుని అవమానించి మరి బయటకు గెంటేసిన దేవయాని.. ఆమెనే కలవరస్తున్న రిషీ!
Guppedantha Manasu: వసు బ్రతుకుని అవమానించి మరి బయటకు గెంటేసిన దేవయాని.. ఆమెనే కలవరస్తున్న రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 7వ తేదీన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi) సార్ ప్రేమను కాదన్నందుకు నాకే బాధేస్తుంది. మరి రిషి సార్ కి ఎలా ఉంటుంది అని వసు (Vasu) ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వసు ఆటోలో వెళుతూ ఉండగా.. రిషి రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఉంటాడు. వసు పెద్దగా ఏడుస్తూ రిషి ను ఆటోలో తీసుకొని వెళుతుంది.
ఇక వసు (Vasu) రిషి కి తలకు కట్టు కట్టించి మహేంద్ర (Mahendra) ఫ్యామిలీ దగ్గరకు తీసుకొని వస్తుంది. సార్ కి యాక్సిడెంట్ అయింది అని ఏడుస్తూ చెబుతుంది. రిషి యాక్సిడెంట్ విషయం తెలిసి దేవయాని ఒక్క సారిగా స్టన్ అవుతుంది. ఇక వసు రిషి చూడ్డానికి ఇంటిలోపలికి వెళుతూ ఉండగా.. దేవయాని అడ్డుపడి లోపలికి రావద్దు అని అంటుంది. అంతేకాకుండా నువ్వేంటో నీ బ్రతుకు ఏంటో తెలుసు అని అంటుంది.
ఇక కారులో వెళ్లాల్సిన నా కొడుకు.. కాలి నడక న ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం నువ్వే అని దేవయాని (Devayani) వసు (Vasu) పై నింద వేస్తుంది. ఇక రిషి జీవితం నుంచి కూడా వెళ్ళిపో అని అంటుంది. ఇక వసు మీరు నన్ను ఎన్ని తిట్టినా పడతాను.. కానీ నన్ను లోపలికి వెళ్ళాను ఇవ్వండి మేడం అని వేడుకుంటుంది. నా మాట వినకపోతే బయటకు గెంటించేస్తా అని అంటుంది.
ఆ మాటతో వసు (Vasu) దీనంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక రిషి దగ్గరకు వెళ్లిన దేవయాని నాన్న రిషి (Rishi) అంటూ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మరోవైపు వసు రిషి సార్ కి యాక్సిడెంట్ అయితే నా మనసుకెందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు జగతి స్వయంగా తన కొడుకుకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది.
ఈలోపు అక్కడకు మహేంద్ర (Mahendra) వచ్చి నాన్న రిషి (Rishi) ఇక్కడే ఉన్నాను అంటూ రిషి మీద చెయ్యి వేసి ధైర్యం చెబుతాడు. అంతేకాకుండా నీకేం కాదు నాన్న మేము ఉన్నాం కదా అని అంటాడు. మరోవైపు దేవయాని సాక్షి కి ఫోన్ చేసి రిషి కి యాక్సిడెంట్ అయింది. నువ్వు ఈ అవకాశం వాడుకోవాలి అని అంటుంది. మీరు చెప్పింది విన్నట్టు నటిస్తాను ఆంటీ అని సాక్షి మనసులో ఎవిల్ ప్లాన్ వేస్తుంది.
ఇక వసు (Vasu) రిషి సార్ కి బావుండాలి అని ఒక దేవతకు గట్టిగా దండం పెడుతుంది. ఆ తర్వాత మళ్లీ రిషి (Rishi) ని చూడ్డానికి తిరిగి వెళ్లగా.. మళ్లీ దేవయాని అడ్డుపడి వెనుకకి పంపిస్తుంది. ఇక వసు దీనంగా వెళుతూ ఉండగా ఆది రిషి గమనించి ఒక పిలుపు పిలుస్తాడు ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.