Guppedantha Manasu: చక్రపాణి మాటలకు షాకైన ఏంజెల్.. వసుతో గొడవ పడుతున్న రిషి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అసలు విషయం తెలుసుకోకుండా తల్లిదండ్రులని దూరం పెడుతున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని మెసేజ్ పెడతాడు రిషి. మీరు అందుకే మెసేజ్ పెట్టారని నాకు తెలుసు మీరేమీ కంగారు పడకండి నేను మా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి గుడ్ నైట్ చెప్పి చాటింగ్ ముగిస్తుంది వసుధార. ఇంతలో ఏంజెల్ వచ్చి వసుధారా ఎక్కడ ఉందో తెలిసిందా అని అడుగుతుంది. తను వాళ్ళ ఇంట్లోనే ఉందంట అని చెప్తాడు రిషి.
అవునా తను అక్కడికి ఎందుకు వెళ్ళింది? పొద్దున్న జరిగిన గొడవకి హర్ట్ అయ్యుంటుంది. అసలే సెన్సిటివ్, మాటంటే పడదు తను ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్లి చూసేద్దాం పద అంటుంది ఏంజెల్. ముందు రాను అంటాడు రిషి కానీ మళ్లీ ఏంజెల్ తో పాటు వసు వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. కార్లో కూర్చున్న ఏంజెల్ నిజం చెప్పు నువ్వు వసుధార కోసమే కదా వస్తున్నావు అంటుంది.
అలాంటిదేమీ లేదు నిన్ను ఈ రాత్రి అప్పుడు ఒంటరిగా పంపించడం ఇష్టం లేదు అందుకే వస్తున్నాను అంటాడు రిషి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఎవరిని కష్ట పెట్టవు కానీ వసుధార విషయంలో మాత్రం కొన్ని కొన్ని సార్లు మొండిగా ప్రవర్తిస్తావు. నీకు తన గురించి పూర్తిగా తెలియదు కదా అందుకే అలా ప్రవర్తిస్తావు నిజానికి పసుధార చాలా మంచిది. నీకు తెలుసు నేను నీతో తప్ప ఎవరితోని మింగిల్ అవ్వలేను అలాంటిది వసుధారతో అంత ఫ్రీగా ఉంటున్నాను అంటే అది తన గొప్పతనమే.
తనని పూర్తిగా అర్థం చేసుకుంటే నా కన్నా బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది అంటూ వసుధారని తెగ పొగుడుతుంది ఏంజెల్. అది సరేగాని వసుధార వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు రిషి. ఏంజెల్ డైరెక్షన్తో వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తారు రిషి వాళ్ళు. ముందు రిషి నేను లోపలికి రాను నువ్వు వెళ్లి వసుధారితో మాట్లాడి వచ్చేయ్ అని ఏంజెల్ కి చెప్తాడు. కానీ ఏంజెల్ రిక్వెస్ట్ చేయడంతో రిషి కూడా వసుధార ఇంటి లోపలికి వస్తాడు.
రిషి ని చూసిన చక్రపాణి అల్లుడు గారు అంటూ ఆనందంగా అతనిని ఆహ్వానిస్తాడు. చక్రపాణి మాటలకి షాక్ అవుతుంది ఏంజెల్ అల్లుడు గారు అంటున్నారు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు తమయించుకొని అల్లుడుగారు అనలేదమ్మ.. బాబు గారు అన్నాను అంటాడు చక్రపాణి. ఆ మాటలకి మరింత షాక్ అవుతుంది ఏంజెల్. ఎందుకు అన్ని నాకే అలా తప్పు తప్పుగా వినిపిస్తున్నాయి.
మన మహేంద్ర సార్ ని రిషి డాడ్ అన్నాడు అది నేను విన్నాను కానీ అందరూ కాదు అంటున్నారు అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కువగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది అంటాడు రిషి. ఆ తర్వాత ఇద్దరు వచ్చి లోపల కూర్చుంటే చక్రపాణి కూతుర్ని పిలుస్తాడు. హాల్లోకి వచ్చిన వసుధారని చెప్పకుండా వచ్చేసావ్ అంటూ మందలిస్తుంది ఏంజెల్. కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోదాం అంటాడు రిషి. మా ఇంట్లో భోజనం చేసి వెళ్లండి అంటాడు చక్రపాణి.
రిషి ఒప్పుకోడు కానీ ఏంజెల్ మాత్రం భోంచేస్తాను అంటుంది. అప్పుడు రిషికి మజ్జిగ ఇస్తుంది వసు. అందరి బలవంతం మీద కొంచెం తాగి వదిలేస్తాడు రిషి. వసుధరవాళ్ళు భోజనం చేస్తుండగా వసు వాళ్ళ అమ్మకోసం చూస్తాడు రిషి. చక్రపాణి గారితో పాటు ఊరు వెళ్లి ఆవిడ అక్కడే ఉండిపోయారేమో అనుకుంటాడు. అయినా వాళ్లందరి కోసం నేను ఆలోచించడం ఏంటి అని అనుకుంటాడు. ఈ లోపు ఏంజెల్ భోజనం కంప్లీట్ చేసి వచ్చి పదా వెళ్దాం అంటుంది.
వసుధర వాళ్ళ అమ్మగారు లేనట్లు ఉన్నారు తనని బాగా చూసుకోండి అని చక్రపాణి కి చెప్పి వెళ్ళిపోతాడు రిషి. తర్వాత రిషి వదిలేసిన మజ్జిగని తాగుతూ ఉంటుంది వసుధార. అప్పుడే మళ్లీ లోపలికి వచ్చిన రిషి ఆ గ్లాసు లాక్కోపోతాడు ఎందుకు ఆ మజ్జిగ తాగుతున్నారు అంటూ ఆమెతో గొడవకి దిగుతాడు. నాకు ఆహారాన్ని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అందుకే తాగుతున్నాను అంటుంది వసుధార. మీరు ఎందుకు తాగుతున్నారో నాకు తెలుసు.
సమాధానం నా దగ్గర నుంచి రాబట్టాలని చూస్తున్నారు అంటూ కోపంగా తను మరిచిపోయిన కారుతాళాలు తీసుకుని వెళ్ళిపోతాడు రిషి. మీరు వదిలేసినది తాగటం నాకు ఇష్టం సర్ అని మనసులో అనుకుంటుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.