Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: కడుపునొప్పి అని నాటకం ఆడిన మహేంద్ర.. టూర్ కి వెళ్తున్న రిషి, వసు?

Guppedantha Manasu: కడుపునొప్పి అని నాటకం ఆడిన మహేంద్ర.. టూర్ కి వెళ్తున్న రిషి, వసు?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

Navya G | Published : Feb 08 2023, 07:45 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర రిషి రావడం చూసి జగతి మొదలుపెట్టు అని చెప్పి ఇంకా కూర్చున్నావా జగతి వెళ్దాం పద మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా కిట్స్ ఇవ్వాలి కదా అని అంటాడు. ఒక కాఫీ తాగి వెళ్దాం మహేంద్ర అనడంతో ముందు వర్క్ అని మహేంద్ర తొందర పెడుతుండగా ఇంతలో రిషి డాడ్ ఏంటిది కాఫీ తాగి వెళ్లొచ్చు కదా అనగా టైం వేస్ట్ అవుతుందని అని మహేంద్రతో ఏం కాదు కాఫీ తాగి వెళ్ళండి అంటాడు రిషి. అప్పుడు ముగ్గురు కలిసి కాఫీ తాగడానికి కూర్చుంటారు. అప్పుడు టూర్ కి అంతా ఓకే కదా అని అనడంతో మహేంద్ర ఒకే రిషి కిట్స్ రెడీగా ఉన్నాయి వెళ్లి పంచడమే అని అంటాడు.
 

26
Asianet Image

ఇంతలో ధరణి కాఫీ తీసుకొని రావడంతో అందరూ కాఫీ తాగుతూ ఉండగా అప్పుడు రిషి ప్రాజెక్టు టూర్ ని సక్సెస్ చేసి రండి అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర జగతి అక్కడి నుంచి వెళ్తుండగా కావాలని మహేంద్ర కడుపునొప్పి అని ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. డాడీ ఏమైంది అనడంతో కడుపునొప్పి భరించలేకపోతున్నాను రిషి అని అంటాడు. సరే వెళ్దాం పద జగతి అని మహేంద్ర అనడంతో ఇలా కడుపు నొప్పి పెట్టుకొని ఎలా వెళ్తారు డాడ్. మీరు ఎక్కడికి వెళ్లొద్దు మేడం కూడా ఎక్కడికి వెళ్లారు నేను వసుధార వెళ్తాము అని అంటాడు.

36
Asianet Image

అప్పుడు మహేంద్ర కు జాగ్రత్తలు చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు వసుధార జగతి మహేంద్ర వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరోవైపు జగతి మహేంద్ర ఇద్దరు సంతోష పడుతూ ఉండగా అప్పుడు మహేంద్ర లక్షణంగా బెడ్ పై పడుకొని సంతోష పడుతూ ఉంటాడు.. నా కడుపునొప్పి నటన ఎలా ఉంది అన్నంతో జగతి నవ్వుతూ బాగుంది అని అంటుంది. ఇంతలోనే ధరణి అక్కడికి రావడంతో నువ్వా ధరణి రామ్మ అని నాటకాలు ఆడుతూ ఉంటాడు మహేంద్ర. అప్పుడు ధరణి కషాయం తీసుకుని రావడంతో జగతి తిక్క కుదరచాలి అని మహేంద్రని తాగమని బలవంతం పెడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు.

46
Asianet Image

మరోవైపు రిషి వసుధారతో ఇంతకుముందు ప్రాజెక్టు టూర్ అంటే చాలా సంతోషంగా ఉండేది కానీ ఇప్పుడు ఎందుకో అలా అనిపించడం లేదు అనుకుంటూ ఉంటాడు. ఇలా అయిన వసుధార భర్త ఎవరో తెలుసుకోవాలి అనుకుంటూ కాలేజీకి వెళ్తాడు రిషి. మరోవైపు మహేంద్ర వాళ్లు కలుస్తారో లేదో జగతి వెళ్తారో లేదో అనడంతో నువ్వు భయపడకు మహేంద్ర వాళ్ళు కలిసి వెళ్తారు అంటుంది జగతి. అప్పుడు వసుధార జగతికి, మహేంద్రకు ఫోన్ చేసిన జగతి ఫోన్ లిఫ్ట్ చేయరు. మరోవైపు వసుధార జగతి వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడు రిషికి కాల్ చేసి సర్ నేను ఎదురు చూస్తున్నాను సార్ అని అనడంతో సరే వెయిట్ చెయ్యి అని రిషి ఫోన్ కట్ చేస్తాడు.
 

56
Asianet Image

ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు వసు గ్యాప్ లేకుండా రిషిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండగా ఒక్క నిమిషం చెప్పేది వింటావా డాడీకి కడుపునొప్పి డాడ్ రావడం లేదు మనం వెళ్ళాలి అనడంతో వెళ్ళాం కదా అని అంటాడు రిషి. అప్పుడు వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి వసు హస్బెండ్ ఎవరో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి తను మధ్యలో నీకెప్పుడు ఫోన్ చేయలేదేంటి అనగా సమయపాలన ఉంది ఎప్పుడు పడితే అప్పుడు చేయడు అని అంటుంది వసుధార.

66
Asianet Image

ఆ తర్వాత వసుధర కాఫీ తాగాలని తప్పులు పోసుకోగా  అప్పుడు రిషి గుంతల్లో కారు నడపడంతో మీరు కావాలని చేస్తున్నారు కదా సార్ అని అంటుంది. రోడ్డుమీద గుంతలు నేను ఎలా చేస్తాను చెప్పు అంటాడు రిషి. అప్పుడు వసుధార కాఫీ తాగడానికి ప్రయత్నించగా కొద్దిసేపు ఆగు కారు ఆపుతాను అప్పుడు ఇద్దరు కలిసి తాగుదాము అంటాడు. ఆ తర్వాత ఒకచోట కారు నిలబెట్టడంతో ఇద్దరు కలిసి కాఫీ తాగడానికి నిలబడతారు.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories