- Home
- Entertainment
- Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం రేణు దేశాయ్ లండన్ లో ఏం చేశారో తెలుసా.. అక్కడికి వెళ్ళేది వాళ్లిద్దరు మాత్రమే
Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం రేణు దేశాయ్ లండన్ లో ఏం చేశారో తెలుసా.. అక్కడికి వెళ్ళేది వాళ్లిద్దరు మాత్రమే
పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ గురించి రేణు దేశాయ్ ఎవ్వరికీ తెలియని విషయాలు బయటపెట్టారు. వరల్డ్ వార్ 2 టైంలో ఉపయోగించిన క్లాత్ తో మిలాన్ లో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్ డిజైన్ చేయించినట్లు రేణు దేశాయ్ పేర్కొన్నారు.

Renu Desai
రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ భార్య భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో బాధత్యగా ఉంటున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి అభిమానులకు తెలియని ఆసక్తికర విషయాలు రివీల్ చేస్తుంటారు. పవన్, రేణు దేశాయ్ బద్రి, జానీ చిత్రాల్లో కలసి నటించారు. పవన్ చిత్రాలకు రేణు దేశాయ్ స్టైలిస్ట్ గా కూడా వ్యవహరించారు.
లండన్ లో షాపింగ్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ డ్రెస్సులు గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ 26 సంవత్సరాల క్రితం అంటే బద్రి, ఖుషి లాంటి సినిమాల సమయంలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కోసం నేను లండన్ లో షాపింగ్ చేసేదాన్ని. అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉండేది. ఎక్కువగా అక్కడే షాపింగ్ చేసేదాన్ని.
అక్కడికి వెళ్ళేది ఇద్దరు మాత్రమే
నేను ఆ షాపింగ్ మాల్ కి వెళ్లిన ప్రతిసారీ అక్కడ మరో సెలెబ్రిటీ ఉండేవారు. ఆయన ఎవరో కాదు.. దర్శక నిర్మాత కరణ్ జోహార్. నేను పవన్ కళ్యాణ్ డ్రెస్సులు కోసం వెళితే.. ఆయన షారుఖ్ ఖాన్ కోసం డ్రెస్సులు కొనడానికి వచ్చేవారు. ఆయన స్టైలిస్ట్ కాదు.. కానీ షారుఖ్ ఖాన్ పై ఇష్టం తో కాస్ట్యూమ్స్ కొనేవారు.
వరల్డ్ వార్ 2 క్లాత్ తో ప్యాంట్
బాలు సినిమాలో ప్యాంట్ బాగా ఫేమస్ అయింది. ఆ ప్యాంట్ కోసం నేను మిలాన్ కి వెళ్ళాను. అక్కడ అన్ని షాప్స్ తిరుగుతూ ఉండగా ఒక షాప్ లో సినిమా కోసం కాస్ట్యూమ్ కావాలి అని అడిగా. మీ దగ్గర బడ్జెట్ ఉందా అని అడిగారు. అప్పుడు ఆ ప్యాంట్ ని చూపించారు. దానిని వరల్డ్ వార్ 2 టైంలో ఉపయోగించిన ఒరిజినల్ క్లాత్ తో డిజైన్ చేశారట. అప్పట్లోనే దాని ధర 75 వేలు. కేవలం 5 ప్యాంట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి నేను కళ్యాణ్ గారి కోసం తీసుకుని వచ్చా అని రేణు దేశాయ్ తెలిపారు.
జానీ సినిమాలో హీరోయిన్ గా
ఆ ప్యాంట్ ఎంత ఫేమస్ అయిందో మీరంతా చూశారు. జానీ మూవీ గురించి కూడా రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ సినిమాలో నేను హీరోయిన్ కాదు. హీరోయిన్ ని సెలెక్ట్ చేయడానికి ముంబైకి వెళ్ళాను. చాలా మందిని ఎంపిక చేసినప్పటికీ కళ్యాణ్ గారికి, అల్లు అరవింద్ గారికి నచ్చడం లేదు. షూటింగ్ కి వారం రోజుల ముందు నన్నే హీరోయిన్ గా నటించమని అడిగారు. క్యారెక్టర్ బాగా నచ్చడంతో చేశాను అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.





