Guppedantha Manasu: జగతికి సేవలు చేస్తున్న రిషి.. ఆనందంలో వసుధార, మహేంద్ర?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 26 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ మహేంద్ర దిగాలుగా కూర్చుని ఉండగా అప్పుడు మహేంద్ర ఏంటి గౌతమ్ ఎలా జరిగింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతికి ఏం కాదు కదా గౌతం అని బాధపడుతూ ఉండగా వెంటనే గౌతమ్ ఏం కాదు అంకుల్ డాక్టర్స్ కూడా బాగవుతుంది అని చెప్పారు మీరు భయపడకండి అని ధైర్యం చెబుతాడు. అప్పుడు మహేంద్ర థాంక్స్ గౌతమ్ అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నావు అనడంతో అయ్యో అంకుల్ మీరు నాకు థాంక్స్ చెప్పడమేంటి ఇది నా బాధ్యత అని అంటాడు. మరొకవైపు జగతిని అలా బెడ్ పై చూసిన వసుధార ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడు వసుధార ఎమోషనల్ అవుతూ మిమ్మల్ని ఏదో నేను కలపడం ఏంటి మేడం రక్త బంధమే మిమ్మల్ని కలుపుతోంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నర్స్ బయటకి వెళ్లమని చెప్పడంతో వసుధార బయటికి వెళ్తూ జగతి దగ్గరికి వెళ్లి మేడం మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు. మీకేం కాదు మేడం మీరు త్వరగా కోలుకుంటారు మీ అబ్బాయి మిమ్మల్ని కాపాడుకుంటున్నారు. కొడుకుగా అది తన బాధ్యత కదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత గౌతమ్ మహేంద్రకు టీ తీసుకుని వచ్చి ఇవ్వగా నాకొద్దు గౌతం జగతికి ఎలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు మహేంద్ర.
అప్పుడు గౌతమ్ అంకుల్ మేడంకి ఏం కాదు అని ధైర్యం చెప్పి టీ తాగమని చెప్పగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. ఆ తర్వాత మహేంద్ర, వసుధార, గౌతమ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి బ్లడ్ ఇవ్వడం పూర్తి అవ్వడంతో జగతి వైపు ఎమోషనల్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడు రిషి,జగతి దగ్గరికి వెళ్లి గతంలో జగతి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడు జగతి రిషి రిషి అని కలవరిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి జగతి వైపు ఎమోషనల్ గా చూస్తూ మేడం మీకేం కాదు మీకేం కానివ్వను అని అక్కడ నుంచి వెళ్తుండగా జగతి రిషి చేయి పట్టుకుంటుంది.
అప్పుడు రిషి జగతి చేయి తీసుకుని అక్కడ పెట్టి జగతి కన్నీళ్లు పెట్టుకుంటుండగా జగతి కన్నీళ్లు తుడుస్తాడు. అప్పుడు రిషి మీరు స్పృహలో లేకపోయినా నేను మాట్లాడిన మాటలు మీ మనసుకు చేరాయని నేను అనుకుంటున్నాను. మీరు డాడ్ ఆనందంగా ఉండటమే నాకు కావాలి. అప్పుడు జగతి మళ్లీ రిషి నేను మీ దగ్గరికి వస్తున్నాము బయలుదేరాము అని కలవరిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి జగతి తల నిమురుతాడు. అప్పుడు జగతి చెవి దగ్గరికి వెళ్లి మీకేం కాదు అని చెప్పి బయటకు వెళ్తుండగా దాహం దాహం అనడంతో రిషి జగతికి ప్రేమతో నీళ్లు తాగిస్తాడు. అది చూసిన వసుధార మహేంద్ర,గౌతమ్ వాళ్లు సంతోష పడుతూ ఉంటారు.
అప్పుడు గౌతమ్ లోపలికి వెళ్దాం పదండి అంకుల్ అనడంతో మహేంద్ర వద్దు ఆ తల్లి కొడుకుని అలాగే వదిలేద్దాం అని అంటాడు. ఇంతలోనే అక్కడికి దేవయాని ఫణింద్ర వస్తారు. ఆ తరువాత రిషి, మహేంద్ర ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు. ఇప్పుడు మహేంద్ర తాను బయటికి వెళ్లడానికి కారణాలు ఏంటి అని చెబుతుండగా మీరేం చెప్పకండి నేనేమీ అడగను మీరు బాగుంటే చాలు మేడంకి బాగవుతుంది అని రిషి ధైర్యం చెబుతాడు. నన్ను ఇంకెప్పుడూ వదిలేసి వెళ్ళకండి మీరు లేకుండా నేను ఎలా ధైర్యంగా ఉండగలను డాడ్ అని అంటాడు రిషి.