Guppedantha Manasu: దేవయాని ప్లాన్ ను తిప్పికొట్టిన రిషి.. సంతోషంలో వసుధార, ధరణి?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్లో రిషి నేను కూడా నీలో చాలా చూశాను వసుధార అనగా ఏమి చూసారు సార్ అనడంతో పొగరు యూత్ ఐకాన్ అని అంటాడు. ఎప్పుడు జరిగిన విషయాలను తలుచుకొని ఆలోచిస్తూ ఉండకూడదు అనగా సార్ మర్చిపోవడానికి అదేం అంత చిన్న విషయం కాదు కదా సార్ అని అంటుంది. ఇప్పటికే ఏం చేయాలో డాడీ తో మాట్లాడాను నువ్వు కూల్ గా ఉండు అని అంటాడు రిషి. నువ్వేం తినలేదు కదా తిను అనడంతో అదేంటి సార్ మీరు కూడా తినలేదు కదా అనగా ప్రేమ నీకు మాత్రమే నాకు కూడా ఉంది తిను అని అనగా ఇద్దరు కూర్చుని యాపిల్ పండ్లు తింటూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు.
అది చూసిన దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తరువాత ఇద్దరు బయటకు వెళ్తుండగా వసుధార అనుకోకుండా కింద పడిపోతుండగా వెంటనే రిషి పట్టుకొని వసుధార వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు గుడ్ నైట్ వసుధార అనగా గుడ్ నైట్ సార్ అనడంతో ఇదేం బాగోలేదు వసుధార గుమ్మానికి అవతల వైపు నువ్వు ఇవతల వైపు నేను ఎన్నాళ్లు ఇలా ఇద్దరు పక్కపక్కనే ఉంది గుడ్ నైట్ చెప్పుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్లి పడుకో వసుధర అనగా ఎందుకో తెలియదు సార్ నిద్ర రావడం లేదు మీ ధైర్యాన్ని చూసి జరిగిన ప్రమాదం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది.
అప్పుడు రిషి,వసుధార చేతులు పట్టుకుని మన ప్రేమని తలుచుకుంటూ పడుకో అప్పుడు కంటి నిండా నిద్ర పడుతుంది అని అంటాడు. నిద్రపోతే నిద్ర వస్తుంది కలలో నేను కూడా వస్తాను అని వసుధారని పడుకోమని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం దేవయాని ఫణింద్ర కూర్చుని ఉండగా ఇంతలో రిషి అక్కడికి రావడంతో కూర్చో రిషి అని అంటుంది. తరువాత జగతి మహేంద్ర వాళ్ళని కూడా పిలిచి రిషి,వసుధార ల పెళ్లి గురించి మాట్లాడడానికి పిలిచాను అని అంటుంది దేవయాని. అన్ని పద్ధతులు తెలుసు కాబట్టి ఇంటి పెద్దగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అని అంటుంది.
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వసుధార వాళ్ళ ఊరికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని ఇక్కడికి రండి మాట్లాడదాం అని అంటుంది దేవయాని. అప్పుడు వసుధార టెన్షన్ పడుతుండగా ఏమయింది అని దేవయాని అడగగా అప్పుడు జగతి దగ్గరకు వెళ్లి మేడం అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమో అని టెన్షన్ గా మాట్లాడుతుంది. తన పరిస్థితి గురించి జగతికి వివరిస్తూ ఉండగా ఏంటి జరుగుతాయి మీలో మీరే మాట్లాడుకుంటే మాకేం అర్థం అవుతుంది మా అందరికీ కూడా చెప్పండి అని అంటుంది దేవయాని. అది కాదు అక్కయ్య వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయని మాట్లాడుతోంది అనగా సమస్యలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి మన ఇంట్లో లేవా వాటిని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్లాలి అని అంటుంది.
నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను జగతి మీరు ఎప్పుడు వెళ్తారో టైం చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి రండి అని అంటుంది దేవయాని. అప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అనడంతో ఏంటి రిషి అలా మాట్లాడుతావు అని అనగా తన గురించి తన ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు పెద్దమ్మ మనందరికీ తెలిసిందే అని అంటాడు రిషి. అదేంటి రిసీవ్ కొన్ని పద్ధతిలో ఉంటాయి కదా అనగా మీదే ఒక డేట్ ఫిక్స్ చేసి ఆరోజు పిలవండి పెద్దమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్తారు అని అంటాడు రిషి. మనం వాళ్ళ ఊరు వెళ్లాల్సిన పనిలేదు మీరు అలాంటి ప్రయాణాలు పెట్టకండి అనడంతో దేవయాని షాక్ అవుతుంది.
రిషి చెప్పింది కరెక్టే కదా వదిన అనడంతో నువ్వు కూడా అలాగే మాట్లాడితావేంటి మహేంద్ర తల్లిదండ్రులుగా మీరు దగ్గరండి చూసుకోవాల్సింది పోయి అని అంటుంది దేవయాని. మీరు చెప్పింది కరెక్టే కానీ వల్ల ఆ సిచువేషన్ లో ఉన్నప్పుడు మనం వెళ్లి వాళ్ళను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు పెద్దమ్మ అని అంటాడు. మీరు ఇబ్బంది పడకండి ఎవరిని ఇబ్బంది పడకండి పెద్దమ్మ మేమిద్దరం ప్రేమించుకుంన్నాం. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం అని అంటాడు. మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉండాలని అనుకుంటున్నాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధరణి వంట చేస్తుండగా వసుధార సంతోషంగా కిచెన్ లోకి వెళ్తుంది.
అప్పుడు వసుధార కాఫీ చేస్తుండగా ఏంటి వసుధార అప్పుడే నాకు పూర్తిగా వచ్చేస్తున్నావా అని అనగా వసుధర వెళ్ళి ప్రేమగా ధరణిని హత్తుకుంటుంది. నాకు మిమ్మల్ని ప్రేమగా అక్క అని పిలవాలని ఉంది మేడం అనడంతో అలా అయితే ఇప్పుడు అక్కయ్య అని పిలువు అని అంటుంది ధరణి. అప్పుడు వారిద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దేవయాని నిజంగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలా దూరం చేద్దామనుకుంటే వాళ్ళు ఇంకా దగ్గరవుతున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.
నా ప్రయత్నలు అన్ని ఫెయిల్ అవుతున్న ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ధరణి అక్కడికి వచ్చి కాఫీ ఇస్తుంది. అప్పుడు ధరణికావాలని దేవయానితో వెటకారంగా సమాధానం చెబుతూ తింగరి తింగరిగా మాట్లాడుతూ వుంటుంది. అప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు ఎక్కువ చేస్తే జగతికి కోడలు వస్తుంది నా కోడలు అనడంతో ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంది.