- Home
- Entertainment
- Guppedantha Manasu: ఇంటి నుంచి వెళ్ళిపోతానంటున్న వసుధార.. రిషి సీక్రెట్ తెలుసుకున్న ఏంజెల్!
Guppedantha Manasu: ఇంటి నుంచి వెళ్ళిపోతానంటున్న వసుధార.. రిషి సీక్రెట్ తెలుసుకున్న ఏంజెల్!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో మంచి టీఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కుటుంబ సభ్యుల మీద కోపంతో ఇంటికి దూరంగా ఉంటున్న ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వసుధార ఇంటికి వచ్చిన ఏంజెల్ ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంది. నీతో ఓ విషయం గురించి సీరియస్ గా మాట్లాడాలి అంటుంది వసుధార. రిషి గురించే కదా.. నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడా అని అడుగుతుంది ఏంజెల్. తను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయినా ఆయన నీకు సరిపోరు అని అంటుంది వసుధార. మరి ఎవరికి సరిపోతాడు నీకా అని అడుగుతుంది ఏంజెల్.
ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. మరి లేకపోతే ఏంటి వసుధార, తను అలా అంటున్నాడు కానీ దాని వెనక రీజన్ ఏదో ఉంది. అది ఏంటో చెప్తే సరిపోతుంది కదా అంటుంది ఏంజెల్. ఆయనని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది వసుధార. అలా ఏమీ లేదు కానీ బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే లైఫ్ కంఫర్ట్ గా ఉంటుంది కదా అందుకే అంటుంది ఏంజెల్. సరే అయితే ఒక పని చేద్దాం, రిషి సర్ ని ఎనాలసిస్ చేద్దాం అంటూ పాజిటివ్స్, నెగిటివ్స్ రాసి ఏంజెల్ కి ఇస్తుంది వసుధార.
దీనిని బట్టి ఒక నిర్ణయం తీసుకో అని చెప్తుంది. ఆ తర్వాత తన గదిలో కూర్చున్న రిషి వసుధార కళ్ళ స్కెచ్ ని చూస్తూ ఈ కళ్ళు నాతో ఎన్నో కబుర్లు చెప్పేయి ఆఖరికి ఇవే కళ్ళు నన్ను మోసం చేశాయి అనుకుంటాడు. ఇంతలో ఏంజెల్ పిలవడంతో కంగారుగా ఆ స్కెచ్ ని తలగడ కింద దాచేస్తాడు. అది గమనిస్తుంది ఏంజెల్ కానీ ఏమీ అనదు. రిషితో మాట్లాడుతూ నేను ఒక స్పెషల్ గెస్ ని ఇన్వైట్ చేశాను ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్తుంది. నీ ఫ్రెండ్ వస్తే నేను ఎందుకు ఇంట్లో ఉండాలి. నాకు కొంచెం పని ఉంది అని చెప్పి బయటకి వెళ్ళిపోతూ ఉంటాడు రిషి.
నువ్వు ఈ మధ్య బాగా మారిపోయావు, నాకోసం అసలు టైం స్పెండ్ చేయట్లేదు అని రిషితో పోట్లాడి అతను ఇంట్లోనే ఉండేలాగా చేస్తుంది ఏంజెల్. ఇక తప్పనిసరి పరిస్థితులలో ఇంట్లోనే ఉంటాడు రిషి. ఆ తర్వాత గెస్ట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చే గెస్ట్ వసుధార కాదు కదా అనుకుంటాడు. అంతలోనే వసుధార అక్కడికి వస్తుంది. కోపంగా రిషి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తనని కూర్చోబెట్టి వసుధార నిన్ను అనాల్సిస్ చేసింది అని చెప్పి వసుధర రాసిచ్చిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ పేపర్ అతనికి ఇస్తుంది.
నన్ను ఇరికించేసావు అనుకుంటుంది వసుధార. అందులో పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువగా ఉండటంతో వసుధార మీద కోప్పడతాడు రిషి. తనని ఏమీ అనకు అని ఏంజెల్ అంటే నువ్వు వెళ్లి కాఫీ తీసుకొని రా అని ఏంజెల్ కి చెప్తాడు రిషి. ఏంజెల్ కిచెన్లోకి వెళ్ళగానే మీరు కావాలనే నా గురించి నెగటివ్ రాశారు కదా అనే వసుధార మీద అరుస్తాడు రిషి. అవును సార్ కావాలనే రాశాను. మీరే కదా ఏంజెల్ కి మీరు సరిపోనని చెప్పమన్నారు.
మీరు చెప్పింది చేసినా నామీద కోప్పడుతున్నారు. ఇలా అయితే నేను ఇంట్లో ఉండను ఇప్పుడే వెళ్లిపోతాను అంటుంది వసుధార. ఎవరిని బెదిరిస్తున్నావు వెళ్ళిపోతే వెళ్ళిపో అంటూ గుమ్మం చూపిస్తాడు రిషి. ఇంతలోనే ఏంజెల్ వచ్చి నువ్వు తనని ఏమైనా అన్నావా.. అందుకే తను వెళ్ళిపోతుంది ఆమెకి సారీ చెప్పు అని రిషికి చెప్తుంది. సారీ మేడం నా గురించి చాలా బాగా అనాల్సిస్ చేశారు అని వసుధారకి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
ఆ తరువాత ఏంజెల్ రిషి గదికి వచ్చి తను పిల్లో కింద ఏదో దాచాడు అని పిల్లో తీసి చూస్తుంది. అక్కడ ఉన్న కళ్ళు స్కెచ్ ని చూసి షాక్ అవుతుంది. ఎవరివి ఈ కళ్ళు అనుకొని ఆ స్కెచ్ కి ఫోటో తీసుకొని బయటికి వచ్చేస్తుంది. అప్పుడే రిషి అతని గదికి వెళ్తూ ఉంటాడు. ఏంజెల్ ని చూసి ఎందుకు నా గురించి అనాలసిస్ చేస్తున్నావు, నన్ను వదిలేయమని చెప్పాను కదా నేను ఒంటరి వాడిని నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం అంటాడు రిషి.
అలా ఒంటరిగా ఉండటానికి కారణం చెప్పు అని నిలదీస్తుంది ఏంజెల్. ఆ కళ్ళు చూపించి ఎవరివి అని అడగాలనుకుంటుంది కానీ నిజం చెప్పడని ఊరుకుంటుంది . కారణం ఏమీ లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. నువ్వు ఒంటరి వాడివి కాదని ఈ కళ్ళే చెప్తున్నాయి అని రిషి ని చూసి అనుకుంటుంది ఏంజెల్. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.