- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి ప్రేమ వ్యవహారాన్ని అందరి ముందు బయటపెట్టిన సాక్షి.. అజ్ఞాత వ్యక్తికి గిఫ్ట్ పంపిన వసు!
Guppedantha Manasu: రిషి ప్రేమ వ్యవహారాన్ని అందరి ముందు బయటపెట్టిన సాక్షి.. అజ్ఞాత వ్యక్తికి గిఫ్ట్ పంపిన వసు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత (Guppedantha Manasu) మనసు సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు (Vasu) ఈ బొమ్మ ఎవరు గీసారో తెలుసుకుంటాను అని అంటుంది. ఇక రిషి కూడా కనిపెట్టు ఇది నీకు ఒక గోల్ లాంటిది అని అంటాడు. ఇక రిషి (Rishi) కారులో వెళుతుండగా వసు నీకు ఒక విషయం చెప్పాలి ఆ బొమ్మ గీసింది నేనే అని అంటాడు. దాంతో వసు ఆశ్చర్యపోతుంది.
ఇక వసు (Vasu) రిషి చేయి పట్టుకొని థాంక్స్ చెబుతుంది. కానీ ఇదంతా రిషి (Rishi) జరిగినట్టుగా ఊహించుకుంటాడు. ఇక వసు మల్లెపూలు ఎందుకు కొన్నారు సార్ అని అడుగుతుంది. రిషి నేను మల్లెపూలు అనుకోకుండా కొన్నాను అని చెబుతాడు. దాంతో వసు మీకు ఈ మల్లె పూల మీద ప్రేమ ఉందేమో అని అంటుంది.
ఇక వసు (Vasu) ఇంటికి వెళుతున్న క్రమంలో సార్ ఈ మల్లెపూలు నేనే తీసుకుంటాను అని అంటుంది. ఇక రిషి మనసులో ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతూ ఆ మల్లె పూలు వసు కు ఇస్తాడు. ఇక ఇంటికి వెళ్లిన వసు అజ్ఞాత వ్యక్తి రిషి (Rishi) సార్ అయ్యి ఉండకూడదు అని అనుకుంటుంది. ఇక మల్లెపూలు లవ్ షేప్ లో పెట్టి ఒక స్నాప్ తీస్తుంది.
ఆ అజ్ఞాత కళాకారుడికి ఒక చిన్న గిఫ్ట్ వీలైతే తనకి పంపండి సార్ అని రిషి (Rishi) కి సెండ్ చేస్తుంది. ఆ తర్వాత రిషి జగతి ను తన కాబిన్ లోకి పిలిచి మనకి టైం లేదు వసు ను మీరు ఇంకా బాగా ప్రిపేర్ చేయాలి అంటుంది. ఈలోగా అక్కడకు సాక్షి (Sakshi) వచ్చి రిషి పదా వెళదాం అని అడుగుతుంది.
ఇక సాక్షి (Sakshi) సినిమాకి వెళ్దాం పద నేను టికెట్స్ కూడా బుక్ చేశాను అని అంటుంది. దాంతో రిషి (Rishi) ఏంటి సాక్షి ఏమనుకుంటున్నావు నువ్వు.. అని కోపం పడతాడు. అంతేకాకుండా అయినా నువ్వు పర్మిషన్ లేకుండా ఎందుకు కాలేజీ లోపలికి వచ్చావు అని అంటాడు. దాంతో సాక్షి తల తీసినట్టుగా అవుతుంది.
ఇక తరువాయి భాగం లో సాక్షి (Sakshi).. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు దూరంగా వెళుతున్నావు అని రిషి (Rishi) తో అంటుంది. అంతే కాకుండా నీకు వసు నే ప్రాధాన్యత అయ్యింది. తనే నీ లోకం అయ్యింది అని అందరి ముందు చెప్పేస్తుంది. ఈ క్రమంలో అక్కడికి వసు కూడా వస్తుంది.