MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'కాలరే ఎత్తరా' మాస్ సాంగ్.. పవన్ స్టెప్పులు, అతడి గాత్రం నెక్స్ట్ లెవల్ అంతే

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'కాలరే ఎత్తరా' మాస్ సాంగ్.. పవన్ స్టెప్పులు, అతడి గాత్రం నెక్స్ట్ లెవల్ అంతే

'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 'కాలరే ఎత్తరా' పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.

3 Min read
Author : Tirumala Dornala
Published : Mar 12 2026, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
'కాలరే ఎత్తరా' సాంగ్ విడుదల
Image Credit : Asianet News

'కాలరే ఎత్తరా' సాంగ్ విడుదల

'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం 'కాలరే ఎత్తరా'ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని మైత్రి విమల్ థియేటర్ లో ఈ గీతావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వన్ కళ్యాణ్ డ్యాన్స్
Image Credit : Asianet News

వన్ కళ్యాణ్ డ్యాన్స్

'కాలరే ఎత్తరా' పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పాటలో భారీ సెట్‌లు, కట్టిపడేసే విజువల్స్, అద్భుతమైన ఎనర్జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్పులతో తెరపై వెలుగులు నింపారు.రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, రామ్ మిర్యాల ఉత్సాహభరితమైన గానం, కాసర్ల శ్యామ్ శక్తివంతమైన సాహిత్యం కలిసి..మాస్ అప్పీల్‌ను ప్రతిబింబించేలా గొప్పగా ఉంది ఈ గీతం.

36
2000 మందితో భారీస్థాయిలో
Image Credit : Asianet News

2000 మందితో భారీస్థాయిలో

'కాలరే ఎత్తరా' గీతావిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే కథ కూడా వినకుండా సినిమా చేయడానికి అంగీకరించిన రాశి ఖన్నాకు ముందుగా కృతఙ్ఞతలు. ఈ పాటలో కూడా కళ్యాణ్ గారితో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేశారు రాశి. 1500-2000 మందితో భారీస్థాయిలో ఈ పాటను తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్ గారు వేసిన డ్యాన్స్ కి చప్పట్లు, ఈలలతో సెట్ అంతా దద్దరిల్లిపోయింది. కళ్యాణ్ గారు ఈ సినిమాని ప్రాణం పెట్టి పని చేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అని నేను మొదటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే.. సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ సీన్స్ లో ఆయన అద్భుతంగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. కెరీర్ లోనే భారీ సెట్ ను ఈ పాట కోసం వేశారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం." అన్నారు

46
ప్రజా సేవలో తీరిక లేకుండా
Image Credit : Asianet News

ప్రజా సేవలో తీరిక లేకుండా

నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. "ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగా వచ్చింది. 'గబ్బర్ సింగ్' స్థాయికి తగ్గకూడదనే కసితో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ గారితో గుర్తుండిపోయే చిత్రం చేయాలని అందరూ కోరుకుంటారు. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టం న భూతో న భవిష్యతి. ప్రజా సేవలో తీరిక లేకుండా ఉండి కూడా.. ఈ సినిమా పట్ల ఆయన చూపిన అంకితభావానికి హ్యాట్సాఫ్. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అభిమానులకు మేము ఒక హామీ ఇవ్వగలను. ఖుషి నాటి రోజులను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఆద్యంతం ఎంజాయ్ చేసేలా అన్ని అంశాలతో ఈ సినిమాను హరీష్ శంకర్ గొప్పగా తెరకెక్కించారు." అన్నారు.

56
పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని..
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని..

కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. "మీ అందరి ఉత్సాహం చూస్తుంటే పాట ఎంతగానో నచ్చిందని అర్థమవుతోంది. నేను కూడా ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేశాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు ఒకే ఒక్క కోరిక ఉండేది.. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఒక మాస్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది." అన్నారు.

66
ఈ ఉగాది పండుగను 'ఉస్తాద్ భగత్ సింగ్'తో
Image Credit : instagram

ఈ ఉగాది పండుగను 'ఉస్తాద్ భగత్ సింగ్'తో

గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. "అభిమానుల ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఈ పాట నచ్చింది అనుకుంటున్నాను. భీమ్లా నాయక్ లో రెండు మంచి పాటలు రాసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి డ్యాన్స్ నెంబర్ రాయలేదనే వెలితి ఉండేది. 'కాలరే ఎత్తరా'తో ఆ వెలితి తీరిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం అదిరిపోయింది. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇలాంటి అత్యద్భుతమైన పాటను రచించే అవకాశమిచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కి కృతఙ్ఞతలు. ఈ ఉగాది పండుగను 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరింత ఉత్సాహంగా జరుపుకుందాం." అన్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. మాస్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా అన్ని అంశాలతో కూడిన ఒక మంచి చిత్రాన్ని రూపొందించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం విశేషం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
Hansika: దేశముదురు రిలీజ్ అయ్యే టైంకి హన్సిక ఏజ్ ఎంతో తెలుసా.. హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుందా ?
Recommended image2
ప్రభాస్ సినిమా ఫ్లాప్ కాబోతోంది.. డోంట్ వర్రీ, నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చింది ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved