- Home
- Entertainment
- Prema Entha Madhuram: జిండేను కొట్టి రాగసుధను రక్షించిన వశిష్ట.. కోపంతో రగిలిపోతున్న ఆర్య వర్ధన్!
Prema Entha Madhuram: జిండేను కొట్టి రాగసుధను రక్షించిన వశిష్ట.. కోపంతో రగిలిపోతున్న ఆర్య వర్ధన్!
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకవైపు ఆర్య, అనులు హ్యాపీ గా చిల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆర్య (Arya) ఒక లిప్ కిస్ కూడా ఇస్తాడు.

మరోవైపు జిండే రాగసుధ (Ragasudha) తలపై గన్ పెట్టి ఇక నీ చాప్టర్ క్లోజ్ అన్నటు మాట్లాడుతాడు. కానీ దానికి రాగసుధ ఏమాత్రం భయపడదు. ఇక రాగసుధ కూడా తన దగ్గర ఉన్న గన్ తీసి జిండే (Jinde) తలపై పెడుతుంది.
ఈ క్రమంలో ఒకరికొకరు ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చి కుంటూ ఉంటారు. ఈలోగా అక్కడకు వశిష్ట (Vasista) వచ్చి జిండే చేతిని కర్రతో కొడతాడు. దాంతో జిండే చేతిలో గన్ కింద పడిపోతుంది. ఇక రాగసుధ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. వశిష్ట కూడా జిండే (jinde) ను నెట్టేసి పారిపోతాడు.
మరోవైపు ఆర్య (Arya) , అనుకు సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్.. లు ఇస్తూ ఉంటాడు. ఈలోపు ఆర్యకు జిండే కాల్ చేసి వశిష్ట వచ్చి రాగ సుధను (Ragasudha) కాపాడిన సంగతి చెబుతాడు. దాంతో ఆర్య బాగా షాక్ అవుతాడు.
ఈలోగా అక్కడకు అను వచ్చి ఏం జరిగింది అని అడగ్గా.. ఒక ప్రాజెక్టుకు సంబంధించి వర్క్ జిండే (Jinde) మిస్ చేశాడు అని చెబుతాడు. నీ దగ్గర నేను ఏ విషయం దాచను అను.. మరి నువ్వు ఏమన్నా దాస్తున్నావా అని అడుగుతాడు. దాంతో అను (Anu) మనసులో కొంత బాధ పడుతుంది.
దాంతో అను (Anu), ఆర్యకు సారి చెబుతుంది. ఈ మాత్రందానికి సారీ ఎందుకని.. అను ను డిన్నర్ చేద్దాం పదా అని తీసుకు వెళ్తాడు. ఒకవైపు వశిష్ట, రాగ సుధలు పారిపోయి ఒక చెట్టు దగ్గరికి వస్తారు. ఇక వశిష్ట, రాగసుధ (raga sudha) కోసం మంచి నీళ్ళు తెచ్చి ఇస్తాడు.
ఆలా వాళ్ళిద్దరూ జరిగిన దాని గురించి కొంత సేపు మాట్లాడుకుంటారు. మరోవైపు జిండే (Jinde) , ఆర్య లు ఒకచోట కలుసుకుని రాగసుధ గురించి సీరియస్ గా చర్చించుకుంటారు. ఈసారి రాగ సుధ (raga sudha) ను ఎలాగైనా చంపు అని జిండే ను ఆర్య డిమాండ్ చేస్తాడు.
మరోవైపు సుబ్బు (Subbu) , పద్దులు రాగసుధ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు రాగ సుధ (Raga sudha) పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో తలుపు మూసేస్తుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.