- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: నీకు నేనన్నా.. నా ప్రేమన్నా లెక్క లేదు.. యశ్ వల్ల వసంత్ కు బ్రేకప్ చెప్పిన చిత్ర!
Ennenno Janmala Bandham: నీకు నేనన్నా.. నా ప్రేమన్నా లెక్క లేదు.. యశ్ వల్ల వసంత్ కు బ్రేకప్ చెప్పిన చిత్ర!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు మే 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే యష్ (Yash) రౌడీలతో నేను ఫైట్ చేసినందుకు నువ్వు డిసప్పాయింట్ అయ్యావా అని వేదను అడుగుతాడు. అంతేకాకుండా వాళ్ళు నన్ను చితకొట్టి ఉంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే దానివా? అని అడుగుతాడు. దాంతో వేద (Vedha) అవును అని సమాధానం చెబుతుంది.
మరోవైపు వైపు చిత్ర (Chithra) వసంత్ కోసం ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక చిత్ర దగ్గరకు బయలుదేరిన వసంత్ కు యష్ ఫోన్ చేసి అర్జెంట్ గా ఆఫీస్ కు రా అని అంటాడు. ఒకవైపు చిత్ర వసంత్ ఇంకా రానందుకు కోపంగా చిరాకు పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో చిత్ర ఎన్ని సార్లు ఫోన్ చేసిన వసంత్ (Vasanth) యష్ పక్కన ఉండగా ఆన్సర్ చేయడు.
ఆ తర్వాత యష్ (Yash) ను తీసుకొని వసంత్ చిత్ర దగ్గరకు వెళతాడు. ఇక వసంత్ సారీ చిత్ర అని చెబుతుండగా చిత్ర గట్టిగా చెంప మీద కొడుతుంది. నీకు జాబు అంత ముఖ్యమైన అప్పుడు లవ్ ఎందుకు లవర్ ఎందుకు? అని చిత్ర (Chithra) చిరాకు పడుతుంది. ఇక నువ్వు వద్దు నీ లైఫ్ ఒద్దు అని బ్రేకప్ అని చెప్పేస్తుంది.
దాంతో వసంత్ (Vasanth) నువ్వు బ్రేకప్ అంటే నేను తట్టుకోలేను చిత్ర కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అని పట్టుకోడానికి ట్రై చేస్తాడు. ఇక పక్కనే ఉండి వింటున్న యష్ వసంత్ దగ్గరకు వచ్చి తనను ఆపి.. బ్రేక్ అప్.. బ్రేక్ అప్.. అంటూ నిన్ను బెదిరిస్తుందేంటి అని అడుగుతాడు. ఇక చిత్ర నీకు సెన్స్ లేదని యష్ (Yash) ను కూడా అంటుంది.
ఇక వసంత్ (Vasanth) నన్ను ఏమైనా అను..యష్ ను ఏమన్నా అంటే నేను ఊరుకోను అని అంటాడు. యష్ వసంత్ ను అక్కడినుంచి కోపంగా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యష్ (Yash) బిజినెస్ పార్ట్నర్ నా చెల్లెలిని మీ వసంత్ కు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అని అంటాడు.
కాగా తరువాయి భాగం లో యష్ (Yash) వసంత్ పెళ్లి మా బిజినెస్ పార్ట్నర్ చెల్లెలితో అని వేదకు చెబుతాడు. దాంతో వేద అప్పుడు అది ప్రేమ అవదు డీల్ అవుతుంది అని అంటుంది. ఇక యష్ మన పెళ్లి లో ప్రేమ ఉందా అని అడుగుతాడు. వేద (Vedha) ప్రేమ ఉంది అని చెబుతుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.