MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • OG-Varun Tej: ఓజీతో కొరియన్‌ కనకరాజు పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ.. అసలు విషయం బయటపెట్టిన మెగా ప్రిన్స్

OG-Varun Tej: ఓజీతో కొరియన్‌ కనకరాజు పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ.. అసలు విషయం బయటపెట్టిన మెగా ప్రిన్స్

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఓజీ` మూవీతో వరుణ్‌ తేజ్‌ నటించిన `కొరియన్‌ కనకరాజు` మూవీని పోల్చుతూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా దీనిపై వరుణ్‌ తేజ్‌ స్పందించారు. అసలు విషయం వెల్లడించారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 06 2026, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొరియన్‌ కనకరాజుతో రాబోతున్న వరుణ్‌ తేజ్‌
Image Credit : Asianet News

కొరియన్‌ కనకరాజుతో రాబోతున్న వరుణ్‌ తేజ్‌

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ఇప్పుడు `కొరియన్‌ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఈరోజు(గురువారం) సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ప్రదర్శించబడుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటించింది. సత్య కీలక పాత్ర పోషించాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రమిది. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకున్నాయి. సినిమాకి పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. అయితే ఈ చిత్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ`తో పోల్చుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఓజీతో పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ
Image Credit : Asianet News

ఓజీతో పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ

తాజాగా దీనిపై వరుణ్‌ తేజ్‌ స్పందించాడు. కళ్యాణ్ బాబాయ్ అభిమానులను చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా `ఓజీ`. అందులో జపనీస్ టచ్ ఉంది. అందుకే కొంతమందికి అలాంటి పోలిక అనిపించి ఉండొచ్చు. కానీ మా సినిమాకు 'OG'తో ఎలాంటి సంబంధం లేదు` అని తెలిపాడు వరుణ్‌. కొరియన్‌ భాష, లుక్‌ గురించి ఆయన మాట్లాడుతూ, కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. అదొక ఎగ్జైట్‌మెంట్‌ ఫీలింగ్‌. ఈ మూవీ విషయంలో కొరియన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకోవడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను. క్యారెక్టర్ డిజైన్ విషయంలో చాలా ప్లాన్ చేశాం. హెయిర్‌స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. కొరియన్లకు స్ట్రైట్, సిల్కీ హెయిర్ ఉంటుంది. అందుకే మొదటిసారి జుట్టుకు కలర్ కూడా వేశాను. మనకు ఆ స్టయిల్ వింతగా అనిపించొచ్చు. కానీ కొరియాలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు అదే హెయిర్‌స్టైల్‌తో చాలామందిని చూశాను` అని చెప్పాడు.

Related Articles

Related image1
Varanasi Leak: సింహాంలా కదిలిన మహేష్‌ బాబు.. పూనకాలు తెప్పిస్తోన్న `వారణాసి` లీక్ వీడియో
Related image2
Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?
34
కామెడీ చేయడం కష్టం ఏం కాదు
Image Credit : Asianet News

కామెడీ చేయడం కష్టం ఏం కాదు

ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత తన అభిప్రాయం చెబుతూ, దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటి నుంచే `ఈ స్టైల్‌లో ఇప్పటివరకు మీరు కనిపించలేదు` అని చెప్పేవాడు. 'F2', 'F3'లో కామెడీ చేసినా, ఇందులో నా పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు వరుణ్ తేజ్ కనిపించకూడదు... 'కనకరాజు' మాత్రమే కనిపించాలి, నన్ను కనకరాజు పేరుతో పిలిచేంతగా ఆ పాత్రలో ట్రాన్స్‌ఫర్మ్ కావాలని ప్రయత్నం చేశాను. నిజానికి ఒక నటుడు అన్ని రకాల పాత్రలు చేయాలి. నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అభిప్రాయం ఉంది. అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. 'కొరియన్ కనకరాజు'లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది.

44
సత్యతో సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి.
Image Credit : our own

సత్యతో సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి.

సత్యతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. మేమిద్దరం కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. సత్యను కేవలం కమెడియన్‌గా మాత్రమే చూడకూడదు. తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రలు చాలా కీలకం. ప్రేక్షకులు ఆ రెండు పాత్రలతో కనెక్ట్ కావాలంటే మేమిద్దరం చాలా హోమ్‌వర్క్ చేశాం. రాయలసీమ యాస నేర్చుకుని, కామెడీ టైమింగ్‌పై ప్రత్యేకంగా వర్క్ చేశాం. ఆ కసరత్తు సినిమాలో బాగా వర్కౌట్ అయింది. మా ఇద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు` అని చెప్పారు వరుణ్‌ తేజ్‌. మొత్తంగా ఈ మూవీతో హిట్‌ కొట్టబోతున్నామనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
Varanasi Leak: సింహాంలా కదిలిన మహేష్‌ బాబు.. పూనకాలు తెప్పిస్తోన్న `వారణాసి` లీక్ వీడియో
Recommended image2
Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved