MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?

Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?

వరుణ్‌ తేజ్‌, రితికి నాయక్‌ జంటగా నటించిన `కొరియన్‌ కనకరాజు` మూవీ ఈ నెల 7న రాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ వచ్చింది. మరి ఈ సారైనా వరుణ్‌ తేజ్‌ హిట్‌ కొడతాడా?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 05 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ నెల 7న వరుణ్‌ తేజ్‌ కొరియన్‌ కనకరాజు మూవీ
Image Credit : X/@UV_Creations

ఈ నెల 7న వరుణ్‌ తేజ్‌ కొరియన్‌ కనకరాజు మూవీ

వరుణ్‌ తేజ్‌ `ఫిదా` తర్వాత నుంచి హిట్‌ కోసం పోరాడుతూనే ఉన్నాడు. కానీ ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన `కొరియన్‌ కనకరాజు` చిత్రంలో నటించాడు. ఈ మూవీలో రితికా నాయర్‌ హీరోయిన్‌గా నటించగా, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సత్య కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ఈ నెల 7న విడుదల కాబోతుంది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది? వరుణ్‌ తేజ్‌కి ఈసారైనా హిట్‌ పడుతుందా? అనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొరియన్‌ కనకరాజు కథ ఇదే
Image Credit : X/@UV_Creations

కొరియన్‌ కనకరాజు కథ ఇదే

`కొరియన్‌ కనకరాజు` మూవీ కథ ఏంటంటే? ఏపీలో కియా కంపెనీ పెడతారు. అందులో ఉద్యోగానికి కొరియా నుంచి ఓ అమ్మాయి (రితికా నాయక్) వస్తుంది. ఆమె వెంట పడతాడు కనకరాజు (వరుణ్ తేజ్). అయితే... అనుకోకుండా కొరియా నుంచి వచ్చిన ఓ బాటిల్‌లోని ఆత్మ బయటపడి కనకరాజును ఆవహిస్తుంది. ఆ ఆత్మ ఓ గ్యాంగ్‌స్టర్‌ది. ఆ ఆత్మ కారణంగా కొరియా వెళ్లిన కనకరాజు అక్కడ ఏం చేశాడు? తన లవ్ సక్సెస్‌ అయ్యిందా? చివరకు ఏమైంది? అనేది సినిమా. సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికేట్‌ పొందింది. సినిమా రెండు గంటల 36 నిమిషాలు ఉండబోతుందట. సెన్సార్‌ నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చినట్టు సమాచారం.

Related Articles

Related image1
OTT Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న నాగదుర్గ సినిమా, ప్రైమ్‌ టాప్‌ 10లో తెలుగు మూవీస్‌ జోరు
Related image2
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్‌ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
34
కొరియన్‌ కనకరాజు ఫస్ట్ రివ్యూ
Image Credit : X/@UV_Creations

కొరియన్‌ కనకరాజు ఫస్ట్ రివ్యూ

సినిమాలో థమన్‌ సంగీతం హైలైట్‌గా నిలుస్తుందట. ఓజీ స్థాయిలో దీనికి మ్యూజిక్‌ ఇచ్చినట్టు సమాచారం. బీజీఎం అదిరిపోతుందని చిత్ర బృందం చెబుతోంది. మరి ఇప్పటికే సినిమా చూసిన వారి నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ సారి వరుణ్‌ తేజ్‌కి హిట్‌ కన్ఫమ్‌ అంటున్నారు. సినిమా హిలేరియస్‌గా ఉంటుందట. కామెడీ బాగుంటుందని, సత్య కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. వరుణ్‌ తేజ్‌, సత్య మధ్య వచ్చే సీన్లు పడిపడి నవ్వేలా ఉంటాయని చెబుతున్నారు. క్రాస్‌ కల్చర్‌ కాన్సెప్ట్ అదిరిపోతుందని టాక్‌. అలాగే మేర్లపాక గాంధీ టేకింగ్‌ బాగుంటుందని, స్క్రీన్‌ ప్లే తో ఆయన మ్యాజిక్‌ చేశారని చెబుతున్నారు. ఓవరాల్‌గా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు హిలేరియస్‌గా నవ్వించే చిత్రమవుతుందని సమాచారం.

44
వరుణ్ తేజ్‌కి హిట్‌ పక్కానా?
Image Credit : X/@UV_Creations

వరుణ్ తేజ్‌కి హిట్‌ పక్కానా?

వరుణ్‌ తేజ్‌, సత్యతోపాటు ఇందులో బుల్లిరాజు పాత్ర మరో హైలైట్‌ అని టాక్‌. తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడని అంటున్నారు. సినిమాలో వరుణ్‌ తేజ్‌ రెండు డిఫరెంట్‌ షేడ్స్ చూపిస్తాడట. రాయలసీమలోని పల్లెటూరి కుర్రాడిగా, కొరియన్‌ ఆత్మ ఆవహించిన తర్వాత గ్యాంగ్‌ స్టర్‌గా కనిపిస్తాడట. ఆయన యాస, భాష నవ్విస్తుందని అంటున్నారు. కాకపోతే కొన్ని చోట్ల కామెడీ ఓవర్‌ ట్రాక్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుందని, రొటీన్‌ అనిపిస్తుందని, కామెడీ అన్ని చోట్ల వర్కౌట్‌ కాలేదని, కొరియన్‌ సీన్లు పెద్దగా ఆకట్టుకునేలా ఉండవని మరో వాదన కూడా ఉంది. కామెడీ మీద ఫోకస్‌ పెట్టడంతో కథ గాడి తప్పిందని టాక్‌. హీరోయిన్‌ పాత్ర మాత్రం సర్‌ప్రైజ్‌ చేస్తుందట. చాలా వరకు సినిమా పాజిటివ్‌గానే ఉందని అంటున్నారు, హిట్‌ అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Related Stories
Recommended image1
OTT Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న నాగదుర్గ సినిమా, ప్రైమ్‌ టాప్‌ 10లో తెలుగు మూవీస్‌ జోరు
Recommended image2
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్‌ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved